BigTV English

Kingdom Movie Review : కింగ్డమ్ మూవీ రివ్యూ : ప్రయోగం సక్సెసా ?

Kingdom Movie Review : కింగ్డమ్ మూవీ రివ్యూ : ప్రయోగం సక్సెసా ?

Kingdom Movie Review : రౌడీ హీరో విజయ్ దేవరకొండకు హిట్ లేక దాదాపు 7 ఏళ్లు అవుతుంది. ఎలాంటి సినిమా వచ్చినా.. బాక్సాఫీస్ ముందు కమర్షియల్‌గా ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. అలాంటి టైంలో విజయ్ తన స్టైల్ కాస్త మార్చుకుని చేసిన మూవీనే ఈ కింగ్డమ్. జర్సీ సినిమా చేసిన గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. సినిమాపై హైప్ పెంచుతూ వార్తల్లో నిలిచే నాగ వంశీ నిర్మాత. నాగ వంశీ సినిమాకు చాలా హైప్ ఇచ్చాడు. ఎలాంటి రివ్యూలు రాసుకున్న పర్లేదు అంటూ ఈ మూవీ పై ఓ స్టెట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. అలాంటి మూవీ నేడు థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఇది విజయ్ హిట్ ఇచ్చిందా ? నాగ వంశీ చెప్పినట్టు మూవీ అంత బాగుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం…


కథ :
సూర్య / సూరి (విజయ్ దేవరకొండ) ఓ సాధారణ కానిస్టేబుల్. తన అన్నయ్య శివ (సత్యదేవ్) చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. అతని కోసం సూరి వెతుకుతూనే ఉంటాడు. అయితే ఈ క్రమంలో సూరికి పోలీస్ కమిషనర్ ఓ మిషన్ కోసం పని చేయాలని అంటాడు. ఏజెంట్‌గా మారి ఈ మిషన్ చేస్తే అన్న శివను తిరిగి ఇంటికి తీసుకురావొచ్చు అని అంటాడు. దానికి సూరి ఒప్పుకుంటాడు.

సూరికి ఇచ్చిన మిషన్ ఏంటి ? సూరి అన్న శివ శ్రీలంకలో ఏం చేస్తాడు ? భాగ్యశ్రీ బోర్సె పాత్ర ఏంటి ? మురుగన్ (మలయాళ నటుడు వెంకటేష్) చేసే పనులు ఏంటి ? శివ – మురుగన్ మధ్య ఉన్న వైరం ఏంటి ? చివరికి శివను సూరి ఇంటికి తీసుకొచ్చాడా లేదా ? సూరి చేసే మిషిన్ ఏం అయింది ? అనేవి తెలుసుకోవాలంటే థియేటర్స్ లో ఈ మూవీని చూడాల్సిందే.


విశ్లేషణ :
గౌతమ్ తిన్ననూరి అంటే అందరికీ జర్సీ మూవీ గుర్తొస్తుంది. అందులో ఉండే ఎమోషన్స్ అందరినీ కట్టిపడేశాయి. ఆ ఎమోషన్స్ సీన్స్‌ను డీల్ చేయడంలో గౌతమ్ చాలా సక్సెస్ అయ్యాడు ఆ మూవీకి. అందుకే ఆ మూవీ హిట్ అయింది. అందుకే హిందీలో కూడా చేశారు. ఇప్పుడు గౌతమ్ ఆయన సరిగ్గా డీల్ చేసే ఎమోషన్స్, సెంటిమెంట్ జానర్స్‌ను దాటి ఈ మూవీ చేశాడు.

డైరెక్టర్లు ఎప్పుడూ ప్రయోగాలు చేసినా.. కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ప్రయోగాలు బెడిసి కొడితే, వచ్చి ట్రోల్స్ అన్నీ ఇన్నీ కాదు. అలా గౌతమ్ తన ప్రయోగం కొంత వరకు ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. ఆయనకు బాగా తెలిసిన ఎమోషన్స్ సీన్స్‌ను కింగ్డం మూవీలో పండించలేకపోయాడు. సినిమాలో మెయిన్ పాత్రలు, సినిమా మెయిన్ థీమ్ పైన కూడా ఈ లోపం కనిపిస్తుంది.

ఈ మూవీలో పెద్దగా కథ కూడా ఉన్నట్టు ఏం కనిపించదు. అంతా సెకండ్ పార్ట్‌లోనే అని అనుకున్నాడేమో డైరెక్టర్. నిజానికి ఈ మూవీని రెండు పార్ట్‌ల్లో కాకుండా ఒకే పార్ట్‌లోనే క్లోజ్ చేయొచ్చు. సెకండ్ పార్ట్ కోసం ఆలోచించి.. ఈ సినిమాను పూర్తి చేయాలని ఎక్కువగా ల్యాగ్ చేస్తూ సినమాను కంప్లీట్ చేశాడు. ఆ.. ల్యాగ్ ను తగ్గించి… మిగతా కథను మొత్తం ఇక్కడే చూపించే స్కోప్ ఉంది.

