E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

అయ్యగారికి అదృష్టం కలిసి వచ్చేనా.. ‘లెనిన్’ రిపేర్లు వర్కవుట్ అవుతాయా?

అయ్యగారికి అదృష్టం కలిసి వచ్చేనా.. ‘లెనిన్’ రిపేర్లు వర్కవుట్ అవుతాయా?
Advertisement

Akhil Lenin: అక్కినేని అఖిల్ ..అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా కావాల్సినవన్నీ ఉన్నా ఇప్పటికీ ఒక్క హిట్టు చూళ్లేకపోతున్నాడు.ఆ కథ అలా ఉంచితే ఇపుడు హిట్లు, ఫ్లాపుల కంటే కూడా ఆయన ఎంచుకునే కథలు, వాటి చుట్టూ జరిగే లీకులు, వాయిదాలే ఇపుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఏజెంట్’ వరకు ప్రతి సినిమాకూ భారీ హైప్ రావడం, ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం కామన్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే అఖిల్ నెక్స్ట్ లెవెల్ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో తెరపైకి వచ్చిన ప్రాజెక్ట్ ‘లెనిన్’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి అక్కినేని అభిమానుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి.

జూలై 10న రానున్న సినిమా 

Advertisement

అయితే, ఈ చిత్రం అనుకున్న సమయానికి థియేటర్లలోకి రాకపోవడం, వరుస వాయిదాల బారిన పడటం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. నిజానికి ఈ నెలలోనే గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, చివరి నిమిషంలో మళ్లీ పోస్ట్‌పోన్ అయ్యి జూలై 10ను కొత్త డేట్‌గా ఫిక్స్ చేసుకుంది. చిత్రబృందం దీనిపై అధికారికంగా క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఈ లేట్ వెనుక అసలు కథ వేరే ఉందనే ప్రచారం ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

also read :పుష్ప-2 ఎఫెక్ట్..సంధ్య థియేటర్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అల్లు అర్జున్

Advertisement

సాధారణంగా ఒక సినిమా వాయిదా పడిందంటే కేవలం గ్రాఫిక్స్ పనులో, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమో అని మేకర్స్ కవర్ చేస్తుంటారు. కానీ ‘లెనిన్’ విషయంలో అంతకుమించి ఏదో జరిగిందని ఇన్ సైడ్ టాక్.సినిమా ఫైనల్ ఔట్‌పుట్ చూసుకున్న మేకర్స్‌కు కొన్ని కీలకమైన సీన్స్ అస్సలు నచ్చలేదట. దీంతో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా దాదాపు కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లను మళ్లీ సెట్స్ పైకి తీసుకెళ్లి రీషూట్ చేశారని తెలుస్తోంది.

ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న రీ షూట్స్ 

అంతెందుకు, ఇప్పటికే భారీ ఖర్చుతో షూట్ చేసిన ఒక సాంగ్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి, సరికొత్త ట్యూన్‌తో మళ్లీ రీషూట్ చేశారంటే మేకర్స్ పడుతున్న టెన్షన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొన్నటి శనివారం కూడా ఓ కీలకమైన ప్యాచ్ వర్క్ సీన్ తెరకెక్కించడంతో ఈ సినిమాకు సంబంధించిన మేజర్ ‘రిపేర్లు’ అన్నీ పూర్తయినట్లు టాక్ నడుస్తోంది. గతంలో ‘ఏజెంట్’ సినిమా విషయంలో కూడా ఇలాంటి బజ్ వచ్చింది, కానీ అక్కడ రిజల్ట్ రివర్స్ అయింది. అందుకే ఈసారి రీషూట్ల వార్తలు వినగానే ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

also read :సమ్మర్ ముగిసినా సందడి తగ్గలేదు.. జూన్ చివరి వారంలో సినీ లవర్స్‌కు ఫుల్ మీల్స్!

అయితే నాణేనికి మరో వైపు చూస్తే, ఈ ఆలస్యం ఒక రకంగా సినిమాకు మంచే చేయొచ్చు. ఎందుకంటే వరుస వాయిదాలు, రీషూట్ల గోల వల్ల సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా తగ్గిపోతాయ్. టాలీవుడ్‌లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సైలెంట్‌గా వచ్చి బ్లాక్‌బస్టర్లు కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘లెనిన్’ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తే అఖిల్ కెరీర్ సెట్ అయిపోయినట్లే.

దర్శకుడు చేసిన ఈ మార్పులు, చేర్పులు స్క్రీన్‌పై పర్ఫెక్ట్‌గా వర్కవుట్ అయితే ప్రేక్షకులకు ఒక సీట్ ఎడ్జ్ ఎంటర్‌టైనర్ దొరకడం ఖాయం. కానీ ఒకవేళ ఈ కరెక్షన్లు కూడా బెడసికొడితే మాత్రం అక్కినేని ‘అయ్యగారి’ హిట్ కల మరోసారి వాయిదా పడక తప్పదు. మేకర్స్ పడుతున్న ఈ ఆరాటం సినిమాను నిలబెడుతుందా లేక పాత రిజల్ట్స్‌నే రిపీట్ చేస్తుందా అనేది తెలియాలంటే జూలై 10 వరకు ఆగాల్సిందే.

Related News

గాయత్రి గుప్తా సెన్సేషనల్ వీడియో.. చావు అంచున ఉన్నానంటూ నటి కన్నీటి పర్యంతం!

సమ్మర్ ముగిసినా సందడి తగ్గలేదు.. జూన్ చివరి వారంలో సినీ లవర్స్‌కు ఫుల్ మీల్స్!

పుష్ప-2 ఎఫెక్ట్..సంధ్య థియేటర్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అల్లు అర్జున్

రామ్ చరణ్ సినిమాపై కావాలనే కుట్ర.. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు!

సమంత ‘మా ఇంటి బంగారం’ 3 రోజుల గ్రాస్ ఎంతో తెలిస్తే?.. హీరోలు ఇక సద్దుకోవాల్సిందే..

‘లవ్ వైరస్–2’ సాంగ్ విడుదల చేసిన దర్శకుడు వి.వి. వినాయక్.. 36 గంటల్లో షూటింగ్..

బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. కొరటాల శివ ‘NBK112’ ముహూర్తం ఫిక్స్..

Big Stories

×