E-Paper
Advertisement

గడ్చిరోలి గడ్డపై ఆదివాసీ కళా వైభవ జాతర.. ఉత్సవానికి సర్వం సిద్ధం!

గడ్చిరోలి గడ్డపై ఆదివాసీ కళా వైభవ జాతర.. ఉత్సవానికి సర్వం సిద్ధం!
Advertisement

Birsa Kala: స్వేచ్చ బ్యూరో: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘భగవాన్ బిర్సా కళా సంగమం–2026’ మహా ఆదివాసీ సాంస్కృతిక ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. భగవాన్ బిర్సా ముండా జయంతి, జనజాతీయ గౌరవ్ దివస్‌ను పురస్కరించుకుని నవంబర్ 14, 15 తేదీల్లో గడ్చిరోలిలోని జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా గిరిజన కళాకారులు పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించనున్నారు.

ఆదివాసీ కళలు.. సంస్కృతికి పెద్దపీట

రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సంప్రదాయ గిరిజన కళలతో పాటు ఆధునిక డిజిటల్ కళా ప్రదర్శనలకు ప్రత్యేక స్థానం కల్పించారు. గిరిజనుల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, దేవతలు, పూజా సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. సంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, సంగీత ప్రదర్శనలు సందర్శకులను అలరించనున్నాయి. రాష్ట్రస్థాయి కళా పోటీల నిర్వహణతో గిరిజన కళాకారుల్లోని ప్రతిభను వెలికితీయడమే కాకుండా వారి వారసత్వ సంపదను భావితరాలకు పరిచయం చేయడం ఈ ఉత్సవ ప్రధాన ఉద్దేశం.

Advertisement

Also read: న్యూజిలాండ్ పైనే చేతులెత్తేశారు…రోహిత్, కోహ్లీల‌ను న‌మ్ముకుంటే 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ ముంచేస్తారు

తొలిరోజు ‘వన్ గర్జన’ ప్రత్యేక ఆకర్షణ

నవంబర్ 14న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదాయ, ఆధునిక గిరిజన కళల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గిరిజన సంస్కృతి, దేవతలు, పూజా విధానాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాణి దుర్గావతి, భగవాన్ బిర్సా ముండా జీవిత గాథల ఆధారంగా రూపొందించిన ‘వన్ గర్జన’ భారీ నాటక ప్రదర్శన జరగనుంది. ఈ ప్రదర్శన ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. నవంబర్ 15న జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రత్యేక బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొననుండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

సంప్రదాయాల సమ్మేళనం..

Advertisement

ఆదివాసీ సమాజానికి చెందిన ప్రముఖుల సేవలు, వారి సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా సభ నిర్వహించనున్నారు. ఆదివాసీ కళలు, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా నిర్వహిస్తున్న ఈ మహా ఉత్సవాన్ని విజయవంతం చేయాలని మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలను కుటుంబ సమేతంగా సందర్శించి గిరిజన కళాకారులను ప్రోత్సహించాలని కోరింది.

Also read: మగాడి గొప్పతనం ఏంటో చెప్పే ‘ఛప్రి’.. టీజర్ చూశారా?

Tags

Related News

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభం.. వేదికపై రాహుల్, రేవంత్ రెండు కీలక హామీలు!

ద్విచక్రవాహనం ఎక్కిన రాహుల్, రేవంత్.. గిగా వర్కర్లతో కలిసి భారీ ర్యాలీ.. బైక్ వెంట పరిగెత్తిన టీపీసీసీ చీఫ్!

కాంగ్రెస్‌ను రేవంతే ముంచేస్తారు.. 20 ఏళ్ల పాటు కోలుకోలేదు.. ఈటల రాజేందర్ జోస్యం!

నోవాటెల్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ పాలిటిక్స్.. సీఎం రేవంత్, మంత్రులతో రాహుల్ భేటి.. టిఫిన్ చేస్తూనే రాజకీయాలపై ఆరా!

దేశంలో ఫాసిస్ట్ పాలన.. కేసీఆర్‌ది మోసపూరిత చరిత్ర.. మహేష్ గౌడ్, కోమటిరెడ్డి ఫైర్!

‘అది భారత్ సమ్మిట్ కాదు.. యాంటీ-భారత్ సమ్మిట్’.. రాంచందర్ రావు హౌస్ అరెస్ట్‌పై బీజేపీ ఫైర్!

పాతబస్తీలో ఏనుగు బీభత్సం.. బ్యాండ్ శబ్దానికి బెదిరి పరుగులు!

Big Stories

Advertisement
×