Kothapalli lo Okappudu Review : 2018 లో దగ్గుబాటి రానా సమర్పణలో ‘కేరాఫ్ కంచెరపాలెం’ అనే సినిమా వచ్చింది. సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా క్రిటిక్స్ ను మెప్పించింది. థియేటర్లలో కూడా బాగానే నిలబడింది. ఇదే కాంబినేషన్లో ఇప్పుడు ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే సినిమా రూపొందింది. జూలై 18న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో 2 రోజుల ముందే ప్రెస్ కి ఈ సినిమా చూపించాడు రానా. మరి సినిమా వారిని మెప్పించిందా? లేదా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
అప్పన్న(రవీంద్ర విజయ్) కొత్తపల్లి గ్రామంలో ఉండే జనాలకి అప్పులిచ్చి.. వాళ్ళ నుండి భారీగా వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అతని వద్ద పనిచేసే రామకృష్ణ(మనోజ్ చంద్ర) మంచివాడే. మరోపక్క అతని రికార్డింగ్ డాన్స్ కంపెనీ నడుపుతూ ఉంటాడు. అప్పన్న జనాలను టార్చర్ పెడుతుంటే.. చూసి తట్టుకోలేక కొంతమందికి ఆర్థిక సాయం కూడా చేస్తుంటాడు.రామకృష్ణకి సావిత్రి(మౌనిక టి) అంటే చాలా ఇష్టం. ఆమె ఊరిపెద్ద, జమీందారు రెడ్డి(బెనర్జీ) మనవరాలు.సావిత్రి ప్రేమ పొందడానికి మధ్యలో అందం(ఉషా బోనెల) సాయం కోరతాడు రామకృష్ణ.
ఈ క్రమంలో ఊర్లో జనాలు అందంపై రామకృష్ణ కన్నేశాడు అని భావించి ఊరిపెద్ద రెడ్డి సలహా మేరకు వీరిద్దరికీ పెళ్లి చేసేయాలని తీర్మానించుకుంటారు. అందుకు అందం కూడా ఓకే అంటుంది. తనకి రామకృష్ణ కంటే అందగాడు దొరకడు అనేది ఆమె అభిప్రాయం. సరిగ్గా వీళ్ళ పెళ్లి అయిపోతుంది అనుకుంటున్నా టైంలో అప్పన్న ఎంట్రీ ఇచ్చి అందం తల్లిదండ్రులను తన అప్పు తీర్చమని అడుగుతాడు. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడంతో రామకృష్ణని తీసుకుని వెళ్ళిపోతాడు. ఓ రకంగా రామకృష్ణకి సాయం చేయడానికే అక్కడికి వెళ్తాడు అప్పన్న. సావిత్రితో కచ్చితంగా నీ పెళ్లి చేస్తాను అని రామకృష్ణకి హామీ ఇస్తాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతున్న క్రమంలో తన బండితో సహా ఓ గుంటలో పడి చనిపోతాడు. ఆ తర్వాత రామకృష్ణ జీవితం ఎలా మారింది? అనేది మిగిలిన కథ
విశ్లేషణ :
‘కేరాఫ్ కంచెరపాలెం’ లో వేశ్యగా ముస్లిం అమ్మాయిగా నటించిన ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకురాలు, నిర్మాత కూడా. ఆ సినిమాలానే ఈ సినిమాని కూడా రస్టిక్ గా తీయాలని ఆమె ప్రయత్నించారు. ఫస్ట్ హాఫ్ అంతా కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకుండానే సాగిపోతుంది. కథ, కథనాల పై అవగాహన లేకపోవడం వల్ల ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజన్ తోనే సినిమాని చూస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద ఓ షాక్ ఇచ్చారు. దాని వల్ల సెకండాఫ్ పై మరింత అనుమానం రేకెత్తించినట్టు అయ్యింది.
ఇక సెకండాఫ్ ని చాలా వరకు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే సీరియస్ గా ఓ మెసేజ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించారు. భయం, ఆశ, నిస్సహాయ స్థితుల్లో మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? ఏ సమస్యలు లేవు అని తెలిస్తే.. ఎలా తెగిస్తారు? వంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ను టచ్ చేస్తూ కథని నడిపించారు. కానీ ఇవన్నీ ఫోకస్డ్ గా సినిమా చూసిన వాళ్లకి మాత్రమే కనెక్ట్ అయ్యే అంశాలు. సినిమాని ఓ ఎంటర్టైన్మెంట్ గా భావించే ప్రేక్షకులు వీటికి కనెక్ట్ అవ్వలేరు.
క్లైమాక్స్ కూడా హడావిడి గా ముగిసిన ఫీలింగ్ కలుగుతుంది. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటల్లో 90 లలో వచ్చిన సినిమా పేర్లు గుర్తు చేస్తూ ఉండే పాట ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత ఇంపాక్ట్ చూపలేదు. సినిమాటోగ్రఫీ కూడా వీక్ గా ఉంది. కొన్ని సీన్లలో కట్లు, సీన్ టు సీన్ జంప్ వంటివి కరెక్ట్ గా సెట్ అవ్వలేదు. సాంకేతిక లోపాలు ఇంకా చాలానే కనిపించాయి. నిర్మాణ విలువలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేవు.
నటీనటుల విషయానికి వస్తే.. ఉషా బోనెల ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. ఈమె లుక్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. సీరియస్ గా పాత్ర అయినా ఆడియన్స్ ని నవ్విస్తుంది. ఈ పాత్రతో ఆడియన్స్ ఎక్కువగా ట్రావెల్ అవుతారు అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు. తర్వాత రవీంద్ర విజయ్ బాగా చేశాడు. బెనర్జీకి కూడా చాలా కాలం తర్వాత ఓ మంచి పాత్ర దొరికింది. హీరో మనోజ్ చంద్ర బాగానే చేశాడు. మోనికా పాత్ర అంతంత మాత్రమే. మిగతా నటీనటులు ఓకే..!
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు
నటీనటుల పనితీరు
ఇంట్రెస్టింగ్ లైన్
మైనస్ పాయింట్స్ :
డైరెక్షన్
నిర్మాణ విలువలు
సెకండాఫ్
మొత్తంగా.. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ఓ మంచి పాయింట్ తో రూపొందిన రస్టిక్ మూవీ. ఓటీటీలో అయితే ఇలాంటి కంటెంట్ కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. కానీ థియేటర్లలో ఆ రెస్పెక్ట్ దొరకదు.
Kothapalli lo Okappudu Rating – 2 / 5