7kg vs 8kg washing machine: ఇంట్లోకి కొత్తగా వాషింగ్ మెషీన్ కొనాలనుకున్నప్పుడు బ్రాండ్, బడ్జెట్ కంటే కూడా మనల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేది “కెపాసిటీ”. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఇండియన్ ఫ్యామిలీస్‌లో చాలా మంది 7 కేజీల మెషీన్ కొనాలా లేక 8 కేజీల మెషీన్ కొనాలా అని ఆలోచిస్తుంటారు. చూసేందుకు ఈ రెండింటి మధ్య కేవలం ఒకే ఒక్క కేజీ తేడా ఉన్నట్లు అనిపించినా.. మన రోజువారీ లాండ్రీ లోడ్, కరెంట్ బిల్లు ,వాషింగ్ పర్ఫార్మెన్స్‌పై ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. మీ ఫ్యామిలీ అవసరాలకు ఏ కెపాసిటీ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందో సింపుల్‌గా తెలుసుకుందాం.
వాషింగ్ మెషీన్ కెపాసిటీ అనేది ఎప్పుడూ కూడా తడి బట్టల బరువు కాదు, అది మెషీన్ డ్రమ్ మోయగలిగే ‘పొడి బట్టల’ గరిష్ట బరువును సూచిస్తుంది. ఈ విషయాన్ని మైండ్‌లో ఉంచుకుని మీ ఇంటికి ఏది కరెక్టో ఇప్పుడు చూద్దాం.
7 Kg వాషింగ్ మెషీన్ ఎవరికి బెస్ట్?
మీ ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు ఉన్నట్లయితే 7 కేజీల వాషింగ్ మెషీన్ సరిగ్గా సరిపోతుంది. ఈ సైజ్ మెషీన్‌లో ఒకేసారి దాదాపు 30 నుంచి 35 బట్టలను సులభంగా ఉతకవచ్చు. అంటే మీ రోజువారీ ఆఫీస్ బట్టలు, పిల్లల స్కూల్ యూనిఫారాలు, షర్టులు, జీన్స్ ప్యాంట్లు , కొన్ని చిన్న టవల్స్ ఇందులో ఒకే ట్రిప్‌లో క్లీన్ అయిపోతాయి. మీరు రోజు మార్చి రోజు బట్టలు ఉతికే అలవాటు ఉన్న చిన్న కుటుంబం అయితే.. ఇది తక్కువ నీరు , తక్కువ కరెంట్‌ను వాడుకుని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మార్కెట్లో 7 కేజీల ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ధరలు సాధారణంగా రూ.15,000 నుంచి ప్రారంభమై బ్రాండ్, ఫీచర్లను బట్టి రూ.28,000 వరకు ఉంటాయి.
Also Read: రూ.2000 లోపే బ్రాండెడ్ 3 జార్ మిక్సీలు.. మసాలాలు, గ్రేవీలు చిటికెలో రెడీ!
8 Kg వాషింగ్ మెషీన్ ఎవరికి అవసరం?
మీ ఇంట్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది (4-6 సభ్యులు) ఉన్నా, లేదా వారానికి ఒకేసారి బట్టలు ఉతికే అలవాటు ఉన్నా మీకు 8 కేజీల వాషింగ్ మెషీన్ చాలా అవసరం. ఇందులో ఒకేసారి 40 కి పైగా బట్టలను ఉతకవచ్చు. కేవలం బట్టల సంఖ్యే కాదు, బెడ్‌షీట్లు, వింటర్ బ్లాంకెట్లు, కర్టెన్లు వంటి హెవీ లోడ్స్‌ను ఉతకడానికి పెద్ద డ్రమ్ సైజ్ ఉండే 8 కేజీల మెషీన్ ఎంతో కంఫర్టబుల్‌గా ఉంటుంది. చిన్న మెషీన్‌లో పెద్ద దుప్పట్లు వేస్తే మోటార్‌పై లోడ్ పడి మెషీన్ త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది. ఇండియాలో 8 కేజీల మంచి వాషింగ్ మెషీన్ ధరలు సుమారుగా రూ.19,000 నుంచి రూ. 38,000 మధ్య అందుబాటులో ఉన్నాయి.
మీ బడ్జెట్ ఓకే అయితే.. ఎప్పుడూ ఒక సైజ్ పెద్ద వాషింగ్ మెషీన్ (8 కేజీలు) ఎంచుకోవడమే లాంగ్ రన్‌లో లాభదాయకం. దీని వల్ల బట్టలు డ్రమ్‌లో ఫ్రీగా తిరిగి, మురికి మరింత బాగా వదులుతుంది. మీరు రోజువారీ సాధారణ వాషింగ్ కోసం చూస్తుంటే 7 కేజీలు సరిపోతుంది. కానీ భవిష్యత్తు అవసరాలు , పెద్ద దుప్పట్లు ఇంట్లోనే ఉతుక్కోవాలి అనుకుంటే.. మాత్రం కళ్ళు మూసుకుని 8 కేజీల వాషింగ్ మెషీన్ వైపు వెళ్ళిపోవచ్చు.