E-Paper
Advertisement

అర్ధరాత్రిళ్లు ఏంటా పనులు.. శాలిని, రోహిత్‌లకు షాకిచ్చిన నాగ్, ఝాన్సీ కన్నీళ్లు!

అర్ధరాత్రిళ్లు ఏంటా పనులు.. శాలిని, రోహిత్‌లకు షాకిచ్చిన నాగ్, ఝాన్సీ కన్నీళ్లు!
Advertisement

Bigg Boss 10 Nagarjuna :వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ (Bigg Boss 10) ఆడియన్స్ ను ఏ విధంగా అలరిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా తెలుగులో 9 సీజన్లు ఒక ఎత్తైతే.. ఈ పదవ సీజన్ మరో ఎత్తు అన్నట్టుగానే నడుస్తోంది. ఊహించని ట్విస్టులు.. ఊహకందని ఆటలు.. ప్రేక్షకులలో ఎప్పటికప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. ఇకపోతే వారం మొత్తం ఒక ఎత్తైతే …వీకెండ్స్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ముందు ఐదు రోజులు కంటెస్టెంట్స్ మధ్య జరిగిన విషయాలన్నింటిని శని, ఆదివారాలలో హోస్ట్ నాగార్జున (Nagarjuna ) ఒక్కొక్కటిగా బయట పెడుతూ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ షోపై మరింత ఆసక్తి కలిగిస్తున్నారు.

వీకెండ్స్.. ఇచ్చి పడేసిన నాగార్జున..

అందులో భాగంగానే వీకెండ్స్ ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో కంటెస్టెంట్స్ తప్పొప్పులను బయట పెట్టడమే కాకుండా వారు చేసిన పనులను విమర్శిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో భాగంగానే ఎదురుగా గోల్డెన్, బ్లాక్ కలర్ కుండలను పెట్టి.. వాటిపై కొన్ని ఫోటోలను ఉంచారు. ఇక ఒక్కొక్క కుండ పగలు కొట్టేటప్పుడు వారి బిహేవియర్ పై హోస్ట్ నాగార్జున చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

అపూర్వ కాదు.. అర్ పూర్వ..

Advertisement

ఇక ప్రోమో స్టార్ట్ అవ్వగానే.. అపూర్వను కాస్త “అర్ పూర్వ” అని పిలుస్తూ.. ఎందుకలా పిలిచానో తెలుసా ? అంటూ ఆమెను ప్రశ్నించారు. గట్టిగా అరుస్తున్నానని అంటూ అపూర్వ సమాధానమివ్వగా.. ఇంత తెలిసిన దానివి ఆటలో ఎలా ఆడాలో తెలియదా అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు. బాల్ కి అర్హత ఉంది. ఆడడానికి నీకు అర్హత ఉందా అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు ఉంది కదా.. మాట్లాడగలను కదా అని.. నువ్వు అరిస్తే నిన్ను అపూర్వ కాదు అర్ పూర్వ అనే పిలుస్తారు అంటూ హెచ్చరించారు. అమన్ కి కూడా గట్టిగానే క్లాస్ పీకారు ఇక నెక్స్ట్ వర్షిని వంతు.. కెప్టెన్ వర్షిని.. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని నాగార్జున అడగగా.. మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అంటూ చెప్పింది. దీంతో నాగార్జున ఎవరికి అంటూ ఆమెను ప్రశ్నించారు.

శాలిని – రోహిత్ లకు నాగార్జున షాక్..

వర్షిని కెప్టెన్సీ గురించి మీ అభిప్రాయం ఏంటి? అని అపూర్వను అడగగా.. చాలా నిర్ణయాలు ముఖేష్ అనే వ్యక్తి తీసుకుంటున్నారు. అలాగే చాలా రోజులు డ్యూటీ స్కిప్ అయ్యాయి. అని అపూర్వ చెబుతుండగానే.. ఏ డిపార్ట్మెంట్లో వర్క్ సరిగ్గా లేదని నీకు అనిపించింది అని మళ్లీ అపూర్వను ప్రశ్నించారు నాగార్జున. అపూర్వ మాట్లాడుతూ.. బాత్రూమ్స్ అన్ని అన్ క్లీన్ గా ఉన్నాయి అని చెప్పింది. ఎవరు ఆ డ్యూటీ చూస్తున్నారు అని అడగ్గా.. వర్షిని.. శాలిని, రోహిత్ పేర్లు చెప్పింది. నాగార్జున మాట్లాడుతూ..” వాళ్లకు చాలా పనులు ఉంటాయి. అర్ధరాత్రి దాకా గుసగుసలు ఉంటాయి” అంటూ షాలిని, రోహిత్ లకు ఒకసారిగా షాక్ ఇచ్చారు నాగార్జున.

Advertisement

also read: లగ్జరీ కారు కొన్న ప్రేమలు హీరో.. ఖరీదు ఎంతంటే?

కన్నీళ్లు పెట్టుకున్న ఝాన్సీ..

ఇక ఝాన్సీని ప్రశ్నిస్తూ.. పల్లెటూర్ల నుంచి వచ్చిన వారి మనసులు చాలా స్వచ్ఛంగా ఉంటాయి కదా.. వాళ్లకు మోసం అంటే ఏంటో తెలియదు. కానీ నువ్వు ఎందుకు ఇలా చేశావ్ అని ప్రశ్నించగా.. ఝాన్సీ.. మీరు దేని గురించి చెబుతున్నారో అర్థం కావడం లేదు అంటూ అడిగింది. అంటే నువ్వు ఎన్ని మోసాలు చేశావు లెక్క లేదా అని నాగార్జున అడిగారు. అయితే ఆమె చేసిన పనిని వీడియో క్లిప్ రూపంలో చూపించారు. ఝాన్సీ అంటే పల్లె లాగా స్వచ్ఛం అనుకున్నాను.. కానీ నేను ఈ వీడియో చూసాకే తెలిసింది అంటూ నాగార్జున చెప్పగానే.. ఝాన్సీ కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తానికి అయితే ప్రోమో తోనే ఆసక్తి పెంచేసిన నిర్వాహకులు.. క్రియేట్ చేశారు.

Related News

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Big Stories

Advertisement
×