E-Paper
Advertisement

ఆపద వస్తే కాపాడేది మీ ఫోనే.. ఈ 5 ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ ఇప్పుడే ఆన్ చేసుకోండి!

ఆపద వస్తే కాపాడేది మీ ఫోనే.. ఈ 5 ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ ఇప్పుడే ఆన్ చేసుకోండి!
Advertisement

Android Emergency Settings: సమస్య ఎప్పుడూ ముందుగా హెచ్చరించి రాదు. అందుకే “సమయం కంటే ముందే మనం సిద్ధంగా ఉండాలి” అంటారు పెద్దలు. ప్రస్తుతం మన జీవితంలో అంతర్భాగంగా మారిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ ఎన్నో లైఫ్-సేవింగ్ ఫీచర్లను ఇన్-బిల్ట్‌గా అందిస్తోంది. కేవలం రెండు నిమిషాలు కేటాయించి మీ ఫోన్ లోని ఈ ‘Safety & Emergency’ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే.. రేపు ఏదైనా విపత్తు వచ్చినా లేదా రోడ్డు ప్రమాదం జరిగినా మీ ఫోన్ మీ ప్రాణాలను కాపాడుతుంది. ఆ 5 సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు వన్-బై-వన్ చూద్దాం.

1. ఎమర్జెన్సీ SOS-పవర్ బటన్ మ్యాజిక్: మీరు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు లేదా ఎవరైనా మిమ్మల్ని వెంబడిస్తున్నప్పుడు ఫోన్ లాక్ తీసి.. నంబర్ డయల్ చేసేంత టైమ్ ఉండదు.  మీ ఫోన్ లోని ‘Power Button’ ను వరుసగా 5 సార్లు నొక్కితే చాలు.. ఆటోమేటిక్‌గా పోలీసులకు (112) లేదా మీరు సెట్ చేసుకున్న ఫ్యామిలీ నంబర్లకు లొకేషన్‌తో సహా అలర్ట్ మెసేజ్ వెళ్ళిపోతుంది.

Advertisement

ఎలా ఆన్ చేయాలి?: Settings -> Safety & Emergency -> Emergency SOS లోకి వెళ్లి దీన్ని ఆన్ చేసుకోండి.

2. మెడికల్ ఇన్ఫర్మేషన్ – లాక్ స్క్రీన్ పై మీ వివరాలు:

Advertisement

రోడ్డుపై వెళ్లేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగి స్పృహ తప్పిపోతే.. చుట్టుపక్కల వాళ్లకు మీ బంధువుల ఫోన్ నంబర్లు గానీ, మీ బ్లడ్ గ్రూప్ గానీ తెలియదు.

ఎలా పనిచేస్తుంది?: ఫోన్ లాక్ తీయకుండానే ఎమర్జెన్సీ కాల్ స్క్రీన్ పై మీ బ్లడ్ గ్రూప్, అలర్జీలు , అత్యవసర కాంటాక్ట్ నంబర్లు కనిపించేలా చేయవచ్చు.

ఎలా ఆన్ చేయాలి?: Settings -> Safety & Emergency -> Medical Information లోకి వెళ్లి మీ వివరాలు, బంధువుల నంబర్లు యాడ్ చేయండి.

3. భూకంప హెచ్చరికలు:
ప్రకృతి వైపరీత్యాలు సడన్‌గా వస్తుంటాయి. భూకంపం రాబోయే కొన్ని సెకన్ల ముందే మీ ఫోన్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది?: గూగుల్ సిస్టమ్ భూమిలో వచ్చే కంపనాలను గుర్తించి, మీ ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం ఉంటే పెద్ద సౌండ్‌తో ఫోన్ స్క్రీన్ పై వార్నింగ్ ఇస్తుంది. దీని వల్ల మీరు సురక్షిత ప్రాంతంలోకి వెళ్ళడానికి టైమ్ దొరుకుతుంది.

ఎలా ఆన్ చేయాలి?: Settings -> Safety & Emergency -> Earthquake Alerts ని ఆన్ చేయండి.

4. ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్:
మీరు ఆపదలో ఉండి 100 లేదా 112 కి కాల్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారో స్పష్టంగా చెప్పలేకపోవచ్చు.

ఎలా పనిచేస్తుంది?: మీరు ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయగానే మీ ఫోన్ ఆటోమేటిక్‌గా మీ ఖచ్చితమైన జీపీఎస్ లొకేషన్‌ను రెస్క్యూ టీమ్‌కు పంపుతుంది.

ఎలా ఆన్ చేయాలి?: Settings -> Safety & Emergency -> Emergency Location Service ని ఎనేబుల్ చేయండి.

Also Read: వద్దు అనుకుంటే వదిలేయండి! అమెజాన్ పే లేటర్ అకౌంట్ క్లోజ్ చేసే.. ప్రాసెస్

5. గూగుల్ ‘ఫైండ్ మై డివైజ్’:
మీరు ఎక్కడైనా ఫోన్ పోగొట్టుకున్నా లేదా ఏదైనా అడవి లాంటి ప్రదేశంలో చిక్కుకున్నా మిమ్మల్ని ట్రేస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

లాభం: మీ కుటుంబ సభ్యులు మీ లొకేషన్‌ను లైవ్‌లో ట్రాక్ చేయవచ్చు.

ఎలా ఆన్ చేయాలి?: Settings -> Google -> Find My Device ని ఆన్ లో ఉంచండి.

స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం సోషల్ మీడియా, గేమింగ్ మాత్రమే కాదు.. అది మనకు రక్షణ కవచం కూడా. ఈ రోజే.. ఇప్పుడే మీ ఆండ్రాయిడ్ ఫోన్ తీసి పైన చెప్పిన 5 ఎమర్జెన్సీ సెట్టింగ్స్‌ను ఆన్ చేసుకోండి. అలాగే ఈ ఇన్‌ఫర్మేషన్ చాలా విలువైనది కాబట్టి.. మీ ఫ్యామిలీ మెంబర్స్ , ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ల ఫోన్లలో కూడా ఈ సెట్టింగ్స్ ఆన్ చేయించండి. బీ సేఫ్.

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×