CM Chandrababu : సోషల్ మీడియా సైకోలకు చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఆడపిల్లలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని, ఎవరైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే లాస్ట్ డే అవుతుందన్నారు సీఎం.
చంద్రబాబు క్లియర్ కట్‌గా…
చంద్రబాబు తేల్చి చెప్పేశారు. అలాంటి చిల్లర కామెంట్లను ఉపేక్షించబోనని క్లారిటీ ఇచ్చేశారు. అది వైసీపీ అయినా.. సొంతపార్టీ టీడీపీ అయినా. తప్పు తప్పే. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే.. అదే మీకు లాస్ట్ డే అంటూ మునుపెన్నడూ లేనంత ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీ కంట్రోల్ కంట్రోల్..
చేబ్రోలు కిరణ్ ఎపిసోడ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఎంత సీరియస్‌గా తీసుకున్నారో చెప్పడానికి ఈ డైలాగ్ ఒక్కటి చాలు. క్లీన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ టీడీపీ. వైసీపీ సోషల్ మీడియా ఎంతగా రెచ్చిపోతున్నా.. తెలుగు తమ్ముళ్లు మాగ్జిమమ్ కంట్రోల్‌గానే ఉన్నారు. అప్పుడప్పుడూ హద్దు మీరినా.. అలాంటి ఉదంతాలు తక్కువే. కానీ, లేటెస్ట్ ఘటన మాత్రం అలా లైట్ తీసుకునేది కాదు. అధికారంలో ఉన్నారు కాబట్టి కాస్త బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కానీ, ఐటీడీపీ కార్యకర్త కిరణ్ మాత్రం టూమచ్ చేశాడు. జగన్ భార్య భారతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో వైరల్ అయింది. రాజకీయ రచ్చ రాజుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే అలర్ట్ అయ్యారు. చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుంచి సస్సెండ్ చేశారు. అక్కడితో ఆగిపోలేదు యాక్షన్.
కిరణ్‌కు కిరాక్ ట్విస్ట్
టీడీపీ కార్యకర్త అయితేనేం? ఎవరైతేనేం? వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కిరణ్‌పై కేసు నమోదైంది. గంటల వ్యవధిలోనే ఇబ్రహీంపట్నంలో చేబ్రోలు కిరణ్‌ను పట్టుకున్నారు పోలీసులు. కిరణ్‌ను లాక్కొచ్చి కారులో పడేశారు. గుంటూరు తీసుకొస్తుండగా.. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడి చేయబోతే.. ఆయన్ను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కిరణ్‌పై కఠినమైన సెక్షన్లు నమోదు చేసి శిక్ష పడేలా చేస్తామని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
Also Read : వదినమ్మకు షర్మిల సపోర్ట్.. ఆ సైకో, సైతాన్ సైన్యానికి..
సభ్యసమాజానికి మంచి మెసేజ్
చేబ్రోలు కిరణ్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. మహిళలను వేధిస్తే అదే లాస్ట్ డే అవుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీ పార్టీ, మా పార్టీ అనే తేడా లేకుండా తప్పు ఎవరు చేసిన లోపలేసి, తాట తీస్తామని కిరణ్ కేసుతో సభ్యసమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు.