E-Paper
Advertisement

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!
Advertisement

OPPO F35 5G and F35 Pro 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి Oppo F35 5G, Oppo F35 Pro 5G పేర్లతో రెండు కొత్త ఫోన్లను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. సాధారణంగా 5,000mAh లేదా 6,000mAh బ్యాటరీతో వస్తేనే భారీ బ్యాటరీగా భావించే రోజుల్లో.. ఒప్పో ఏకంగా 8,000mAh బ్యాటరీని అందించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ గంటలు బ్యాకప్ అందించేలా రూపొందించిన ఈ రెండు ఫోన్లు బ్యాటరీ విషయంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసేలా కనిపిస్తున్నాయి. మరి ఇంత భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్లలో ఒప్పో అందించిన ఇతర ఫీచర్లు ఏంటి? ధర ఎంత? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

చూడటానికి చాలా అట్రాక్టివ్‌గా ఉండే ఈ ఫోన్లలో అద్భుతమైన డిస్‌ప్లేలను అందించారు. ప్రో మోడల్‌‌లో 6.7 అంగుళాల 144Hz AMOLED డిస్‌ప్లే ఉండగా.. బేస్ మోడల్‌లో 6.5 అంగుళాల 120Hz AMOLED స్క్రీన్ ఇచ్చారు. గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా విజువల్స్ చాలా స్మూత్‌గా కనిపిస్తాయి. ఫోన్ కిందపడినా ఏమీ కాకుండా మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, నీళ్లలో తడిచినా పాడవకుండా ఐపీ రేటింగ్స్ ఇచ్చారు.

Advertisement

Also Read: చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

పనితీరు విషయంలో రాజీ పడకుండా మీడియాటెక్ ప్రాసెసర్లను వాడారు. ప్రో మోడల్‌లో డైమెన్సిటీ 7360 MAX ప్రొసెసర్, సాధారణ మోడల్‌లో డైమెన్సిటీ 6360 MAX ప్రాసెసర్ ఉన్నాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే.. రెండింటిలోనూ వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ముందువైపు సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ప్రో మోడల్‌లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కూడా లభిస్తుంది.

Advertisement

ఈ ఫోన్లలో అసలైన హైలైట్ 8,000mAh బ్యాటరీ. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు రోజులకు పైగా హ్యాపీగా వాడేసుకోవచ్చు. పైగా దీనికి 80W సూపర్ ఊక్ వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి.. ఇంత పెద్ద బ్యాటరీ కూడా త్వరగానే ఛార్జ్ అయిపోతుంది. ధరల విషయానికి వస్తే.. Oppo F35 5G ప్రారంభ ధర రూ.38,999 కాగా.. Oppo F35 Pro 5G ప్రారంభ ధర రూ.45,999గా ఉంది. వీటిపై 10 శాతం బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లలో వీటి సేల్ ప్రారంభం కానుంది.

Also Read: Wi-Fi 8 రాకతో డెడ్ జోన్స్ మాయం.. సిగ్నల్ డ్రాప్స్‌కి పర్మనెంట్ చెక్ పెట్టేసే కొత్త ఫీచర్లు!

Tags

Related News

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Wi-Fi 8 రాకతో డెడ్ జోన్స్ మాయం.. సిగ్నల్ డ్రాప్స్‌కి పర్మనెంట్ చెక్ పెట్టేసే కొత్త ఫీచర్లు!

ఒక్కసారి కొంటే 5 ఏళ్లు తిరుగుండదు.. బడ్జెట్‌లో టాప్-5 ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే!

బాధను కూడా నవ్వుతూ చెప్పేస్తున్న Gen Z.. సోషల్ మీడియాలో ఇదో కొత్త ట్రెండ్!

AI ఏసీలు నిజంగా కరెంట్ బిల్లు తగ్గిస్తాయా? లేక కంపెనీల మైండ్ గేమా?

Big Stories

Advertisement
×