E-Paper
Advertisement

సీసీ కెమెరా కొనాలనుకుంటున్నారా ?ఈ మోడల్స్‌ని మించినవి లేవు తెలుసా?

సీసీ కెమెరా కొనాలనుకుంటున్నారా ?ఈ మోడల్స్‌ని మించినవి లేవు తెలుసా?
Advertisement

Best CCTV camera: ఇంట్లో ఫ్యామిలీ ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, మనం ఊరికి వెళ్లినప్పుడు మన ఆస్తులు సేఫ్‌గా ఉండాలన్నా ఇప్పుడు ‘నైట్ విజన్’ సీసీటీవీ కెమెరాలు ప్రతి ఇంటికి ఒక అత్యవసర కవచంలా మారి పోయాయి. చీకట్లో కూడా ఫుటేజ్‌ని చాలా క్టారిటీతో తీసే ఈ అడ్వాన్స్‌డ్ కెమెరాలు దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మార్కెట్‌లో హాట్ కేకులా అమ్ముడుపోతున్న బెస్ట్ టాప్ 5 నైట్ విజన్ సీసీటీవీ కెమెరా బ్రాండ్లు, వాటి అదిరి పోయే ఫీచర్లు, ధరల వివరాలపై ఒక లుక్కేద్దాం రండి!

టాప్ 5 మోడల్స్, ధరల వివరాలు:

1. CP Plus 360° 3MP Wi-Fi PT CCTV Camera:

ఇండియన్ మార్కెట్లో హోమ్ సెక్యూరిటీ విషయంలో సిపి ప్లస్ నంబర్ వన్ బ్రాండ్‌గా కొనసాగుతోంది. ఈ 3ఎంపీ కెమెరా 360-డిగ్రీల రొటేషన్, మోషన్ డిటెక్షన్ , పవర్‌ ఫుల్ కలర్ నైట్ విజన్ ఫీచర్‌తో వస్తుంది. మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా లైవ్ ఫుటేజ్ చూసే వెసులుబాటు ఉంది.

Advertisement

ధర: రూ.2,299 నుంచి రూ.2,999 మధ్య అందుబాటులో ఉంది.

2. Qubo Smart Cam 360 3MP:

హీరో గ్రూప్‌నకు చెందిన ‘క్యూబో’ బ్రాండ్ ఇండియన్ యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా అద్భుతమైన సెక్యూరిటీ ప్రొడక్ట్స్‌ను అందిస్తోంది. ఇందులో ఇన్‌బిల్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండటం వల్ల మనుషుల కదలికలను ఇట్టే గుర్తించి మొబైల్‌కు అలర్ట్ పంపుతుంది. చీకట్లోనూ స్పష్టమైన ఇమేజ్ ఇచ్చే ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ దీని సొంతం.

Advertisement

ధర: రూ. 2,199 నుంచి రూ.2,699 వరకు ఉంటుంది.

3. Mi 360° Home Security Camera 2K Pro:

షియోమి బ్రాండ్ నుంచి వస్తున్న ఈ కెమెరా అల్ట్రా-క్లియర్ 2కే రిజల్యూషన్‌తో పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. డ్యూయల్ మైక్ నాయిస్ రిడక్షన్, టూ-వే టాకింగ్ , అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ సపోర్ట్ దీని ప్రత్యేకత. ఇల్లు ఎంత చీకటిగా ఉన్నా క్లారటీ ఫుటేజ్ అందించడంలో ఇది ముందుంటుంది.

ధర: రూ.3,499 నుంచి రూ.3,999 మధ్య లభిస్తుంది.

4. TP-Link Tapo C200 / C210 Camera:

ప్రపంచ వ్యాప్తంగా వైఫై రౌటర్లు , సెక్యూరిటీ కెమెరాలకు పెట్టింది పేరు టీపీ-లింక్. తక్కువ బడ్జెట్‌లో బాగా పనిచేసే మోడల్ కావాలనుకునే వారికి టాపో సిరీస్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది 30 అడుగుల వరకు స్పష్టమైన నైట్ విజన్ రేంజ్‌ను ఇస్తుంది.

ధర: రూ. 2,499 నుంచి రూ. 2,899 వరకు ఉంది.

Also Read: థియేటర్లలను తలపించేలా హైసెన్స్ ఎల్ఈడీ టీవీలు..ఎగబడి కొంటున్న జనం

5. Imilab C22 3K Resolution Security Camera:

కొత్త తరం టెక్నాలజీతో వస్తున్న.. ఇమిలాబ్ సి22 కెమెరా అసాధారణమైన 3కే క్లారిటీతో పని చేస్తుంది. స్మార్ట్ ట్రాకింగ్ , వైడ్ యాంగిల్ కవరేజ్ కారణంగా.. పెద్ద హాల్స్ లేదా ఆఫీసులకు ఇది బెస్ట్ ఆప్షన్. చీకటిలోనూ..  ఫోటోలు లేదా వీడియోలు రికార్డ్ చేసే లేటెస్ట్ నైట్ విజన్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి.

ధర: రూ.2,999 నుంచి రూ.3,499 వరకు ఉంటుంది.

మీ ఇల్లు లేదా ఆఫీసును 24/7 సేఫ్‌‌గా ఉంచుకోవడానికి పై బ్రాండ్లలో మీ బడ్జెట్‌కు సరిపోయే ఒక మంచి సీసీటీవీ కెమెరాను ఇప్పుడే ఎంచుకోండి. సరైన సెక్యూరిటీ సిస్టమ్ మనశ్శాంతితో పాటు సేఫ్టీని కూడా అందిస్తుంది!

Related News

జియో సూపర్ డూపర్ ప్లాన్స్.. రూ. 449 vs రూ. 500.. దేని బెనిఫిట్స్ ఎంత?

నో గ్యాస్.. నో స్మోక్.. బొగ్గుతో పనిచేసే ఎలక్ట్రిక్ కోల్ బర్నర్.. నిజంగా అదిరిపోయింది మామ!

అమెజాన్‌లో బంపర్ సేల్.. రూ.59,000 తగ్గిన ప్రీమియం రిఫ్రిజిరేటర్ ధర!

థియేటర్లలను తలపించేలా హైసెన్స్ ఎల్ఈడీ టీవీలు..ఎగబడి కొంటున్న జనం

కొత్త వాషింగ్ మిషన్ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. చౌకగా బ్రాండెడ్ మోడల్స్!

అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే ప్రీమియం OLED టీవీలు.. ఇంటినే థియేటర్‌గా మార్చేయండి!

ఫోన్‌లో అనవసరమైన యాడ్స్ వస్తున్నాయా?ఈ 5 పద్ధతులతో చెక్ చేయండి!

Big Stories

Advertisement
×