E-Paper
Advertisement

ఢిల్లీలో కదంతొక్కిన ఇండియా కూటమి.. సుప్రీంకోర్టు వరకూ భారీ ర్యాలీ.. కిక్కిరిసిన రోడ్లు!

ఢిల్లీలో కదంతొక్కిన ఇండియా కూటమి.. సుప్రీంకోర్టు వరకూ భారీ ర్యాలీ.. కిక్కిరిసిన రోడ్లు!
Advertisement

Delhi Protest: ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దేశ రాజధాని దిల్లీలో విపక్ష ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కూటమి నేతలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు వరకూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘చలో ఢిల్లీ – ప్రజాస్వామ్య పరిరక్షణ మార్చ్’తో దేశ రాజధానిని హోరెత్తించారు.

నిరసనకారులతో కిక్కిరిసిన రోడ్లు..

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, మండి హౌస్ మధ్య ఉన్న ప్రధాన రహదారులన్నీ నిరసనకారులతో కిక్కిరిసిపోయాయి. బరాఖంబా రోడ్ జంక్షన్ వద్ద ప్రతిపక్ష నేతలందరూ ఏకమై సుప్రీంకోర్టు వైపు తమ పాదయాత్రను ప్రారంభించారు. ఈ నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు జాతీయ రాజధాని వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

స్వయంగా పిటిషన్ అందజేత

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయడంతో ఈ నిరసన మరింత తీవ్రరూపం దాల్చింది. అంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) కలిసి తమ అభ్యంతరాలను తెలపడంతో పాటు నేడు సుప్రీంకోర్టుకు అధికారికంగా పిటిషన్ సమర్పించనున్నట్లు విపక్షాలు స్పష్టం చేశాయి.

‘రాజ్యాంగ పరిరక్షణ కోసమే మా పోరాటం’

Advertisement

అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నాయకత్వం మారే వరకు, రాజ్యాంగం పరిరక్షించబడి ఎన్నికల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన అయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయని పేర్కొన్నారు.

Also Read: మెుబైల్ పాస్‌వర్డ్ లేదా పాటర్న్ మర్చిపోయారా? ఆందోళన వద్దు.. ఇంట్లోనే ఇలా అన్‌లాక్ చేయండి!

ఆరు మెట్రో స్టేషన్లు మూసివేత

ఇండీ కూటమి నేతల ఆందోళనల నేపథ్యంలో దిల్లీ మెట్రో కీలక ప్రకటన చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆరు కీలక మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేస్తున్నట్లు పేర్కొంది. నిరసనలు జరిగే మార్గంలో ఉన్న జన్ పథ్, మండి హౌస్, బారాఖంబా రోడ్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్లు క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

Also Read: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏడాదికి రూ. లక్ష వడ్డీ రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి?

Tags

Related News

గెలుపు కోసం స్కెచ్.. డ్రెస్ మార్చి మూడు రకాలుగా నామినేషన్ వేసిన మహిళ.. చివరకు ఏమైందంటే?

మగ పోలీసు పెళ్లిని అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్.. ఆఖరి నిమిషంలో రచ్చ రచ్చ.. కారణం ఏంటంటే?

కార్తీక దీపం వివాదం.. మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. సహించబోమంటూ ఘాటు వ్యాఖ్యలు!

ఎయిర్ బేస్ టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. ఏటీఎస్ మెరుపు ఆపరేషన్.. జైషే టెర్రరిస్ట్ అరెస్ట్!

పాత ప్రత్యర్థులే కొత్త మిత్రులు.. డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. రంగంలోకి ‘మిషన్ 360’ వ్యూహం!

అన్నదమ్ముల ఘాతుకం.. భార్యలను చంపి అడవిలో పాతిపెట్టి ఆ తర్వాత, జార్ఖండ్‌లో తీవ్ర కలకలం

తెలంగాణ ఐఏఎస్ హత్య కేసు.. మళ్లీ జైలుకు బిహార్ మాజీ ఎంపీ.. అసలేం జరిగిందంటే?

ముదిరిన సోషల్ మీడియా వార్.. మెటాకు కాంగ్రెస్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..!

Big Stories

Advertisement
×