BigTV English
Advertisement

Ram Nagar Bunny Review : ‘రామ్ నగర్ బన్నీ ‘ రివ్యూ… యాటిట్యూడ్ స్టార్ కు హిట్ పడినట్టేనా?

Ram Nagar Bunny Review : ‘రామ్ నగర్ బన్నీ ‘ రివ్యూ… యాటిట్యూడ్ స్టార్ కు హిట్ పడినట్టేనా?

Ram Nagar Bunny Review Rating : బుల్లితెర మెగాస్టార్ భాస్కర్ తనయుడు చంద్రహాస్ హీరోగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రామ్ నగర్ బన్నీ’. ఈ హీరో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే యాటిట్యూడ్ కారణంగా ఏ రేంజ్ లో ట్రోల్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అయితే ‘బుల్లితెర మెగాస్టార్ వారసుడిని.. యాటిట్యూడ్ ఉంటే తప్పేంటి.. ఇలాగే ఉంటాను ట్రోల్ చేసుకుంటే చేసుకోండి.. ఇదే యాటిట్యూడ్ ను బిరుదుగా చేసుకుంటాను’ అంటూ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గా ‘రామ్ నగర్ బన్నీ’ సినిమాతో మన ముందుకు వచ్చేసాడు ఈ యంగ్ హీరో. అంతేకాకుండా ‘ఫుల్ ఆటిట్యూడ్ ఏంటో సినిమాలో చూపిస్తాను. నచ్చితే బాగుందని, నచ్చకపోతే ఆ టికెట్ తీసి నాకు పెడితే చాలు డబ్బులు రీఫండ్ ఇస్తాను’ అంటూ మరింత యాటిట్యూడ్ తో చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఈ యాటిట్యూడ్ స్టార్ట్ నమ్మకం వర్కౌట్ అయ్యిందా? హీరోగా ఫస్ట్ మూవీతో హిట్ కొట్టాడా? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


కథ : 

రామ్ నగర్ అనే ఏరియాలో ఉండే బన్నీ బీటెక్ ఫెయిల్ అయ్యి, అమ్మాయిల చుట్టూ తిరిగే అబ్బాయి. తండ్రి మురళీధర్ కష్టపడి ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తుంటే కొడుకు మాత్రం బాధ్యత లేకుండా తిరిగుతాడు. కూతురు పెళ్లి చేయడానికి ఆరు లక్షల డబ్బుని కూడబెడితే ఇంటి బాధ్యత తెలియని బన్నీ ఆ డబ్బుని కాజేసి జల్సాల కోసం ఖర్చు పెడతాడు. ఈ నేపథ్యంలోని ఈ అమ్మాయిల పిచ్చోన్ని పక్క బస్తిలో ఉండే అమ్మాయి ఇష్టపడుతుంది. అయితే అతనికి ఆ విషయం తెలిసినా పెద్దగా పట్టించుకోడు. కానీ ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో ప్రేమాయణం నడిపిస్తాడు. అలా తను ప్రేమిస్తున్నాను అనుకునే ఒక అమ్మాయి మాజీ లవర్ తో రొమాన్స్ లో మునిగితేలుతూ షాక్ ఇస్తుంది. దీంతో లవ్ అంటే ఆప్షన్, కాదు నిజమైన ప్రేమ అని తెలుసుకున్న బన్నీ తన కోసం సర్వస్వం అర్పించిన శైలుని వెతుక్కుంటూ పిచ్చోడిలా మారుతాడు. ఈ నేపథ్యంలోనే తనకంటే పెద్దదైన తార ఆంటీ తో బలవంతంగా అతను పెళ్లి పీటలు ఎక్కాల్సి వస్తుంది. మరి చివరికి బన్నీ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఆంటీని పెళ్లి చేసుకున్నాడా? శైలు దొరికిందా? అన్న విషయం తెలియాలంటే ‘రామ్ నగర్ బన్నీ’ మూవీని తెరపై చూడాల్సిందే.


విశ్లేషణ

సోషల్ మీడియా పుణ్యమా అని ట్రోలింగ్ తో ఫేమస్ అయిన కుర్రాడు చంద్రహాస్. యాటిట్యూడ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో నటించిన ఫస్ట్ మూవీ ‘రామ్ నగర్ బన్నీ’ చూస్తున్నంత సేపు పర్లేదు ఓకే అన్నట్టుగా ఉంటుంది. ఇంతకుముందే ఇలాంటి సినిమాలు చాలా చూసాము అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక సినిమాలో వచ్చే కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్, రెండు ఫైట్లు, నాలుగు పాటలు.. ఇలా రొటీన్ ఫార్ములాతో సినిమాను తీశారు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. చంద్రహాస్ నటనను ఎమోషనల్ సీన్స్ లో చూడడం కష్టమే. హీరోయిన్ విస్మయతో పాటు మిగతా ముగ్గురు అమ్మాయిలు ఓకే అనిపిస్తారు. కానీ బయటకు వచ్చాక వాళ్ళ ఫేస్ అస్సలు గుర్తు కూడా ఉండదు. టెక్నికల్ గా మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ బాగానే ఉన్న డ్రోన్ షాట్స్, ఒక పాటలోని సీన్స్ బాలేవు. అలాగే సినిమాలోని రెండు పాటలు మాత్రం బాగున్నాయి. డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ పాత లైన్ తీసుకుని, దానికే కిస్సులు, బెడ్ రూమ్ సీన్లతో నింపేసి ట్రెండ్ ను ఫాలో అవ్వడానికి ట్రై చేశాడు. నిర్మాణ విలువలు పర్లేదు. మరి చంద్రహాస్ యాటిట్యూడ్ ఎంత వరకు వర్కౌట్ అయిందో తెలియాలంటే కలెక్షన్ వివరాలు వచ్చేదాకా ఆగాలి.

మొత్తానికి… యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అయితే చాలు అనుకునే వారు ఓసారి చూడగలిగే మూవీ.

Ram Nagar Bunny Review Rating – 2/5

Related News

Mass Jathara Movie Review : ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ – ‘క్రాక్’ జాతర

Mass Jathara Twitter review : మాస్ జాతర ట్విట్టర్ రివ్యూ

Baahubali: The Epic Review : “బాహుబలి ది ఎపిక్” రివ్యూ… రెండో సారి వర్త్ వాచింగేనా?

Baahubali The Epic Twitter Review : ‘బాహుబలి ది ఎపిక్’ ట్విట్టర్ రివ్యూ..మళ్లీ హిట్ కొట్టేసిందా..?

Bison Movie Review : బైసన్ మూవీ రివ్యూ

Thamma Movie Review : థామా మూవీ రివ్యూ

Thamma Twitter Review: ‘థామా’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్ కొట్టిందా..?

KRamp Movie Review : కె ర్యాంప్ రివ్యూ

Big Stories

×