E-Paper
Advertisement

17600mAh బ్యాటరీ, ఇన్‌బిల్ట్ ప్రొజెక్టర్‌తో 8849 Tank 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర ఎంతంటే?

17600mAh బ్యాటరీ, ఇన్‌బిల్ట్ ప్రొజెక్టర్‌తో 8849 Tank 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర ఎంతంటే?
Advertisement

8849 Tank 5: సాధారణంగా ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో రకరకాల ఫీచర్లు చూస్తుంటాం. కానీ ఒక ఫోన్లోనే హోమ్ థియేటర్ లాంటి ప్రొజెక్టర్ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి! చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 8849 ఇలాంటి వినూత్నమైన ఆలోచనతోనే మార్కెట్లోకి 8849 Tank 5 అనే సరికొత్త రగ్గడ్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో ఇన్‌బిల్ట్‌గా పవర్‌ఫుల్ ప్రొజెక్టర్‌ను అమర్చారు.

పగలై నా.. రాత్రైనా బొమ్మ అదుర్స్:

ఈ ఫోన్‌లో ఉన్న 2K హై-రెజల్యూషన్ ప్రొజెక్టర్ ద్వారా ఇంట్లోనైనా, ఆరుబయట అయినా సినిమా థియేటర్ లాంటి అనుభూతిని పొందొచ్చు. చీకట్లోనే కాకుండా పగటిపూట కూడా క్లియర్‌గా కనిపించేలా దీనిలో 220 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. ఆటోఫోకస్, కీస్టోన్ కరెక్షన్ లాంటి సదుపాయాలు ఉండటం వల్ల గోడపై ఇమేజ్ ఏమాత్రం వంకర లేకుండా పక్కాగా వస్తుంది.

Advertisement

ఈ ప్రొజెక్టర్ హై-బ్రైట్‌నెస్ మోడ్‌లో 5 గంటలు, నైట్ మోడ్‌లో 6 గంటల పాటు నిరంతరాయంగా రన్ అవుతుంది. దీనికి తోడు 97dB స్మార్ట్ స్పీకర్లు ఉండటంతో సౌండ్ కూడా అదిరిపోతుంది.

అద్భుతమైన డిస్‌ప్లే, కెమెరా:

ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ లో 6.73 ఇంచుల 3K అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్ తో పాటు ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌కు ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి.

Advertisement

ఇకపోతే కెమెరా పరంగా బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరాతో పాటు, మరో 50MP టెలిఫోటో, 50MP నైట్ విజన్ కెమెరాలను ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.

భారీ బ్యాటరీ.. మరెన్నో ఫీచర్లు:

ఈ స్మార్ట్‌ఫోన్ లో ఏకంగా 17,600mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. దీనివల్ల ఛార్జింగ్ అయిపోతుందనే భయం అస్సలు ఉండదు. ఇంత పెద్ద బ్యాటరీని కేవలం 90 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ చేసేందుకు వీలుగా 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400e ప్రాసెసర్‌ని వాడారు.

అలాగే 18GB RAM, మరో 18GB వర్చువల్ RAM కలిపి మొత్తం 36GB వరకు RAM పవర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 512GB కాగా, మెమొరీ కార్డ్ ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు. వై-ఫై 7, బ్లూటూత్ 5.4 వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ధర ఎంతంటే?

ప్రస్తుతానికి ఈ 8849 Tank 5 స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక్క వేరియంట్ (18GB + 512GB)లో లభిస్తోంది. దీని ధరను గ్లోబల్ మార్కెట్ సుమారు రూ.84,791గా నిర్ణయించారు. ఈ సరికొత్త రగ్గడ్ మొబైల్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Related News

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే!

Big Stories

Advertisement
×