రివ్యూ : సుజల్ ది వొర్టెక్స్ సీజన్ 2
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : అమెజాన్ ప్రైమ్
ఓటీటీ రిలీజ్ డేట్: 28 ఫిబ్రవరి, 2025
ఎపిసోడ్స్: 8
నటీనటులు : ఐశ్వర్య రాజేష్, కథిర్, లాల్, శ్రియా రెడ్డి, గౌరీ జి కిషన్, చాందిని తమిళరసన్, సంయుక్త విశ్వనాథన్, మంజిమా మోహన్, శరవణన్, అశ్విని నంబియార్, మోనిషా బ్లెస్సీ, నిఖిలా శంకర్ తదితరులు
క్రియేటర్స్: పుష్కర్, గాయత్రి
దర్శకత్వం : బ్రహ్మ, సర్జున్ కేఎమ్
సంగీతం : సామ్ సీఎస్
Suzhal The Vortex 2 Rating : 1.75 / 5
2022లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘సుజల్ ది వొర్టెక్స్’. అప్పట్లో దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్ గా నటించగా, ఈరోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘సుజల్ ది వొర్టెక్స్ సీజన్ 2’ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ప్రముఖ క్రియేటర్స్ పుష్కర్ – గాయత్రి కలిసి ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చిన ఈ సిరీస్ అంచనాలను అందుకుందా అనే విషయాన్ని రివ్యూలో తెలుసుకుందాం.
కథ
‘సుజల్’ సీజన్ 1లో నందిని తన చెల్లిని చంపిన వాడిని హత్య చేసి జైలుకెళ్తుంది. అయితే సీజన్ 2 కాళీపట్నంలో మొదలవుతుంది. ఎస్ఐ చక్రవర్తికి సన్నిహితుడైన లాయర్ చెల్లప్ప నందిని కేసును వాదించడానికి ముందుకు వస్తాడు. కానీ ఊహించని విధంగా ఆయన హత్యకు గురవుతాడు. అయితే చెల్లప్ప ఇంట్లో ముత్తు ఆయుధంతో పోలీసులకు దొరుకుతుంది. దీంతో ఆమె హత్య చేసిందనుకొని ఎస్ఐ చక్రవర్తి అరెస్ట్ చేస్తాడు. కానీ మరోవైపు చెల్లప్పను హత్య చేశామని ఏడుగురు అమ్మాయిలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమంతట తాముగా లొంగిపోతారు. అసలు ఈ ఏడుగురు అమ్మాయిలు ఎవరు ? లాయర్ ను హత్య చేసినట్టుగా ఎందుకు ఒప్పుకున్నారు? చివరికి నందిని బయటపడగలిగిందా లేదా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.
విశ్లేషణ
మొదటి సీజన్లో చెల్లిని చంపిన వ్యక్తిని ఎస్ఐ చక్రవర్తి సర్వేలతో నందిని హత్య చేస్తుంది. ఆ తర్వాత ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్లో వచ్చి లొంగిపోతుంది. అయితే సీజన్ 2 మాత్రం మరో కొత్త కేసు ఆధారంగా ముందుకు సాగుతుంది. నందిని ఈ కేసులో నుంచి బయట పడేయాలి అనుకున్న లాయర్ చెల్లప్ప ఊహించని విధంగా మర్డర్ కావడం, ఆ తర్వాత ఎనిమిది మంది అమ్మాయిలు ఈ కేసులో నిందితులుగా ఉండడం, వారు చెల్లప్పను హత్య చేసినట్టుగా ఒప్పుకోవడానికి గల కారణం వంటి విషయాలను దర్యాప్తు చేసే పోలీస్ వంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో సెకండ్ సీజన్ నడుస్తుంది.
ఇందులో అష్ట కాళీ కాన్సెప్ట్ మెయిన్. కాబట్టి స్క్రీన్ ప్లే, నరేషన్ ఇందులో కీలకపాత్రను పోషిస్తాయి. అయితే పుష్కర్ అండ్ గాయత్రి రాసిన స్క్రీన్ ప్లే పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు. స్టోరీ గడిచే కొద్దీ ఇది తెలిసిన కథే కదా అని ఫీలింగ్ రాకమనదు. ఒక్కో ఎపిసోడ్ ఏకంగా 40 నుంచి 50 నిమిషాలు సాగదీశారు. ఈ సిరీస్లో కొన్ని ఊహించని ట్విస్టులు, టర్న్ ను ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.
అయితే మొదటి 5 ఎపిసోడ్స్ వరకు మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫీలింగ్ ఇచ్చే ఈ సిరీస్ ఆ తర్వాత పూర్తిగా నరేషన్ ట్రాక్ తప్పడంతో ఇంట్రెస్ట్ పోతుంది. ముఖ్యంగా ఎనిమిదవ ఎపిసోడ్ నిరాశ పరుస్తుంది. సినిమాటోగ్రఫీ, సామ్ సిఎస్ బీజీఎం మెయిన్ హైలెట్స్. ఐశ్వర్య రాజేష్ తో పాటు ఎస్ఐ ఖదీర్ పర్ఫామెన్స్ డీసెంట్ గా ఉంటాయి. ఇక న్యాయవాదిగా, తండ్రిగా లాల్ నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ 8 మంది అమ్మాయిలు ఎవరి పాత్రల్లో వారు జీవించారు.
చివరగా…
విమర్శకుల నుంచి యావరేజ్ టాక్ వస్తున్న ‘సుజల్ ది వొర్టెక్స్ సీజన్ 2’ అంచనాలు పెట్టుకోకుండా చూసే వారికి మాత్రం మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది.
Suzhal The Vortex 2 Rating : 1.75 / 5