Business Ideas: దేశంలో చిన్న వ్యాపారాలు చేసే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఉద్యోగం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని చాలామంది ఆశపడుతున్నారు. అయితే తగినంత మూలధనం (పెట్టుబడి) లేకపోవడం వల్లే చాలామంది వెనకడుగు వేస్తుంటారు. కానీ, కేవలం రూ. 50,000 పెట్టుబడితో కూడా చక్కటి లాభాలను అందించే అనేక వ్యాపారాలను ప్రారంభించవచ్చని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో రూ.50 వేల పెట్టుబడితో చేయగాల ట్రెండింగ్ వ్యాపారాలు ఏమున్నాయో ఈ కథనంలో చూద్దాం.
దేశంలో టీ, కాఫీ ప్రియుల సంఖ్య ఎప్పటికీ తగ్గదు. కాబట్టి ప్రజలకున్న ఈ అలవాటును వ్యాపారంగా మలుచుకోవచ్చు. కేవలం రూ. 50,000తో చిన్నగా ఒక స్టాల్ లేదా కాఫీ కార్నర్ ఏర్పాటు చేసుకుంటే రోజువారీ ఆదాయం చాలా బాగుంటుంది. కస్టమర్లను ఆకట్టుకునే రుచితో పాటు శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తే తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకోవచ్చు.
ప్రతిరోజూ అన్ని ఇళ్లలోనూ, దేవాలయాల్లోనూ పూజలు జరుగుతుంటాయి. ఈ సమయంలో ధూప్ స్టిక్స్ (అగర్బత్తీలు), దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఈ రంగంలో చిన్నపాటి యూనిట్‌ను ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. దీనికి పెద్దగా యంత్రాల అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయించవచ్చు.
చాలా ప్రాంతాల్లో ప్లాస్టిక్ సంచుల వాడకంపై నిషేధం ఉండటంతో కాగితపు సంచులకు (Paper Bags) డిమాండ్ అమాంతం పెరిగింది. కొద్దిపాటి శిక్షణ, తక్కువ ధరకే లభించే చిన్నపాటి యంత్రాల సహాయంతో ఈ వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించవచ్చు. పర్యావరణ హితమైన ఈ వస్తువులకు మంచి లాభాల మార్జిన్ కూడా లభిస్తుంది.
వంట చేయడంపై ఆసక్తి ఉంటే ఇంటి కిచెన్ నుంచే హోమ్ బేకరీ లేదా స్నాక్స్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మొదట చిన్న స్థాయిలోనే మొదలుపెట్టి, క్రమంగా కస్టమర్ల సర్కిల్‌ను పెంచుకోవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి ఉత్పత్తులను మరింత మందికి సులభంగా చేరవేయవచ్చు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వాడకం ఎప్పటికీ ఆగదు. ఫోన్లు ఉన్నచోట రిపేర్ పని కూడా ఎప్పుడూ అవసరమే. కొద్దిపాటి శిక్షణ తీసుకుంటే మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఈ రంగానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా చిన్న దుకాణంతో దీన్ని మొదలుపెట్టి చక్కటి రాబడి పొందవచ్చు.
Also Read: దేశ రాజధానిలో హైటెన్షన్.. సుప్రీంకోర్టుకు ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి!
ఈ రోజుల్లో చేతితో తయారు చేసిన వస్తువులు (Handmade Crafts), డిజైనర్ ఆభరణాలకు విపరీతమైన ఆదరణ ఉంటోంది. కాబట్టి మీలోని సృజనాత్మకతను ఉపయోగించి అందమైన వస్తువులు లేదా ఆఫ్రికన్/ట్రెండీ జ్యువెలరీ తయారు చేసి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయించవచ్చు. డిమాండ్ పెరిగిన కొద్దీ చిన్న బృందంతో ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి అద్భుతమైన అవకాశాలున్నాయి.
Also Read: ఢిల్లీలో కదంతొక్కిన ఇండియా కూటమి.. సుప్రీంకోర్టు వరకూ భారీ ర్యాలీ.. కిక్కిరిసిన రోడ్లు!