E-Paper
Advertisement

తెలంగాణ ఈఎస్ఐ ఆసుపత్రి టెండర్లలో.. రూ. 50 కోట్ల కుంభకోణం?

తెలంగాణ ఈఎస్ఐ ఆసుపత్రి టెండర్లలో.. రూ. 50 కోట్ల కుంభకోణం?
Advertisement

Labour Department: స్వేచ్చ బ్యూరో: కార్మిక శాఖ మంత్రి, సెక్రటరీ మధ్య కోల్ద్ వార్ కొనసాగుతున్నట్లు తెలిసింది. శాఖ పరమైన నిర్ణయాలు, ఫైళ్ల కదలికల్లో ఇద్దరి మధ్య సరైన సమన్వయం లేక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ఇప్పుడు ఆ శాఖలో బిగ్ డిస్కషన్ గా మారింది. సెక్రటరీ ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని స్వయంగా మంత్రి పేషీ అధికారులే వాపోతున్నారు. తమ కార్యాలయం నుంచి ఇచ్చే ఆదేశాలను   సెక్రటరీ బేఖాతరు చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేగాక మంత్రికి తెలియకుండానే తాజాగా కోట్లాది రూపాయల టెండర్లు కట్టబెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కార్మిక శాఖ అనుబంధ విభాగామైన ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలలో ఇటీవల జరిగిన టెండర్ల వ్యవహారం ఇప్పుడు సచివాలయంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆసుపత్రులు, డిస్పెన్సరీలలో హౌస్ కీపింగ్,సెక్యూరిటీ చార్జీలను గతంతో పోలిస్తే ఊహించని రీతిలో ఏకంగా 9 రెట్లు పెంచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈఎస్ఐ ఫండ్‌పై..

నిబంధనలకు విరుద్ధంగా ఒకే సంస్థకు నామినేషన్ పద్ధతిలో ఈ కాంట్రాక్టులను కేటాయించినట్లు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల ఈఎస్ఐ ఫండ్‌పై దాదాపు రూ.50 కోట్ల మేర అదనపు భారం పడినట్లు స్వయంగా మంత్రి పేషీ అధికారులే చెప్తున్నారు. ఈ విషయం తనకు తెలియకుండానే జరిగినట్లు మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆయన కార్యాలయంలోని స్టాఫ్​ లో ఒకరు తెలిపారు. తమ పరిధిలోకి వచ్చే శాఖలో ఇంత పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు,టెండర్ల నిర్ణయాలు జరుగుతుంటే తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ మంత్రి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

Also Read: విజయసాయిరెడ్డి పార్టీలోకి టీడీపీ నేత రమణ, ఈనెల 11న చేరిక, వైసీపీ నుంచి రెడీగా ఉన్నారా?

అమలుకు నోచుకోని ‘కనీస వేతనాలు’..

క్షేత్రస్థాయిలో కష్టపడే కార్మికులకు అండగా ఉండాల్సిన సెక్రటరీ వైఖరి వల్ల లక్షలాది మంది కార్మికులు నష్టపోతున్నారే విమర్శలు ఊపందుకున్నాయి. ప్రస్తుత జీవన పరిస్థితులకు అనుగుణంగా జీవోలు ఇచ్చి కనీస వేతనాల సవరణ చేసినప్పటికీ, దాని అమలును పర్యవేక్షించడంలో కార్యదర్శి ఘోరంగా విఫలమయ్యారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.ప్రభుత్వ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమవ్వడంతో యజమానులు ఇచ్చే అరకొర జీతాలతో కార్మికులు అవస్థలు పడుతున్నారు.అంతేగాక ఇటు పాలన పడకేయడంతో ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.చందాలు చెల్లించి వైద్యం కోసం వచ్చే కార్మికులకు కనీస మందులు అందుబాటులో ఉండటం లేదు. బయట మెడికల్ షాపుల్లో కొనుక్కోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆసుపత్రులలో బ్లడ్, ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షల యంత్రాలు పనిచేయకపోవడంతో రోగులు అల్లాడిపోతున్నారు. పాలనాపరమైన పర్యవేక్షణ లోపించి, అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల ఈఎస్ఐ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ అంశంపై సెక్రటరీ స్థాయిలో ఇప్పటి వరకు ఉన్నత స్థాయి సమీక్ష జరగలేదనే చర్చ ఆ శాఖలో ఉన్నది.

ఫైళ్లకు మోక్షం లేదు.. మంత్రి ఆదేశాలంటే లెక్కే లేదు..

Advertisement

ప్రజా సమస్యలు,పాలనాపరమైన నిర్ణయాలపై మంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినా, సెక్రటరీ స్థాయి నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదని తెలుస్తోంది.అంతేగాక ముఖ్యమైన ఫైళ్లను వారాల తరబడి పెండింగ్‌లో పెట్టడం,నిర్ణయాలు తీసుకోకుండా ఆలస్యం చేయడం పరిపాటిగా మారింది.కేవలం కార్మిక శాఖలోనే కాకుండా, సదరు ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలోని మిగిలిన శాఖల్లో కూడా ఇదే తరహా ఏకపక్ష వైఖరి నడుస్తోందని సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.ఒకవైపు సంక్షేమ ఫలాలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంటే, మరోవైపు ఐఏఎస్ వర్సెస్ మినిస్టర్ మధ్య జరుగుతున్న ఈ అంతర్గత పోరు వల్ల ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. మంత్రి శాఖాపరమైన నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తుంటే, సెక్రటరీ మాత్రం తన స్వయంకృత ఏకపక్ష నిర్ణయాలతో చెక్ పెడుతున్నారనే చర్చ జోరందుకుంది.

Also Read: బీజేపీ యాక్టివ్ కావడంతో రూటు మార్చిన బీఆర్ఎస్.. 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర, ప్రజలతో ఉండేందుకు..

Tags

Related News

గడ్డం, మీసం పెంచితే రేవంత్ రెడ్డి అయిపోతావా? కేటీఆర్‌పై వేముల వీరేశం సంచలన కామెంట్స్!

హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్‌ మేళా.. మంగళవారం నుంచి స్లాట్ విడుదల, ఇంకెందుకు ఆలస్యం

బీజేపీ యాక్టివ్ కావడంతో రూటు మార్చిన బీఆర్ఎస్.. 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర, ప్రజలతో ఉండేందుకు..

మద్యం మత్తులో తండ్రి ఘాతుకం.. ఐదేళ్ల కొడుకుని చంపి.. హైదరాబాద్ దారుణమైన ఘటన

హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీఆర్ఎస్‌ పెద్దల్లో భయం ఎందుకు?

దూసుకొస్తున్న మురసు తుఫాను.. దక్షిణ ఏపీ వైపు చూపు, తెలంగాణలో భారీ వర్ష సూచన

గచ్చిబౌలి మారథాన్‌లో తీవ్ర విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!

Big Stories

Advertisement
×