BigTV English

Mazaka Movie Review : మజాకా మూవీ రివ్యూ

Mazaka Movie Review : మజాకా మూవీ రివ్యూ

Mazaka Movie Review : ‘ధమాకా’ వంద కోట్ల సినిమాని ఇచ్చిన త్రినాధ్ రావ్ నక్కిన నుండి మరో సినిమా వస్తుంది అంటే కచ్చితంగా మంచి అంచనాలు ఉంటాయి. సందీప్ కిషన్ కూడా ‘ఊరు పేరు భైరవకోన’ ‘రాయన్’ వంటి సినిమాలతో ఫామ్లోకి వచ్చాడు కాబట్టి.. ‘మజాకా’ పై హైప్ ఏర్పడింది. మరి దానికి తగ్గట్టు సినిమా ఉందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :


కథ :
కృష్ణ(సందీప్ కిషన్) పుట్టగానే అతని తల్లి చనిపోతుంది. దీంతో వెంకట రమణ(రావు రమేష్) తో కలిసి పెరుగుతాడు. తల్లి లేదు అనే బాధ కృష్ణకి… భార్య పోయినా కూతురు ఉండుంటే.. తనకి వండి పెట్టేది, తనని జాగ్రత్తగా చూసుకునేది అనే బాధ, ఆశ రమణకి ఉంటాయి. దీంతో తన కొడుక్కి పెళ్లి చేసి.. ఓ ఫ్యామిలీ ఫోటో పెట్టుకుందాం అని ఆశపడతాడు. కానీ ‘ఇంట్లో ఇద్దరు మగాళ్లు ఉన్నప్పుడు ఆడవాళ్ళ బాధ ఏం తెలుస్తుంది? వాళ్లకి నెలసరి సమస్యలు వంటివి అత్తగారితోనే కదా చెప్పుకునేది’ అని కృష్ణకి ఎవ్వరూ పిల్లని ఇవ్వడానికి ఇష్టపడరు. కనీసం వీళ్ళని ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా పిలవరు. దీంతో వీళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతూ ముందుకి బానిసైపోతారు. సరిగ్గా ఇలాంటి టైంలో రమణకి యశోద పరిచయం అవుతుంది. అలాగే కృష్ణకి మీరా పరిచయం అవుతుంది. మీరా.. యశోదకి మేనకోడలు అవుతుందని రమణ,కృష్ణ…లకి తెలీదు. అక్కడే వీళ్ళకి బోలెడన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటి? అసలు యశోద.. వయసు మీద పడ్డ రమణ లవ్ ని ఎలా యాక్సెప్ట్ చేసింది? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :
కథ విన్నా.. చదివినా.. ఇది కొత్త కథ అనే ఫీలింగ్ ఇసుమంత కూడా కలగదు. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ ‘మా నాన్నకి పెళ్ళి’ నుండి చిరంజీవి ‘అందరివాడు’, నారా రోహిత్ ‘సోలో’ , నాగ చైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ వంటి సినిమాల పోలికలు చాలానే కనిపిస్తాయి. రైటర్ ప్రసన్న కుమార్ నుండి ఇంతకంటే కొత్తదనం ఏమి ఆశిస్తాం. కానీ దర్శకుడు త్రినాధ్ రావ్ నక్కినకి, ప్రసన్న కుమార్ రైటింగ్ కి బాగా సింక్ అవుతుంది అనే నమ్మకం ఆడియన్స్ లో, నిర్మాతల్లో ఉంది. కాబట్టి.. కామెడీని, స్క్రీన్ ప్లేని ఎంజాయ్ చేయాలనే ఆసక్తితోనే టార్గెటెడ్ ఆడియన్స్ టికెట్లు కొని థియేటర్ కి వెళ్తారు. వాళ్ళని కూడా ఈ సినిమా పూర్తిస్థాయిలో సంతృప్తిపరచదు. ఫస్ట్ హాఫ్ పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ సాగుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఓకే అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ నుండి క్లైమాక్స్ వరకు చాలా బోర్ కొట్టిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ కొంచెం పర్వాలేదు. ఇక మిగిలిన టెక్నికల్ టీం విషయానికి వస్తే…దాదాపు ప్రతి సినిమాలోనూ కచ్చితంగా హైలెట్ అని చెప్పుకునే సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్… ఈ సినిమాలో మాత్రం చాలా వీక్ గా ఉన్నాయి అని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌడింగ్ అస్సలు బాలేదు. ఆ లోపాలు క్లియర్ గా తెలిసిపోతాయి. తమిళ సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ ను తెలుగు ఫిలిం మేకర్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో అర్ధం కాదు. సినిమాలో ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వరస్ట్. త్రినాధ్ రావ్ నక్కిన సినిమాకి భీమ్స్ సంగీతం లేకపోవడం ఎంత లోటో అడుగడుగునా తెలిసొచ్చింది. పోనీ అతని కాల్షీట్లు ఖాళీ లేవు అనుకుంటే ఆర్.ఆర్.ధృవన్ వంటి ఎంతో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందుబాటులో ఉన్నారు. అలాంటి వాళ్ళకి అయినా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వీక్ అనడంలో సందేహం లేదు. ఇల్లు, బస్సు, పోలీస్ స్టేషన్ ఈ లొకేషన్స్ లోనే సినిమా మొత్తాన్ని చుట్టేశారు.


