E-Paper
Advertisement

లీటర్‌కు 45 కిమీ మైలేజీ.. ఆటో మోబైల్ ఇండస్ట్రీలో కొత్త కారు సంచలనం!

లీటర్‌కు 45 కిమీ మైలేజీ.. ఆటో మోబైల్ ఇండస్ట్రీలో కొత్త కారు సంచలనం!
Advertisement

Guinness Record Mileage: చైనీస్ ఆటో మోబైల్ కంపెనీ గీలీ ఆటో సరికొత్త కారును తయారు చేసింది. ఈ కొత్త తరం i-HEV (ఇంటెలిజెంట్ హైబ్రిడ్) వ్యవస్థ ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ అధునాతన AI ఆధారిత పవర్ మెయింటెనెన్స్ వ్యవస్థతో పని చేస్తూ, అత్యంత మెరుగైన మైలేజీని అందిస్తోంది. తాజాగా ఈ కారు లీటర్ కు ఏకంగా 45 కి.మీ మైలేజీని సాధించి గిన్నిస్ రికార్డ్ ను క్రియేట్ చేసింది.

ఏఐ టెక్నాలజీతో ఎక్కువ మైలేజీ

ఈ కొత్త i-HEV వ్యవస్థలో AI టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. డ్రైవింగ్ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, ఏ మోడ్‌ లో కారు నడవాలో స్వయంగా నిర్ణయిస్తుంది. అవసరాన్ని బట్టి ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్, సిరీస్ హైబ్రిడ్ మోడ్, ప్యారలల్ మోడ్‌ ల మధ్య మారుతూ, ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల ఇంజిన్ ఎప్పుడూ గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈ సిస్టమ్‌లో 48 శాతం కంటే ఎక్కువ థర్మల్ ఎఫిషియెన్సీని కలిగి ఉంది. ఇది ప్రస్తుత హైబ్రిడ్ టెక్నాలజీలతో పోలిస్తే చాలా ఎక్కువ. అలాగే, ఎలక్ట్రిక్ మోటార్ సుమారు 230 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సెకన్లలోనే గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. సిటీ ట్రాఫిక్‌ లో స్మూత్ డ్రైవింగ్, మెరుగైన కంట్రోల్, తక్కువ ఇంధన వినియోగం లాంటి ప్రయోజనాలు ఈ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతున్నాయి.

Advertisement

ఈ కొత్త హైబ్రిడ్ వ్యవస్థను గీలీ ప్రిఫేస్, గీలీ మొంజారో లాంటి మోడళ్లలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఈ మోడళ్లు కూడా మెరుగైన మైలేజీని అందిస్తాయని తెలుస్తోంది. ప్రిఫేస్ మోడల్ సుమారు 25 కి.మీ./లీటర్ వరకు మైలేజీ ఇస్తే, మొంజారో మోడల్ 21 కి.మీ./లీటర్ వరకు ఇస్తుందని భావిస్తున్నారు. ఇవి ప్రస్తుత మోడళ్లతో పోలిస్తే చాలా ఎక్కువ మైలేజీగా చెప్పుకోవచ్చు.

డిజైన్ పరంగా ఈ కొత్త వేరియంట్లు కీలక మార్పులతో వస్తాయి. కొత్త అల్లాయ్ వీల్స్, ఆకర్షణీయమైన రంగులు, డ్యూయల్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, హైటెక్ కనెక్టివిటీ ఫీచర్లు, వెంటిలేటెడ్, మసాజింగ్ సీట్లు లాంటి సౌకర్యాలు ఇందులో ఉంటాయి. డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి.

ప్రపంచ వ్యాప్తంగా హైబ్రిడ్ కార్లపై ఆసక్తి

Advertisement

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హైబ్రిడ్ కార్లపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా చైనాలో ఈ సెగ్మెంట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ సిస్టమ్ కలిసిన హైబ్రిడ్ వాహనాలు వినియోగదారులకు మంచి ఆప్షన్ గా మారుతున్నాయి. తక్కువ ఇంధన ఖర్చు, మెరుగైన పనితీరు, తక్కువ పర్యావరణ నష్టం లాంటి కారణాలతో వీటి డిమాండ్ పెరుగుతోంది. గీలీ మాత్రమే కాకుండా ఇతర కంపెనీలు కూడా ఇలాంటి హైబ్రిడ్ టెక్నాలజీలపై దృష్టి పెడుతున్నాయి. భవిష్యత్తులో మరింత తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: ఇది కారు కాదు, చక్రాలపై నడిచే భవంతి.. ఎవరి కోసం తయారు చేశారో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×