E-Paper
Advertisement

ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? ఈ 6 స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటే.. మీ జర్నీ సూపర్‌హీట్!

ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? ఈ 6 స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటే.. మీ జర్నీ సూపర్‌హీట్!
Advertisement

Travel Gadgets 2026: కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. అయితే జర్నీలో చిన్నచిన్న ఇబ్బందులు ఎదురైతే ఆ మజా కాస్తా క్షణాల్లో ఆవిరైపోతుంది. అయితే దీనికి చెక్ పెట్టేందుకు ఎన్నో రకాల స్మార్ట్ ట్రావెల్ గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 6 అత్యవసరమైన గ్యాడ్జెట్స్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి బడ్జెట్ కూడా తక్కువే. ఇంతకీ అవేంటో, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటో చూసేయండి.

Noise Two Wireless Headphones

జర్నీలో పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలన్నా, ప్రశాంతంగా నచ్చిన సంగీతం వినాలన్నా మంచి హెడ్‌ఫోన్స్ ఉండాల్సిందే. ఈ జాబితాలో ‘నాయిస్ టూ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్’ బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తాయి. లాంగ్ బ్యాటరీ లైఫ్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో పాటు ఇవి చెవులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. ఫ్యామిలీ ట్రిప్స్‌లో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎంటర్టైన్మెంట్ ఆస్వాదించడానికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. అమెజాన్ లో రూ.1,499కే ఇది లభిస్తోంది.

Ambrane 10000mAh Power Bank

Advertisement

ప్రయాణాల్లో ఫోన్లు, టాబ్లెట్ల ఛార్జింగ్ అయిపోవడం సర్వసాధారణం. ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు డివైజ్‌లు ఆఫ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే తక్కువ ధరలో ఎక్కువ ఛార్జింగ్ ఇచ్చే ‘అంబ్రేన్ 10000mAh పవర్ బ్యాంక్’ బెస్ట్ చాయిస్ గా నిలుస్తుంది. ఇది జేబుకు చిల్లు పెట్టకుండా ప్రయాణంలో గ్యాడ్జెట్స్‌కు నిరంతర పవర్ సప్లై అందిస్తుంది. అమెజాన్ లో రూ.999కే దీనిని కొనుగోలు చేయవచ్చు.

Portronics World Tag

విమానాశ్రయాల్లో లేదా రైల్వే స్టేషన్లలో లగేజీ మిస్ అవుతుందేమో అనే భయం అందరికీ ఉంటుంది. ఆ టెన్షన్‌కు చెక్ పెట్టడానికే ఈ ‘పోర్ట్రానిక్స్ వరల్డ్ ట్యాగ్’ ఉపయోగపడుతుంది. దీన్ని ట్రావెల్ బ్యాగ్‌కు తగిలిస్తే చాలు, లగేజీ ఎక్కడుందో మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఫ్యామిలీతో వెళ్లేటప్పుడు లగేజీ భద్రతకు ఇది భరోసా కల్పిస్తుంది. అమెజాన్ లో రూ.599కే దీనిని కొనుగోలు చేయవచ్చు.

Tizum Universal Travel Adapter

Advertisement

దేశ విదేశాలు తిరిగే వారైనా, వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేవారైనా ప్లగ్ పాయింట్ల సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఈ సమస్యకు ‘టిజమ్ యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్’తో చెక్ పెట్టొచ్చు. దీనిని ఉపయోగించి ఒకే అడాప్టర్‌తో వివిధ రకాల ప్లగ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులందరి ఫోన్లు, కెమెరాలను ఒకేచోట సులభంగా ఛార్జ్ చేసుకోవడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది.

Wipro Emerald Plus Rechargeable LED Torch

రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు లేదా క్యాంపింగ్‌కు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా పవర్ కట్ అయితే చీకట్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా కుటుంబంతో ఉన్నప్పుడు భద్రత ముఖ్యం. ‘విప్రో ఎమరాల్డ్ ప్లస్ రీఛార్జబుల్ ఎల్‌ఈడీ టార్చ్’ ప్రకాశవంతమైన వెలుతురును ఇస్తుంది. అత్యవసర సమయాల్లో వాడుకోవడానికి ఇది చాలా నమ్మకమైన గాడ్జెట్. ఫ్లిప్ కార్ట్ దీనిని 65 శాతం డిస్కౌంట్ తో రూ.699కే అందిస్తోంది.

Also Read: తల్లి ఆఫీసర్.. కొడుకు ఏజెంట్.. ‘డబుల్ బెడ్రూం’ ఇళ్లపై సినిమా రేంజ్ మోసం!

Amazon Basics Travel Cable Organiser

ఛార్జర్లు, పవర్ బ్యాంకులు, ఇయర్‌ఫోన్ల వైర్లు అన్నీ బ్యాగులో కలిసిపోయి చిందరవందరగా మారుతుంటాయి. అవసరమైనప్పుడు సరైన కేబుల్ దొరకక విసుగొస్తుంది. ఈ గందరగోళాన్ని దూరం చేయడానికి ‘అమెజాన్ బేసిక్స్ ట్రావెల్ కేబుల్ ఆర్గనైజర్’ చక్కగా పనిచేస్తుంది. వైర్లు, చిన్న చిన్న గ్యాడ్జెట్లను ఒకే చోట నీట్‌గా సర్దుకోవడానికి ఇది ఒక అద్భుతమైన యాక్సెసరీగా ఉపయోగపడుతుంది.

Also Read: ఇస్త్రీ కష్టాలకు చెక్.. రూ.2,000 బడ్జెట్‌లో.. అత్యుత్తమ స్టీమర్స్ ఇవే!

Related News

నాయిస్ ఐకాన్ బజ్ స్మార్ట్‌వాచ్‌పై భారీ డిస్కౌంట్..వెంటనే కొనేయండి

Pixel 11 Pro Fold వచ్చేస్తోంది.. గూగుల్ రిలీజ్ చేసిన టీజర్ చూశారా? డిజైన్ అదిరిపోయింది!

అమెజాన్ సేల్‌లో బ్లాక్‌బస్టర్ ఆఫర్.. రూ.10,000 తగ్గిన Samsung Galaxy A56 5G ధర!

క్యాడ్లెక్ మల్టీషెఫ్ ప్రో.. క్షణాల్లోనే ఒకే డివైజ్‌తో 3 రకాల ఫుడ్స్ రెడీ

మ్యాప్స్ నుంచి నేరుగా ఫుడ్ ఆర్డర్, హోటల్ బుకింగ్.. గూగుల్ తెచ్చిన కొత్త AI అప్‌డేట్ చూశారా?

బిజినెస్ కోసం బెస్ట్ డీప్ ఫ్రీజర్ కావాలా? టాప్ 5 బ్రాండ్స్, ఫీచర్స్!

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026..సీసీ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు!

ఏడాది వ్యాలిడిటీ నుండి ఇంటర్నేషనల్ రోమింగ్ వరకు.. Airtel బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ లిస్ట్!

Big Stories

Advertisement
×