Thug Life Movie Review : కమల్ హాసన్ కెరీర్లో 234 వ ప్రాజెక్టుగా తెరకెక్కింది ‘థగ్ లైఫ్’. ‘నాయగన్’ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమల్ చేసిన సినిమా ఇది. 38 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమా కూడా కావడం వల్ల.. వీళ్ళ అభిమానులు ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘థగ్ లైఫ్’ టీజర్, ట్రైలర్ కూడా వాళ్ళని ఆకట్టుకున్నాయి. తమిళ స్టార్లు శింబు, త్రిష కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అభిరామి కమల్ సరసన నటించింది. రెహమాన్ సంగీతం, రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ వంటివి ప్రమోషన్స్ కి ఉపయోగపడ్డాయి. మరి ఇన్ని విశిష్టతలు కలిగిన ‘థగ్ లైఫ్’ ప్రేక్షకులను మెప్పించిందో.. లేదో, ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
కథ :
రంగరాయ శక్తివేల్ నాయకర్ (కమల్ హాసన్) ఓ గ్యాంగ్స్టర్. సదానంద్ (మహేష్ మంజ్రేకర్) అతనికి విరోధి. అమరన్(సిలంబరసన్ అలియాస్ శింబు) అనే అనాధని రంగరాయ శక్తివేల్ చిన్నప్పటి నుండి చేరదీసి పెంచుతాడు. అయితే అమరన్.. శక్తివేల్ పై పగతో ఉంటాడు. అతన్ని దెబ్బ కొట్టడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. మరోపక్క శక్తివేల్ కొన్ని కారణాల వల్ల కుటుంబానికి దూరమై జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అతను జైలు నుండి వచ్చాక.. అమరన్ ఏం చేశాడు? అసలు శక్తివేల్ పై అమరన్ కి ఉన్న పగ ఎందుకు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
మణిరత్నం సినిమా అంటే ఆసక్తిగా ఎదురుచూసే జనాలు ఎంత మంది ఉన్నారో, కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యే జనాలు కూడా అంతేముంది ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది ప్రేక్షకులు మణిరత్నం సినిమాలు మొదలవ్వగానే నిద్రపోతుంటారు. ఆయన టేకింగ్ అలా ఉంటుంది. ప్రతి విషయానికి డిటైలింగ్ ఎక్కువగా ఇవ్వాలని పరితపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో డ్రామా ఎక్కువవుతుంది, ఎమోషన్స్ ఉంటాయి.
సంభాషణలు కూడా..! అలాంటి టైంలో ఎంటర్టైన్మెంట్ ల్యాక్ అయిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ‘థగ్ లైఫ్’ విషయంలో కూడా సేమ్ సినారియో ఉంటుంది అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు. సినిమా ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ల పరిచయం, ఆ బ్యాక్ గ్రౌండ్, సెటప్ వంటివి పర్వాలేదు అనిపిస్తాయి. కానీ ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు కథపై ఒక క్లారిటీ రాదు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించేలా ముగుస్తుంది.
సెకండాఫ్లో ఏవైనా అద్భుతమైన ఎలిమెంట్స్ ఉంటాయేమో అనుకుంటాం. కానీ అలాంటివి ఏమీ ఉండవు. ప్రేక్షకుల సహనానికి మరింత పరీక్ష పెట్టించే విధంగా మణిరత్నం సీన్స్ ను డిజైన్ చేశారు. రెహమాన్ సంగీతం ఎక్కడా కూడా ఆసక్తిని కలిగించదు. పైగా నాన్ సెన్స్ అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. నిర్మాణ విలువలు ముఖ్యంగా రవి కె చంద్రన్ సినిమాకి ఆయువు పట్టు చెప్పుకోవచ్చు. రన్ టైం 2 గంటల 40 నిమిషాలు పైనే ఉంది. రెండో రోజు నుండి అది కాస్త తగ్గిస్తే.. ప్రేక్షకుల పై భారం దింపిన ఫీలింగ్ ఇస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది. ఎప్పటిలానే అతని రేంజ్ కు తగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. వయసు మీద పడుతున్నా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. అభిరామి కూడా నేచురల్ గా చేసింది. త్రిష పాత్రకి సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదు. శింబు బాగా చేసినా.. అతని స్క్రీన్ ప్రెజన్స్ తక్కువగా ఉండటం ఒక డిజప్పాయింట్మెంట్. నాజర్ బాగానే చేశాడు. కానీ అతని పాత్రలో కొత్తదనం ఏమీ లేదు. మిగతా నటీనటులు తెరపై నిండుగా కనిపించారు అంతే..!
ప్లస్ పాయింట్స్ :
కమల్ హాసన్
ప్రొడక్షన్ వాల్యూస్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
స్లో నెరేషన్
ప్రెడిక్టబుల్ సీన్స్
త్రిష ట్రాక్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మొత్తంగా.. ‘థగ్ లైఫ్’ కి గ్రాండ్ సెటప్ ఉంది. కానీ కథ, కథనాలు ఆ స్థాయిలో లేదు. మణిరత్నం ఇంకా 90 లలోనే స్ట్రక్ అయిపోయారు అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. కేవలం కాంబినేషనల్ క్రేజ్ తో బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకోవాలనుకునే ఆశతోనే ఆయన ఈ సినిమా తీసినట్టు ఉంది.
Thug Life Movie Rating : 2/5