Akkada Ammayi Ikkada Abbayi Movie Review : బుల్లితెర యాంకర్ ప్రదీప్ కి స్టేటస్ ఉంది. అందుకే అతను హీరోగా మారి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా చేశాడు. అది బాగానే ఆడింది. ఇప్పుడు రెండో సినిమాగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ పెట్టుకోవడం వల్ల.. కొంచెం బజ్ క్రియేట్ అయ్యింది. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
బైరిలంక అనే గ్రామం. అక్కడ ఓ తరంలో ప్రతి కుటుంబంలోనూ మగపిల్లలే జన్మిస్తారు. దాదాపు 60 మంది మగపిల్లల తర్వాత ఓ కుటుంబంలో అమ్మాయి పుడుతుంది. ఆమెనే రాజకుమారి (దీపికా పిల్లి). ఆమె పుట్టిన తర్వాత ఊరికి చాలా మంచి జరిగింది అని అక్కడి జనాలు భావిస్తారు. అందుకే ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఆమె ఆ ఊరు దాటి వెళ్ళకూడదు అని డిసైడ్ అవుతారు.
ఒకవేళ ఆమె పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఆ ఊరిలోనే 60 మంది అబ్బాయిల్లోనే ఎవరో ఒకర్ని ఆమె పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అవుతారు. కట్ చేస్తే ఆ ఊరుకి బాత్రూమ్స్ నిర్మించే ప్రాజెక్టు కోసం సివిల్ ఇంజనీర్ కృష్ణ(ప్రదీప్ మాచిరాజు) వస్తాడు. అతనితో రాజా ప్రేమలో పడుతుంది. కృష్ణ కూడా ఆమెను ప్రేమిస్తాడు. కానీ వీరి ప్రేమకి ఊరి జనాలు ఒప్పుకున్నారా? తర్వాత ఏమైంది? అసలు కృష్ణ ఆ ఊరికే ప్రాజెక్టు పనిమీద ఎందుకు రావాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.?
విశ్లేషణ :
ప్రదీప్ మాచిరాజుని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాం అంటే కొన్ని ఈక్వేషన్లు, కాలిక్యులేషన్లు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే సందీప్ బొల్ల, దర్శక ద్వయం నితిన్ – భరత్..లు ఈ కథని డిజైన్ చేసుకున్నారు. అలా అని కథలో కొత్తదనం ఏమీ లేదు..! కానీ ప్రదీప్ సినిమా అనేసరికి ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి? వేటిని డెలివరీ చేయాలి? అనే లెక్కలు బాగా వేసుకున్నారు.
ముఖ్యంగా ప్రదీప్ నుండి ఆశించే ఎంటర్టైన్మెంట్ మిస్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ ను బాగా లాక్కొచ్చిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. అయితే సెకండాఫ్ కి వచ్చే సరికి కొంచెం బోర్ కొడుతుంది. సరైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకపోవడం వల్ల కథనం ఎక్కడెక్కడికో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి టైంలో క్లైమాక్స్ లో ఒక చిన్నపాటి ట్విస్ట్ వంటిది ఇచ్చి మమ అనిపించేశారు. ఇక టెక్నికల్ గా సినిమా రిచ్ గానే కనిపిస్తుంది. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కి కూడా పేరు పెట్టాల్సిన పనిలేదు.
నటీనటుల విషయానికి వస్తే.. ప్రదీప్ మాచిరాజు టీవీ షోల్లో చేసినట్టే మంచి లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అతని కామెడీ టైమింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎమోషనల్ గా అతను ఇంకా ఎక్కడో మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. దీపిక పిల్లి అందంగా కనిపించింది.స్క్రీన్ ప్రెజన్స్ పక్కన పెడితే.. నటనతో పెద్దగా మెప్పించింది లేదు. బ్రహ్మాజీ, సత్య, గెటప్ శ్రీను, కోదాటి పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళ కామెడీ బాగా పేలింది. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్..లు సర్ప్రైజింగ్ రోల్స్ పెద్దగా ఇంపాక్ట్ఫుల్ గా లేవు. మిగతా నటీనటులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
కామెడీ
ప్రదీప్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ లో వచ్చే ల్యాగ్
మొత్తంగా… ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ లో ‘పరుగు’ ‘మర్యాద రామన్న’ వంటి పాత సినిమాల పోలికలు ఉన్నాయి. కానీ కామెడీ వర్కవుట్ అవ్వడం వల్ల టైం పాస్ చేయిస్తుంది. సెకండాఫ్ పై మేకర్స్ ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది.
Akkada Ammayi Ikkada Abbayi Movie Rating : 2.25 /5