చిత్రం : జగమెరిగిన సత్యం
నటీనటులు : అవినాష్ వర్మ, ఆద్యా రెడ్డి, నీలిమ తదితరులు
డైరెక్టర్ : తిరుపతి పాలే
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
బ్యానర్ : అమృత సత్యనారాయణ క్రియేషన్స్
Jagamerigina Satyam Review : ‘జగమెరిగిన సత్యం’ సినిమాతో మాస్ మహారాజ్ రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆద్య రెడ్డి ఇందులో హీరోయిన్ గా నటించగా, తిరుపతి పాలే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిన్న సినిమాను అమృత సత్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత విజయ భాస్కర్ నిర్మించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది? ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
సత్యం అనే ఒక యువకుడు తెలంగాణలోని ఓ చిన్న ఊర్లో నివసిస్తాడు. అతని జీవితం ఆధారంగానే స్టోరీ మొత్తం నడుస్తుంది. పైకి సాదాసీదాగా కనిపించే సత్యం ఆత్మవిశ్వాసం, ప్రేమ, బాధ, త్యాగం వంటి ఎమోషన్స్ తో కథనం నడిపిస్తాడు. ఇక సత్యం చుట్టూ నడిచే ఈ కథ కేవలం ఓ వ్యక్తి కథ కాదు… ఓ ఊరు, ఓ భూమి స్టోరీ. ఈ సినిమాలో నడిచే పాత్రలు అన్నింటినీ మనం నిజ జీవితంలో ముందే ఎక్కడో ఒకచోట చూసినట్టే అనిపిస్తుంది. అంటే ఎమోషనల్ టచ్ అలా ఉంటుందన్న మాట. సినిమాలో చిన్న చిన్నమ్మతో అతని అనుబంధం, మనిషి విలువలు, లైఫ్ లో వచ్చే సవాళ్లు, గ్రామంలోని పాలిటిక్స్ వంటి అంశాల ఆధారంగా స్టోరీ నడుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో స్టోరీ ఎమోషనల్ టర్న్ తిరుగుతుంది. సత్యం జీవితంలో వచ్చే తిరుగుబాటు, తన విలువలు, చివరికి ఊరిని ఒక కొత్త దిశలో తీసుకెళ్లే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లతో సినిమా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ హై పాయింట్ సినిమాకు ఆయువు పట్టు లాంటిది.
విశ్లేషణ
‘జగమెరిగిన సత్యం’ సినిమాలో గ్లామర్ లేదు కానీ, తెలంగాణ గ్రామీణ జీవితాన్ని తెరపై ఆకట్టుకునే విధంగా ఆవిష్కరించడానికి ప్రయత్నించాడు దర్శకుడు. అందులో భాగంగా కథ, పాత్రలు, సినిమాటోగ్రఫీ, నటన అన్ని సహజత్వంతో ఉండేలా చూసుకున్నాడు. అయితే కొన్ని చోట్ల స్టోరీ నెమ్మదిగా సాగిన ఫీలింగ్ వస్తుంది. ఇక హీరోగా నటించిన అవినాష్ స్వయానా రవితేజకు మేనల్లుడే. అయినప్పటికీ సినిమాకు పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడం బిగ్గెస్ట్ మైనస్. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. అలాగే ప్రమోషన్స్ తో ప్రేక్షకుల దృష్టిని మరల్చి ఉంటే ఈ మూవీకి కూడా ఆశించిన రిజల్ట్ దక్కేదేమో.
ప్లస్ పాయింట్స్
విజువల్స్
హీరో యాక్టింగ్
కథనం
రైటింగ్
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం
పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు
చివరగా
తెలంగాణ ఎమోషనల్ రూరల్ డ్రామా ఇది. అలాంటి సినిమాలను ఇష్టపడే వారికి, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూసేవారికి నచ్చే మూవీ.
Jagamerigina Satyam Rating : 2.5