Mercury Transit 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ సంచారం అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. దీని ప్రభావం 12 రాశిచక్రాలపై కనిపిస్తుంది. బుధ గ్రహ సంచారాన్ని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. సౌర వ్యవస్థలో బుధుడు అతి చిన్న గ్రహం. దీనిని గ్రహాల యువరాజు అని కూడా పిలుస్తారు. జ్యోతిషశాస్త్రంలో.. బుధుడిని తెలివితేటలు, తర్కం, వాక్చాతుర్యం , వ్యాపారానికి బాధ్యత వహించే గ్రహంగా పరిగణిస్తారు. మిథునం, కన్య రాశులకు అధిపతి గ్రహం కూడా బుధుడే.
బుధుడి సంచారం ఇతర రాశుల వ్యక్తులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. త్వరలోనే మరోసారి బుధుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. జ్ఞానానికి మూలమైన బుధుడు మే 17, 2025న మేషరాశిలో అస్తమిస్తాడు. జూన్ 8, 2025న సాయంత్రం 7:53 గంటలకు ఉదయిస్తాడు. ఇలాంటి పరిస్థితిలో.. కొన్ని రాశుల వ్యక్తులు కెరీర్‌లో విజయం సాధిస్తారు. అంతే కాకుండా వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
బుధుడు వృషభ రాశిలో ఉదయించడంతో మీ పనిలో ఎదురయ్యే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అంతే కాకుండా మీరు మీ పనిలో విజయం సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. బుధ గ్రహ ప్రభావం వల్ల.. మీ తార్కిక శక్తి పదును పెరుగుతుంది. ఇది నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది. అంతే కాకుండా వ్యాపారవేత్తలకు లాభాల కోసం కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లే అవకాశం లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. పెట్టుబడి, ఆస్తి, విద్యలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. మత పరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మీ వైవాహిక సంబంధం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలను అందుకుంటారు. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంది.
మిథున రాశి:
ఈ రాశి వారికి ఈ సమయం ప్రత్యేకంగా ఉంటుంది. గతంలో వ్యాపారంలో ఆర్థిక నష్టం ఉంటే.. ఇప్పుడు లాభం పొందే అవకాశాలు ఉంటాయి. మీ కెరీర్ , వ్యాపారంలో మీరు వృద్ధిని చూస్తారు. అంతే కాకుండా మీ ఆరోగ్యం కూడా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. పెట్టుబడిలో లాభం, ఆర్థిక ప్రణాళికలలో విజయాలు పెరుగుతాయి. ఈ సమయంలో.. చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు కూడా శుభవార్త వింటారు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది.
Also Read: గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు
తులా రాశి:
బుధుడు సంచారం వల్ల తులారాశి వారికి ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. అంతే కాకుండా పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు , పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు మంచి ఫలితాలను పొందుతారు. కొత్త ఉద్యోగం పొందే వారికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మీరు మీ ఆఫీసుల్లో గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సమయం ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుంది. మీరు నమ్మకంగా తీసుకునే నిర్ణయాలు మీకు అదృష్టాన్ని చేకూరుస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ముందుకు సాగుతుంది.