నటీనటుల విషయానికి వస్తే.. సందీప్ కిషన్ చూడటానికి ఇందులో బాగున్నాడు. కానీ ఎందుకో వేసిన షర్టే మళ్ళీ మళ్ళీ వేశాడు. అతని గొంతు కూడా ఎందుకో దెబ్బతింది.స్పీడ్ గా చెప్పే డైలాగులు చాలా మందికి అర్థంకాలేదు. రావు రమేష్ బాగా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే కిచెన్ సీన్లో అతనికి ఫుల్ మర్క్స్ వేసేయొచ్చు. కానీ అన్షుతో అతని కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. ఆ సీన్లు చూడటానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. శ్రీకాంత్, జగపతి బాబు వంటి సీనియర్ హీరోలని తీసుకుని ఉంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక చాలా ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అన్షుకి మంచి పాత్ర అయితే దొరికింది. కానీ ఆమె నటనతో మ్యాజిక్ చేయలేకపోయింది. ఇక రీతూ వర్మ నటనతో ఇంప్రెస్ చేసింది ఏమీ లేదు. పైగా ఆమె లుక్స్ కూడా బాలేవు. మేకప్ కూడా చాలా డల్ గా ఉంది. మురళీశర్మ సైకో కామెడీ బాగానే ఉంది. మణిచందన మతిమరుపు తల్లి పాత్రలో పర్వాలేదు అనిపించింది. హైపర్ ఆది, శ్రీనివాస్ రెడ్డి.. కామెడీ వర్కౌట్ కాలేదు.

ప్లస్ పాయింట్స్ :

ఇంటర్వెల్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే
మ్యూజిక్
ప్రొడక్షన్ వాల్యూస్

మొత్తంగా.. ‘ధమాకా’ వంటి కంటెంట్ చాలు అనుకుంటే ‘మజాకా’ని ఒకసారి ట్రై చేయొచ్చు.. కానీ ఆ సినిమాలో ఉన్న మంచి మ్యూజిక్ ఇందులో లేకపోవడం వల్ల.. మ్యాజిక్ చేసే అవకాశం అయితే లేదు.

Mazaka Telugu Movie Rating – 2 / 5

Related News

Arebian Kadali Review: అరేబియన్ కడలి రివ్యూ.. తండేల్‌కి తక్కువే ?

SU from SO Telugu Review : ‘సు ఫ్రొం సో’ రివ్యూ’ రివ్యూ… ఇది ఊహించని కామెడీ

Mayasabha Review : మయసభ రివ్యూ 

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Kingdom Movie Review : కింగ్డమ్ మూవీ రివ్యూ : ప్రయోగం సక్సెసా ?

Kingdom Twitter Review : ‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా.. ?

Big Stories

×