Bigg Boss:సాధారణంగా కంటెంట్ కోసం రియాలిటీ షోలలో లవ్ ట్రాక్లు క్రియేట్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే అందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లో కూడా లవ్ ట్రాక్ మొదలయ్యింది. ఇది చూసిన ప్రతి ఒక్కరు కంటెంట్ కోసమే అనుకున్నారు. కానీ ఆమె మాత్రం అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. మతం కూడా వేరు, ఈ విషయం అందరికీ తెలియడంతో ఏకంగా తల్లిదండ్రులు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చే.. ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇండియా వ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రసారం అవుతూ మంచి వినోదాన్ని పంచుతోంది. ఇదే సమయంలో వివాదాలతో కూడా ఈ షో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అలా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ , మలయాళం భాషలలో ప్రసారమవుతున్న ఈ బిగ్ బాస్ కి విపరీతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఇదిలా ఉండగా ఒకవైపు తెలుగులో సీజన్ 10 లో రోహిత్ ఎలిమినేషన్ వివాదం నడుస్తుండగా.. మరొకవైపు బెంగాలీ బిగ్ బాస్ లో లవ్ ట్రాక్స్, హగ్గులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పుడు మలయాళ బిగ్ బాస్ 8లో చోటు చేసుకున్న ఒక సంఘటన మాత్రం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఒక కంటెస్టెంట్ తల్లిదండ్రులే స్టేజ్ పైకి వచ్చి తమ కూతుర్ని తీసుకెళ్లడం హాట్ టాపిక్ గా మారింది
బిగ్ బాస్ సీజన్ 10తో పాటు మలయాళం సీజన్ 8 ఒకేసారి ప్రారంభం అయ్యాయి. మోహన్ లాల్ హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ మలయాళం షోలో నేహా ఫాతిమా (Neha Fatima)అనే ఒక కంటెస్టెంట్ అడుగు పెట్టారు. తన ఆటతీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. టాప్ కంటెస్టెంట్ లో ఒకరిగా దూసుకెళ్తున్నారు. ఇక గేమ్లో భాగంగా ఆమె మరో కంటెస్టెంట్ సంతోష్ రాజ్ తో సన్నిహితంగా మెలిగారు. కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్ షోకే హైలెట్గా నిలిచింది. అయితే ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో సంతోష్ రాజ్ కు నేహా ఫాతిమా బహిరంగంగానే లవ్ ప్రపోజల్ చేయడం అతడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ALSO READ:రూ.200 కోట్ల ఆర్థిక దోపిడీ కేసులో నోరా ఫతేహికి ఢిల్లీ కోర్టు మరోసారి సమన్లు!
దీంతో ఈ లవ్ ట్రాక్ పై నేహా తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ పరువు, మత ఆచారాలకు వ్యతిరేకంగా తమ కూతురు వ్యవహరిస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు వారాంతంలో భాగంగా హోస్ట్ మోహన్ లాల్ సమక్షంలో నేహా తల్లిదండ్రులు నేరుగా స్టేజ్ పైకి వచ్చి తమ కూతురు ప్రవర్తన పై బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆమెను బయటకు పంపించాలని పట్టుబట్టారు. దీంతో అర్ధాంతరంగా ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించాల్సి వచ్చింది. మొత్తానికైతే నేహా బిగ్ బాస్ ప్రయాణం ఎటువంటి ముగింపు లేకుండానే మధ్యలోనే ముగిసింది. అంతేకాదు బిగ్ బాస్ చరిత్రలో లవ్ ట్రాక్ వివాదం కారణంగా ఒక కంటెస్టెంట్ అర్ధాంతరంగా హౌస్ నుండి బయటకు వెళ్లిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
How did you even agreed to do this? @Mohanlal #BBK13 #Bigboss pic.twitter.com/aAfstDtcpr
— Hemanth Shaiva (@HemanthShaiva) November 1, 2026