OTT Movie : హర్రర్ సినిమాలను ఏ భాషలో వచ్చినా వదలకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. రీసెంట్ గా ఈ జానర్ లో వస్తున్న సినిమాలు రికార్డ్ కలెక్షన్స్ సాధించాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా యూట్యూబర్‌ల చుట్టూ తిరుగుతుంది. ఒక అడవిలో ఉండే అతీంద్రీయ శక్తులను కేమరాలో బంధించాలని అనుకుంటారు. ఆ తరువాత స్టోరీ బీభత్సంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మర్మర్’ (Murmur). 2025లో విడుదలైన ఈ తమిళ సినిమాకు హేమ్‌నాథ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యువిఖా రాజేంద్రన్, సుగన్య షణ్ముగం, ఆరియా సెల్వరాజ్, రిచీ కపూర్, దేవరాజ్ ఆరుముగం ప్రధాన పాత్రలు పోషించారు. ఇది తమిళ భాషలో విడుదలైన ఒక ఫౌండ్-ఫుటేజ్ హారర్ చిత్రం. ఈ సినిమా 2025 మార్చి 7 న థియేటర్లలో విడుదలైంది. ఏప్రిల్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) , టెంట్ కొట్టా (Tentkotta) లలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఒక యూట్యూబర్‌ల బృందం, తమ ఛానల్ కోసం ఉత్కంఠభరితమైన కంటెంట్‌ను సృష్టించేందుకు ఒక సాహసం చేయాలనుకుంటారు జవధు హిల్స్‌లోని ఒక గ్రామంలోని స్థానిక ఇతిహాసాల గురించి తెలుసుకోవాలనుకుంటారు. అయితే స్థానికులు ఈ అడవి గురించి వీళ్ళను హెచ్చరిస్తారు. అక్కడ సప్త కన్నిగల్ (ఏడు దేవతలు) స్నానం చేసే ఒక పవిత్ర సరస్సు ఉందని. ఎవరైనా వారి ఆచారాన్ని భంగం చేస్తే, వారు కోపంతో శపిస్తారని చెబుతారు. అలాగే మంగై అనే స్త్రీ, ఒకప్పుడు గ్రామంలో నివసించి చేతబడులు చేసి, ఇప్పుడు ఒక ఆత్మగా మారినట్లు చెప్తారు. ఈ కథలు యూట్యూబర్‌ల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. అంతేకాకుండా ఈ అతీంద్రియ సంఘటనలను కెమెరాలో బంధించడానికి అడవిలోకి ప్రవేశిస్తారు.
ఇక వీళ్ళు అడవిలోకి ప్రవేశించిన తర్వాత, విచిత్రమైన సంఘటనలను ఎదుర్కొంటారు. వారి టెంట్ జిప్పర్‌లు రాత్రి సమయంలో ఆటోమాటిగ్గా తెరుచుకోవడం, నీళ్ల బాటిల్స్ కదలడం, అడవిలో వింత శబ్దాలు వినిపించడం వంటి ఘటనలు జరుగుతాయి. ఈ సంఘటనలు మొదట్లో వారికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి, ఎందుకంటే వారు తమ కంటెంట్‌కు ఇది గొప్ప అవకాశమని భావిస్తారు.
అడవిలో వీళ్ళంతా కలసి ఒక ఓజా బోర్డ్ గేమ్ కూడా ఆడతారు. ఈ బృందం అడవిలోకి వెళ్లిన కొద్దీ, వారు ఎదుర్కొనే అతీంద్రియ సంఘటనలు మరింత తీవ్రమవుతాయి. మంగై ఆత్మ వారిని వెంటాడుతుంది. అంతే కాకుండా వీళ్ళంతా సప్త కన్నిగల్ స్నానం చేసే పవిత్ర సరస్సు వద్దకు చేరుకుంటారు. మెల్విన్, మద్యం మత్తులో, ఈ సరస్సు వద్ద దేవతల ఆచారాన్ని భంగం చేస్తాడు. ఇది వారి కోపానికి కారణమవుతుంది. చివరికి మంగై ఆత్మ వీళ్ళను ఏం చేస్తుంది ? సప్త కన్నిగల్ చేతిలో శాపాన్ని ఎదుర్కుంటారా ? వీళ్ళంతా ప్రాణాలతో బయటపడతారా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : నడిరోడ్డుపై ఒంటరి మహిళ… పోలీసుల కోసమని వెళ్ళి సైకో చేతిలో బుక్కయ్యే ఫ్రెండ్స్