Smartphone Settings: నేటి ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే మనలో చాలామందికి రోజు గడవదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయానికి ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. అయితే, మనకు తెలియకుండానే ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్ మన వ్యక్తిగత డేటాను ఇతరులకు చేరవేస్తున్నాయి. అంతేకాదు.. బ్యాటరీని, డేటాను కూడా విపరీతంగా తినేస్తుంటాయి. అందుకే.. మన ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వెంటనే మార్చాల్సిన 5 ముఖ్యమైన సెట్టింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది ఫోన్‌లో లొకేషన్ సర్వీస్‌ను ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచుతారు. దీనివల్ల మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేస్తున్నాం? అనే ప్రతి విషయాన్ని గూగుల్ లేదా ఇతర యాప్స్ ట్రాక్ చేస్తూనే ఉంటాయి. ఫుడ్ డెలివరీ లేదా మ్యాప్స్ వాడేటప్పుడు మాత్రమే లొకేషన్ ఆన్ చేసి, మిగతా సమయాల్లో దాన్ని ఆఫ్ చేయడం మంచిది. దీనివల్ల ప్రైవసీతో పాటు బ్యాటరీ కూడా చాలా ఆదా అవుతుంది.
మనం ఒక యాప్ వాడి క్లోజ్ చేసినా, అది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. కొత్త సమాచారం కోసం ఇంటర్నెట్‌ను వాడుకుంటూ ఉంటుంది. దీంతో మనకు తెలియకుండానే మొబైల్ డేటా అయిపోవడంతో పాటు ఫోన్ కూడా వేడెక్కుతుంటుంది. అందుకే సెట్టింగ్స్‌లోకి వెళ్లి Background App Refresh ఆప్షన్‌ను డిసేబుల్ చేయడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
Also Read: ఫొటోల్లో వద్దనుకున్నవి సింగిల్ క్లిక్‌తో మాయం.. Google AI Tools ఉచితంగా వాడుకోండిలా!
ఫోన్ లాక్ చేసి ఉన్నప్పటికీ.. ఎవరైనా మెసేజ్ పంపితే అది స్క్రీన్‌పై కనిపిస్తూ ఉంటుంది. దీనిలో మన బ్యాంక్ ఓటీపీలు లేదా వ్యక్తిగత మెసేజ్‌లు ఉండొచ్చు. పక్కనున్న వాళ్లు వీటిని చూసే ప్రమాదం ఉంది. అందుకే సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Hide Sensitive Content ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తద్వారా ఫోన్ అన్‌లాక్ చేస్తేనే మెసేజ్ వివరాలు కనిపిస్తాయి.
మనం గూగుల్‌లో ఏదైనా వస్తువు గురించి వెతికితే.. దానికి సంబంధించిన యాడ్స్ మన సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. మన ఆసక్తులను గమనించి గూగుల్ ఈ ప్రకటనలను చూపిస్తుంది. అంటే.. మన డేటాను అది నిరంతరం గమనిస్తోందని అర్థం. గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Personalized Ads ఆఫ్ చేయడం ద్వారా మన ప్రైవసీని కాపాడుకోవచ్చు.
బయట తిరిగేటప్పుడు పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లు కనిపిస్తే మన ఫోన్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోయే సెట్టింగ్ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. హ్యాకర్లు ఇలాంటి ఓపెన్ వైఫైల ద్వారా మన ఫోన్‌లోని డేటాను దొంగిలించే అవకాశం ఉంది. అందుకే Ask to Ioin Networks ఆప్షన్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోవడం సురక్షితం.
Also Read: అమెజాన్ సేల్ మిస్ అయ్యారా? డోంట్ వర్రీ.. ఇంకా తక్కువ ధరకే దొరుకుతున్న బెస్ట్ గ్యాడ్జెట్స్ ఇవే!