E-Paper
Advertisement

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్..తక్కువ ధరలో భారీ స్క్రీన్

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్..తక్కువ ధరలో భారీ స్క్రీన్
Advertisement

Acerpure Nitro 75 inch QLED TV: ప్రస్తుత కాలంలో లివింగ్ రూమ్ లుక్ పూర్తిగా మారిపోయింది. సాధారణ టీవీల స్థానంలో పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీలు హోమ్ ఎంటర్‌ టైన్‌మెంట్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా సినిమాలు చూసేటప్పుడు లేదా గేమింగ్ ఆడేటప్పుడు బిగ్ స్క్రీన్ ఇచ్చే మజాయే వేరు. ఈ కోవలోనే ప్రముఖ బ్రాండ్ అయిన ఏసర్‌ప్యూర్ నుంచి వస్తున్న ఈ మోడల్ టీవీ ప్రస్తుతం టెక్కీలు, మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ లగ్జరీ టీవీ అందించే అద్భుతమైన ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1.క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే, విజువల్స్ క్వాలిటీ:

ఈ టీవీ మెయిన్  హైలైట్ దీని భారీ 75-ఇంచుల క్యూఎల్ఈడీ అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే. క్యూఎల్‌ఈడీ టెక్నాలజీ ఉండటం వల్ల కలర్స్ చాలా రిచ్‌గా, బ్రైట్‌గా, సహజంగా కనిపిస్తాయి. దీనికి తోడు డాల్బీ విజన్ సపోర్ట్ ఉండటం వల్ల మీరు చూసే ప్రతీ సీన్ థియేటర్‌లో చూస్తున్నంత రియలిస్టిక్‌గా అనిపిస్తుంది.

2.  120Hz రిఫ్రెష్ రేట్ & అడ్వాన్స్‌డ్ ఫీచర్స్:

Advertisement

వీడియో గేమ్స్ ఆడే వారికి ఈ టీవీ ఒక డ్రీమ్ గ్యాడ్జెట్ అనే చెప్పవచ్చు. ఇది ఏకంగా 120Hz హై రిఫ్రెష్ రేట్, GTV 5.0 సపోర్ట్‌తో వస్తుంది. అలాగే ఆటో లో లేటెన్సీ మోడ్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్, MEMC టెక్నాలజీలు ఉండటం వల్ల గేమింగ్ ఆడేటప్పుడు స్క్రీన్ లాగ్ అవ్వడం లాంటి సమస్యలు అస్సలు ఉండవు. చాలా స్మూత్ , ఫాస్ట్ గేమింగ్ ఫీల్ ఇది అందిస్తుంది.

3. సౌండ్, ఆడియో ఫీల్:

మంచి విజువల్స్‌తో పాటు పవర్‌ ఫుల్ సౌండ్ ఉంటేనే అసలైన ఎంటర్‌ టైన్‌మెంట్ దొరుకుతుంది. ఈ ఏసర్‌ప్యూర్ టీవీలో 40వాట్ సౌండ్ అవుట్‌ పుట్ అందించే పవర్ ఫుల్ స్పీకర్లను అమర్చారు. దీనికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోడవ్వడంతో బేస్ , సరౌండ్ సౌండ్ ఫీల్ అద్భుతంగా ఉంటుంది. అదనంగా ఇందులో కచేరీ ఫీచర్ కూడా ఉంది. కాబట్టి ఇంట్లోనే ఫ్రెండ్స్‌తో కలిసి పాటలు పాడుతూ ఎంజాయ్ చేయెచ్చు.

Advertisement

Also Read: తక్కువ ధరలో..మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా ?

4. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్, స్మార్ట్ ఫీచర్స్:

ఈ స్మార్ట్ టీవీ తాజా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీని వల్ల గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్ చాలా ఫాస్ట్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్, వై-ఫై డైరెక్ట్, ఏఐ ఫీచర్లు, వివిధ ఓటీటీ యాప్స్‌ను ఈజీగా యాక్సెస్ చేయెచ్చు. అలాగే గోడకు అమర్చుకోవడానికి తగిన వాల్ మౌంట్ కూడా దీని తోనే వస్తుంది.

5. ధర :

ఇన్ని హై-ఎండ్ ప్రీమియం ఫీచర్లు కలిగిన ఈ టీవీ అసలు మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ప్రత్యేక ఫెస్టివల్ డిస్కౌంట్ల కింద కేవలం రూ. 56,999 ధరకే వినియోగదారులకు లభిస్తోంది. 75 ఇంచుల భారీ స్క్రీన్ క్యూఎల్‌ఈడీ టీవీ ఈ బడ్జెట్‌లో దొరకడం నిజంగా అద్భుతమైన డీల్ అనే చెప్పాలి.

మీ ఇంటి హాల్‌ను ఒక మినీ థియేటర్‌లా మార్చు కోవాలనుకుంటే లేదా హై-ఎండ్ గేమింగ్ ఫీల్ కోరుకుంటే ఈ మోడల్ బెస్ట్. తక్కువ బడ్జెట్‌లో బిగ్ స్క్రీన్ లగ్జరీ కోరుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్!

Related News

తక్కువ బడ్జెట్‌లో సూపర్ సౌండ్..40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్

వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?

ఔటింగ్స్, పార్టీల కోసం పర్‌ఫెక్ట్ స్పీకర్..రూ.1,999కే అదిరిపోయే సౌండ్!

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధమాకా..HP లాప్‌టాప్స్‌ ఇప్పుడు సగం ధరకే !

Big Stories

Advertisement
×