Saree Movie Review : ఈ వారం అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి. కొద్దో గొప్పో వార్తల్లో నిలిచిన సినిమా అంటే ‘శారీ’ అనే చెప్పాలి. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకి ఎలాంటి ఫీలింగ్ ను కలిగించిందో ఓ లుక్కేద్దాం రండి :
కథ :
ఆరాధ్య (ఆరాధ్య దేవి) ఓ కాలేజీ స్టూడెంట్. ఆమెకు చీరలు, చీర కట్టుకోవడం అంటే మహా ఇష్టం. కొత్త చీరలు కనిపించాయి అంటే చాలు అవి కట్టుకుని మురిసిపోతూ ఉంటుంది. అంతేకాదు చీరలు కట్టుకుని రీల్స్ కూడా చేస్తూ ఉంటుంది. వాటికి వచ్చిన కామెంట్లని.. ముఖ్యంగా పొగుడుతూ వచ్చిన కామెంట్లని చూసి మురిసిపోతూ ఉంటుంది. తర్వాత ఆమె ఒక పార్క్ కి వెళ్తే.. అక్కడ ఆమెను చూసి ప్రేమలో పడిపోతాడు ఫొటోగ్రాఫర్ కిట్టు (సత్య యాదు). తర్వాత ఆరాధ్య దేవికి తెలీకుండా ఆమెను ఫాలో అవుతాడు.
సోషల్ మీడియాలో ఆమెకి రిక్వెస్ట్ పెట్టి.. చాటింగ్ చేయడం మొదలుపెడతాడు. ఆమె కూడా ఇతని మాయలో పడిపోతుంది. తర్వాత ఇతన్ని రెగ్యులర్ గా కలుస్తూ ఉంటుంది. ఒకసారి ఆరాధ్య దేవి అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్) తో కిట్టు గొడవ పడతాడు. దీంతో కిట్టుని దూరం పెడుతుంది ఆరాధ్య. అయితే ఆ తర్వాత ఆమెకు మాయ మాటలు చెప్పి ఒక చోటికి రమ్మని.. అక్కడ ఆమెను కిడ్నాప్ చేస్తాడు కిట్టు. అక్కడ ఆమెను చాలా సేపు వేధిస్తాడు. తర్వాత ఆమె బయటపడిందా? లేదా అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు ఏవీ కూడా తల తోక లేకుండా ఉంటున్నాయి అనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘శారీ’ సినిమాని కూడా చాలా మంది ఇలాగే ప్రిపేర్ అయ్యి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇది చాలా వరకు బెటర్. అలాగని గొప్పగా ఉంది అనడం లేదు. సినిమాలో కొంచెం మీనింగ్ ఉంది. ‘అమ్మాయిల్లో ఉండే ఫాంటసీ థాట్స్.. అబ్బాయిల్లో ఉండే క్రూయల్ థాట్స్..క్లాష్ అయితే ఎలా ఉంటుంది’ అనే పాయింట్ లో సినిమా టేకాఫ్ అవుతుంది. ఆరాధ్య దేవి లుక్స్ బాగున్నాయి.
అయితే ఆమె అందంపైనే రాంగోపాల్ వర్మ ఫోకస్ పెట్టి.. కెమెరా యాంగిల్స్ మళ్లించాడు. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఇది ఫీస్ట్. వాళ్లలో కూడా కిట్టు ఉన్నాడు అనే సంగతి గుర్తుచేస్తూనే ఉంటాయి ఆ విజువల్స్. ఆమె గ్లామర్ చూసి ఆనందపడే బ్యాచ్ కి ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ వాళ్ళకి కూడా కష్టంగా అనిపిస్తుంది. ఒకే చోట కథ సాగుతున్న ఫీలింగ్, వయొలెన్స్ వంటివి పరమ బోర్ కొట్టిస్తాయి.
సోషల్ మీడియా వల్ల అమ్మాయిలకి ఎలాంటి ప్రమాదాలు వస్తాయి? సోషల్ మీడియాని ఎంత మోతాదులో వాడాలి? అనే అంశాలని తన శైలిలో చెబుతూ.. తెలీకుండానే ఒక మెసేజ్ ఇచ్చాడు వర్మ. సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టినట్టు ఏమీ అనిపించదు. ‘బాద్ షా’ లో ఎన్టీఆర్ చెప్పినట్టు ఈ కథకి ఏ లొకేషన్ అయినా ఎక్కువే, ఎంత బడ్జెట్ అయినా ఎక్కువే ‘ అన్నట్టు ఉంటుంది.
నటీనటుల విషయానికి వస్తే.. ఇందులో ఎక్కువ మంది నటీనటులు లేరు. ఆరాధ్య దేవి గ్లామర్ మాత్రమే సినిమా మొత్తానికి హైలెట్. దాని ముందు ఆమె కనపరిచిన నటన కూడా డామినేట్ అయిపోయింది. భవిష్యత్తులో ఈమె హీరోయిన్ గా రాణించినా.. లేకపోయినా? గ్లామర్ సాంగ్స్ కి అయితే మంచి ఆప్షన్ అనిపిస్తుంది. ఇక సత్య యాదు సైకోగా లుక్ బాగుంది. కానీ వర్మ సినిమాల్లో ఇలాంటి పాత్రలు కొత్తగా ఏమీ ఉండటం లేదు. మిగిలిన నటీనటులకు పెద్దగా స్కోప్ ఉన్న పాత్రలు ఏమీ దక్కలేదు.
ప్లస్ పాయింట్స్ :
ఆరాధ్య గ్లామర్
రన్ టైం
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్
క్లైమాక్స్
వయొలెన్స్
మొత్తంగా.. ‘శారీ’ రీసెంట్ టైంలో రాంగోపాల్ వర్మ తీసిన సినిమాల్లో కొంచెం బెటర్. ఆరాధ్య దేవి అందాల కోసం ఓటీటీలో ట్రై చేయొచ్చు. థియేటర్ కి వెళ్లి చూసే రేంజ్లో అయితే లేదు. ‘శారీ’ నాట్ స్కేరీ.. బట్ సారీ
Saree Telugu Movie Rating : 2/5