E-Paper
Advertisement

రూ.2,300 కే 50W డీజే బాక్సా? ఈ స్పీకర్ సౌండ్‌కి పక్కింటి వాళ్లు కూడా డ్యాన్స్ లేయాల్సిందే!

రూ.2,300 కే 50W డీజే బాక్సా? ఈ స్పీకర్ సౌండ్‌కి పక్కింటి వాళ్లు కూడా డ్యాన్స్ లేయాల్సిందే!
Advertisement

Ampnova Party-Star-X50 bluetooth speaker: ఇంట్లో చిన్న పాటి పార్టీ అన్నా.. ఫ్రెండ్స్‌తో కలిసి వీకెండ్ చిల్ అవ్వాలన్నా పవర్‌ ఫుల్ స్పీకర్ ఉండాల్సిందే! అయితే ఎక్కువ రేటు పెట్టి ఖరీదైన డీజే సిస్టమ్స్ కొనలేమని టెన్షన్ పడుతున్నారా? మీ కోసమే మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ ధరలో ఒక అదిరి పోయే పార్టీ స్పీకర్ వచ్చేసింది. అదే ‘Ampnova Party-Star-X50 50W’ బ్లూటూత్ పార్టీ స్పీకర్! కేవలం రూ.2,367 ధరకే లభిస్తున్న ఈ స్పీకర్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. అసలు దీని స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం!

పూర్తి ఫీచర్లు:

1. డిజైన్, బిల్డ్ క్వాలిటీ:

ఈ స్పీకర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, కాంపాక్ట్‌గా ఉంటుంది. బ్లాక్ కలర్ ఫినిషింగ్.. దీనికి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అంతే కాకుండా బరువు తక్కువగా ఉండటం వల్ల దీనిని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇండోర్ పార్టీలు, టెర్రస్ గెట్‌టు గెదర్‌లు లేదా చిన్నపాటి ఈవెంట్లకు ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

2. సౌండ్, పవర్ అవుట్‌పుట్ :

Advertisement

ఈ ప్రైస్ రేంజ్‌లో 50 వాట్ల పవర్ అవుట్‌ పుట్ ఇవ్వడం నిజంగా స్పెషల్ అనే చెప్పాలి. ఇది మోనో ఛానల్ ఆడియో సపోర్ట్‌తో వస్తుంది. దీని ద్వారా.. వచ్చే బేస్, ట్రెబుల్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటాయి. మీరు మామూలు పాటలు విన్నా లేదా హై-బీట్ పార్టీ సాంగ్స్ పెట్టుకున్నా.. రూమ్ మొత్తం సౌండ్ మార్మోగిపోతుంది. ఇది మీకు చిన్నపాటి డీజే ఫీల్‌ను ఇది ఇస్తుంది.

3. కనెక్టివిటీ ఆప్షన్స్:

లేటెస్ట్ టెక్నాలజీకి తగినట్లుగా.. ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీని అందించారు. మీ స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్ లేదా ల్యాప్‌ టాప్‌తో క్షణాల్లో ఇది పేర్ అయిపోతుంది. బ్లూటూత్ మాత్రమే కాకుండా..యూఎస్‌బీ పోర్ట్, మైక్రో ఎస్డీ కార్డ్ మరియు ఆక్స్ కేబుల్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి .. బ్లూటూత్ కనెక్షన్ లేకపోయినా పెన్ డ్రైవ్ ద్వారా నేరుగా పాటలు ప్లే చేసుకోవచ్చు.

4. బ్యాటరీ బ్యాకప్:

Advertisement

ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు.. లేదా కరెంట్ పోయినప్పుడు కూడా బ్రేక్ డా మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి మంచి బ్యాటరీ బ్యాకప్ అవసరం. ఆంప్‌నోవా స్పీకర్ పవర్ ఫుల్ రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది. ఒక్క సారి..ఛార్జ్ చేస్తే గంటల తరబడి నాన్‌ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది.

Also Read: బట్టలు కొత్తవాటిలా మెరిసిపోవాలా? వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు ఇవి మర్చిపోవద్దు!

5. వాల్యూ ఫర్ మనీ:

ఈ స్పీకర్ హైలైట్ దీని ధర అనే చెప్పాలి. మార్కెట్లో.. ఇతర బ్రాండ్ల 50W స్పీకర్లతో పోలిస్తే.. కేవలం రూ.2,367 ధరకే లభించడం బడ్జెట్ యూజర్లకు నిజంగా ఒక వరం. తక్కువ ఖర్చులో ఎక్కువ ఫీచర్లు, పవర్‌ ఫుల్ సౌండ్ కోరుకునే వారికి ఇది వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి పార్టీ స్పీకర్ కొనాలని చూస్తున్నట్లయితే .. ఈ మోడల్ బ్లూటూత్ స్పీకర్ ఒక అద్భుతమైన ఛాయిస్. అదిరి పోయే సౌండ్, స్టైలిష్ లుక్, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరతో వస్తున్న ఈ స్పీకర్‌తో మీ ప్రతి వేడుకను మరింత ఆనందంగా మార్చుకోండి!

Related News

వామ్మో.. ఫేస్ అన్‌లాక్ విషయంలో ఐఫోన్, ఆండ్రాయిడ్ మధ్య ఇంత తేడా ఉందా?

ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ ఫీచర్లు చూస్తే..కొనకుండా ఉండలేరు తెలుసా ?

వాట్సాప్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌తో విసిగిపోయారా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు!

వేడి నీళ్లలో ముంచినా చెక్కుచెదరదు.. హానర్ నుంచి అసాధారణ ఫీచర్లతో సరికొత్త ఫోన్!

18 నెలల వారంటీతో ‘యూగ్రీన్ 67W ట్రావెల్ ఛార్జర్’.. ల్యాప్‌టాప్, ఫోన్, బడ్స్ అన్నీ ఒకేసారి ఫుల్ చార్జ్!

బట్టలు కొత్తవాటిలా మెరిసిపోవాలా? వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు ఇవి మర్చిపోవద్దు!

టీవీ కొనాలా? ప్రొజెక్టర్ తీసుకోవాలా? ధరతో పాటు ఈ ఖర్చులు తెలిస్తే నిర్ణయం సులభమే!

Big Stories

Advertisement
×