Adobe Photoshop: సాధారణంగా భారతదేశంలో ఏదైనా పండగ వస్తుందంటే చాలు.. ప్రముఖ కంపెనీలు రకరకాల ఆఫర్లు ఇస్తుంటాయి. అయితే ఈసారి విద్యార్థుల కోసం అడోబ్ కంపెనీ ఒక అద్భుతమైన ఆఫర్‌ను తీసకొచ్చింది. మన దేశంలోని కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఒక ఏడాది పాటు ఉచితంగా ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా ఫోటోషాప్ వాడాలంటే ఏడాదికి రూ.1,999 వరకు ఖర్చవుతుంది. కానీ ఈ పండుగ ఆఫర్ కింద రూపాయి కూడా కట్టకుండా.. పూర్తిగా 100 శాతం డిస్కౌంట్‌తో ఉచితంగా పొందే అవకాశం లభిస్తోంది. మీలో కూడా ఫోటో ఎడిటింగ్ పట్ల ఆసక్తి ఉంటే లేదా డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ ఆఫర్ మీకు ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.
ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం భారతదేశంలోని కాలేజీ విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మీరు ఆఫర్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు మీ కాలేజీ వివరాలను అందించాల్సి ఉంటుంది. అప్పుడే అడోబ్ సంస్థ మీరు నిజంగా స్టూడెంట్ అవునో కాదో వెరిఫై చేసి, ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేస్తుంది. మీ దగ్గర కాలేజ్ వివరాలు ఉంటే చాలు, చాలా సులభంగా ఈ ప్రాసెస్ పూర్తి చేసి మీ అకౌంట్‌లో ఫోటోషాప్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
Also Read: ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?
ఈ ఆఫర్‌ను పొందే విధానం చాలా సింపుల్. ముందుగా అడోబ్ ఫోటోషాప్ స్టూడెంట్ ఆఫర్ పేజీకి వెళ్లాలి. అక్కడ మీ పాత అడోబ్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి లేదా కొత్త ఈ-మెయిల్ ఐడీతో ఖాతా క్రియేట్ చేసుకోవాలి. చెకౌట్ పేజీలో సాధారణంగా రూ.1,999 చూపిస్తుంది. కానీ ఈ ఆఫర్ వల్ల కట్టాల్సిన మొత్తం రూ.0 అని కనిపిస్తుంది. అక్కడ మీ కాలేజ్ వివరాలు నమోదు చేసి, పేమెంట్ విధానంలో యూపీఐని ఎంచుకోవాలి. యూపీఐ ఆటోపే కోసం రూ.2 కట్ కావచ్చు. ఆ తర్వాత మీ ఫోటోషాప్ ఒక సంవత్సరం పాటు ఉచితంగా పనిచేస్తుంది.
ఈ ఆఫర్‌లో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మొదటి ఏడాది అంతా ఉచితంగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత మీ సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రీఛార్జ్ అవుతుంది. అంటే వన్ ఇయర్ పూర్తి కాగానే మీ అకౌంట్ నుండి రూ.1,999 కట్ అవుతాయి. కాబట్టి.. మీకు ఏడాది తర్వాత ఈ సేవలు వద్దనుకుంటే, ఉచిత వ్యవధి ముగిసేలోపే మీ సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల ఎలాంటి అదనపు ఛార్జీలు పడకుండా జాగ్రత్తపడవచ్చు.
అడోబ్ ఈ ఆఫర్‌ను ఎప్పుడైనా ఆపేసే అవకాశం ఉంది. ఏలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆఫర్‌ను ఉపసంహరించుకోవచ్చని కంపెనీ తెలిపింది. కాబట్టి.. ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ వెంటనే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం మంచిది.
Also Read: డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!