ఇంటర్వెల్‌లోనే సత్యదేవ్ – విలన్ వెంకటేష్ మధ్య జరిగే వార్ పెట్టేసి.. సెకండాఫ్‌లో పాండియన్ పెద్ద కొడుకు ఎంట్రీ ఇచ్చేసి… తర్వాత హీరో లక్ష్యాన్ని పూర్తి చేస్తే సరిపోయేది. కానీ, హీరోకు ఎక్కువ ఎలివేషన్స్ సీన్స్ పడాలని.. సినిమాను లాగుతూ వచ్చారు. అదే మైనస్ అయిపోయింది. బహుశా చిత్ర యూనిట్ కి సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది అని అనిపించడం వలనే కావచ్చు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ను సినిమాలో లేకుండా కట్ చేశారు.

ఒక వేళ రెండు పార్టులు తప్పదు అంటే, అంటే ఈ పార్ట్‌లో కథనాన్ని మరింత పకడ్బందీగా రాసుకోవాల్సింది. ఫస్టాఫ్‌లో ల్యాగ్ ఉన్నా.. హీరోకు పడ్డ ఎలివేషన్స్, అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ బయటపడేశాయి.

కానీ, సెకండాఫ్‌‌లో మాత్రం అలాంటి మ్యాజిక్ జరగలేదు. ఇంకా ఎంత సేపు చూడాలి అనే ఫీల్ వచ్చేలా రాసుకున్నాడు ఆ సెకండాఫ్. క్లైమాక్స్ మాత్రం పర్లేదు. దానికి అనిరుధ్ మ్యూజిక్ యాడ్ అవ్వడం ప్లస్ అయింది. కానీ, ఆడియన్స్ కి అప్పటికే సినిమా ల్యాగ్ అయిపోయింది అనే ఫీల్ వచ్చేస్తుంది దీనికి తోడు క్లైమాక్స్ లో ఏదో మిస్ అయింది అని కూడా అనిపిస్తుంది. అసంతృప్తిగా మిగిలినా… రెండు పార్ట్ కు లీడ్ ఇచ్చినా.. అది ఎందుకో కనెక్ట్ అవ్వలేదు.

ఇక ఫర్ఫామెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ బాగా చేశాడు. ముఖ్యంగా ఆయన లుక్స్ బాగున్నాయి. సత్య దేవ్ ఎప్పటిలానే అస్సలు మైనస్ చెప్పలేం. వెంకటేష్ విలనిజానికి మంచి మార్కలే పడుతాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె ఏజెంట్ అని చూపించినా… ఆమెకు నటించే స్కోప్ సినిమాలో లేదు. ఇక మిగతా పాత్రల గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు.

అలాగే అనిరుధ్ అన్ని సినిమాలకు న్యాయం చేసినట్టే కింగ్‌డం మూవీకి కూడా నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. సినిమాలో హీరో ఓ పడవ లాగే సీన్ ఉంటుంది. అచ్చం అలానే, అనిరుధ్ సినిమాను లాగి కాపాడే ప్రయత్నం చేశాడు. నవీన్ నూలీ పనితనంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సినిమా మొత్తంలో 15 నుంచి 20 నిమిషల వరకు ట్రిమ్ చేసే అవకాశం ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

విజయ్ దేవరకొండ
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
ఫస్టాఫ్

మైనస్ పాయింట్స్ :

ల్యాగ్ సీన్స్
సెకండాఫ్
సెకండ్ పార్ట్‌కి లీడ్

మొత్తంగా : ఓ ల్యాగ్ సినిమాను అనిరుధ్ తన భూజాలపై మోసే ప్రయత్నం చేశాడు

Kingdom Telugu Movie Rating : 2.25 / 5

Related News

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Kingdom Twitter Review : ‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా.. ?

Kingdom Review: కింగ్డమ్ ఫస్ట్ రివ్యూ.. ఆశ్చర్యపరుస్తున్న ఉమైర్ సంధు ట్వీట్!

Mandala Murders series review : ‘మండల మర్డర్స్’ సిరీస్ రివ్యూ… కన్ఫ్యూజింగ్ మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

Sarzameen Review : ‘సర్జమీన్’ మూవీ రివ్యూ… థ్రిల్ మిస్సైన థ్రిల్లర్

Big Stories

×