E-Paper
Advertisement

ఏఐకి గురువులుగా మారండి.. వేలల్లో సంపాదించండి.. టెక్ రంగంలో సరికొత్త ట్రెండ్

ఏఐకి గురువులుగా మారండి.. వేలల్లో సంపాదించండి.. టెక్ రంగంలో సరికొత్త ట్రెండ్
Advertisement

AI Training Jobs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ మార్కెట్ స్వరూపాన్నే మార్చేసింది. నిన్నటి వరకు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భ‌యం ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఏఐకి శిక్షణనివ్వడం ద్వారా భారీగా సంపాదించే కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డిన్‌ వేదికగా ఇప్పుడు సరికొత్త ఏఐ మార్కెట్‌ సందడి చేస్తోంది. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చే నిపుణులకు కంపెనీలు గంటకు ఏకంగా రూ. 14,000 ($165 నుండి $200) వరకు చెల్లించడానికి సిద్ధపడుతుండటం విశేషం.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాల మధ్య ఏఐ రేసు తీవ్రతరమైంది. తమ ఏఐ చాట్‌బాట్‌లు లేదా మోడళ్లు మరింత కచ్చితత్వంతో, మానవ మేధస్సుతో సమానంగా స్పందించాలంటే వాటికి సరైన శిక్షణ అవసరం. ఇందుకోసం ‘ఏఐ లేబర్‌ మార్కెట్‌ప్లేస్‌’ (AI Labor Marketplace) విధానాన్ని కంపెనీలు వేగంగా అనుసరిస్తున్నాయి. గూగుల్, మెటా, ఓపెన్ ఏఐ వంటి సంస్థలు తమ అల్గోరిథంలను మెరుగుపరచడానికి డేటా అనలిస్ట్లు, భాషా నిపుణులు, ప్రాంప్ట్ ఇంజనీర్లను భారీ వేతనాలతో నియమించుకుంటున్నాయి. కేవలం సాఫ్ట్‌వేర్ నైపుణ్యం మాత్రమే కాకుండా, క్రియేటివ్ రైటింగ్, లాజికల్ థింకింగ్ ఉన్నవారికి కూడా ఈ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.

Advertisement

లింక్డిన్ ఇప్పుడు కేవలం ఉద్యోగాల వేటకే కాకుండా, ఏఐ శిక్షకులను కంపెనీలకు కనెక్ట్ చేసే అతిపెద్ద మార్కెట్‌ప్లేస్‌గా అవతరించింది. అనేక స్టార్టప్‌లు మరియు బహుళజాతి కంపెనీలు ‘డేటా లేబులింగ్’, ‘RLHF’ (Reinforcement Learning from Human Feedback) వంటి పనుల కోసం నిపుణులను వెతుకుతున్నాయి. ఒక నిపుణుడు ఏఐ ఇచ్చే సమాధానాలను సరిచూస్తూ, అందులోని తప్పులను సవరించడం ద్వారా ఆ యంత్రం మరింత తెలివిగా మారేలా చేస్తారు. ఈ నైపుణ్యానికి ఉన్న డిమాండ్ కారణంగానే గంటల ప్రాతిపదికన వేల రూపాయల రెమ్యూనరేషన్ అందుతోంది.

సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కన్నా ఈ ఏఐ శిక్షణ పనులు ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి. “ఏఐ అనేది ఒక బిడ్డ లాంటిది. దానికి ఎంత బాగా శిక్షణ ఇస్తే అంత బాగా పనిచేస్తుంది.” అనే సూత్రాన్ని కంపెనీలు నమ్ముతున్నాయి. ఈ క్రమంలోనే ‘ఏఐ లేబర్ మార్కెట్‌ప్లేస్’ అనేది భవిష్యత్తులో ఒక పూర్తిస్థాయి పరిశ్రమగా మారబోతోంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారు.. ముఖ్యంగా ఫ్రీలాన్సర్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారు. ఏఐ రేసు ఎంత వేగంగా ఉంటే, ఈ మార్కెట్‌ప్లేస్ అంతగా విస్తరిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

Read Also: లీటర్‌కు 45 కిమీ మైలేజీ.. ఆటో మోబైల్ ఇండస్ట్రీలో కొత్త కారు సంచలనం!

Tags

Related News

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

వాట్సప్ న్యూ ఫీచర్ అదిరింది.. ఇకపై అకౌంట్ లేకపోయినా కాల్స్ జాయిన్ అవ్వొచ్చు!

సైబర్ ఫ్రాడ్‌లో డబ్బు పోయిందా? ప్రభుత్వ పోర్టల్‌లో ఇలా రిఫండ్ కోసం అప్లై చేసుకోండి!

కారులో ఆండ్రాయిడ్ ఆటో వాడే అలవాటు ఉందా? అయితే మీ ఫోన్ బ్యాటరీ డేంజర్లో పడ్డట్టే!

Big Stories

Advertisement
×