E-Paper
Advertisement

మార్కెట్‌ను షేక్ చేస్తున్న100 ఇంచుల టీవీ..ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లు

మార్కెట్‌ను షేక్ చేస్తున్న100 ఇంచుల టీవీ..ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లు
Advertisement

Acerpure 100 inch QLED TV: ప్రస్తుతం చిన్న టీవీల ట్రెండ్ పోయి, పెద్ద స్క్రీన్లు , హోమ్ థియేటర్ సెటప్‌ల వైపు జనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కస్టమర్ల ఊహలకు తగినట్లుగా ప్రముఖ బ్రాండ్లు గెయింటెంట్ సైజ్ డిస్‌ప్లేలను మార్కెట్లోకి ప్రవేశ పెడుతున్నాయి. ఇదే కోవలో ఎసెర్‌ప్యూర్ సంస్థ సరికొత్త మైలురాయిగా కొత్త మోడల్ ను లాంచ్ చేసింది.బెస్ట్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారిని ఈ టీవీ ఇన్‌స్టంట్‌గా ఆకట్టుకుంటోంది. తక్కువ బడ్జెట్ లో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ధర వివరాలు:

ఇంతటి భారీ స్క్రీన్, ప్రీమియం ఫీచర్లు కలిగిన ఈ టీవీ ధర విషయానికి వస్తే.. దీని అధికారిక ధర రూ.1,49,999 గా ఉంది.ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లు, ఎలక్ట్రానిక్స్ రిటైల్ మార్కెట్లలో ఇది కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఫెస్టివల్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ఉపయోగించుకుంటే మరింత తక్కువ ధరకు దీనిని సొంతం చేసుకునే అవకాశం ఉంది.

అద్భుతమైన డిస్‌ప్లే , పిక్చర్ క్వాలిటీ:

Advertisement

ఈ టీవీకి ప్రధాన హైలైట్ దీని భారీ 100 ఇంచుల (253 సెం.మీ) QLED డిస్‌ప్లే. క్వాంటమ్ డాట్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల రంగులు చాలా సహజంగా, కాంతివంతంగా కనిపిస్తాయి. 4K అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ కారణంగా ప్రతి చిన్న వివరాలు అత్యంత స్పష్టంగా కనబడతాయి. డాల్బీ విజన్ , హెచ్‌డీఆర్10+ సపోర్ట్ ఉండటం వల్ల సినిమాలు చూసేటప్పుడు థియేటర్ ఫీల్ ఖాయంగా లభిస్తుంది. పెద్ద లివింగ్ రూమ్‌లు, ఆడిటోరియంలు లేదా హోమ్ థియేటర్ రూమ్‌లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

గేమర్స్ కోసం నెక్స్ట్-లెవెల్ పెర్ఫార్మెన్స్:

కేవలం సినిమా లవర్స్‌కు పండగ మాత్రమే కాకుండా, హై-ఎండ్ గేమింగ్ ఆడే వారి కోసం ఎసెర్‌ప్యూర్ ఇందులో ప్రత్యేక ఫీచర్లను యాడ్ చేసింది. హై రిఫ్రెష్ రేట్, ఆటో లో లేటెన్సీ మోడ్ కూడా దీనిలో ఉండటం వల్ల గేమ్స ఆడేటప్పుడు ఎలాంటి లాగ్ సమస్య ఉండదు. ఫాస్ట్-మూవింగ్ యాక్షన్ సీన్స్ లేదా రేసింగ్ గేమ్స్ ఆడేటప్పుడు సూపర్ స్మూత్ విజువల్స్ లభిస్తాయి.

Advertisement

Also Read: సీసీ కెమెరా కొనాలనుకుంటున్నారా ?ఈ మోడల్స్‌ని మించినవి లేవు తెలుసా?

స్మార్ట్ ఫీచర్లు, ఆడియో:

లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పని చేస్తుంది. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్‌లను ఈజీగా యాక్సెస్ చేయెచ్చు. వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఇన్‌బిల్ట్‌గా లభిస్తుంది. ఇక సౌండ్ పరంగా పవర్ ఫుల్ స్పీకర్లు, డాల్బీ అట్మాస్ టెక్నాలజీని అందించడం వల్ల అదనపు హోమ్ థియేటర్ స్పీకర్ల అవసరం లేకుండానే.. రిచ్ ఆడియో లభిస్తుంది.

మీ ఇంటిని నిజమైన సినిమా హాల్‌గా మార్చుకోవాలని.. కలలు కంటుంటే, రూ.1,49,999 బడ్జెట్‌లో లభిస్తున్న ఈ ఎసెర్‌ప్యూర్ 100 ఇంచుల QLED 4K గూగుల్ టీవీ ఒక అద్భుతమైన ప్రీమియం ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పొచ్చు!

Related News

కొత్త ఫోన్ కొన్న తర్వాత ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి? అసలు నిజం ఇదే!

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో..అదిరిపోయే డిష్‌వాషర్లు,ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు

మెుబైల్ పాస్‌వర్డ్ లేదా పాటర్న్ మర్చిపోయారా? ఆందోళన వద్దు.. ఇంట్లోనే ఇలా అన్‌లాక్ చేయండి!

జియో సూపర్ డూపర్ ప్లాన్స్.. రూ. 449 vs రూ. 500.. దేని బెనిఫిట్స్ ఎంత?

సీసీ కెమెరా కొనాలనుకుంటున్నారా ?ఈ మోడల్స్‌ని మించినవి లేవు తెలుసా?

నో గ్యాస్.. నో స్మోక్.. బొగ్గుతో పనిచేసే ఎలక్ట్రిక్ కోల్ బర్నర్.. నిజంగా అదిరిపోయింది మామ!

అమెజాన్‌లో బంపర్ సేల్.. రూ.59,000 తగ్గిన ప్రీమియం రిఫ్రిజిరేటర్ ధర!

Big Stories

Advertisement
×