E-Paper
Advertisement

అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే ప్రీమియం OLED టీవీలు.. ఇంటినే థియేటర్‌గా మార్చేయండి!

అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే ప్రీమియం OLED టీవీలు.. ఇంటినే థియేటర్‌గా మార్చేయండి!
Advertisement

Amazon Great Indian Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో వివిధ ప్రముఖ బ్రాండ్లకు చెందిన OLED టీవీలపై భారీ తగ్గింపు లభిస్తోంది. 55 అంగుళాల నుంచి 77 అంగుళాల సైజుల్లో ఉన్న ఈ టీవీలు.. అద్భుతమైన స్క్రీనింగ్ అనుభవాన్ని అందించనున్నాయి. కాబట్టి ఆ ప్రముఖ కంపెనీల టీవీలు, వాటి ఫీచర్లు, డిస్కౌంట్లపై ఓ లుక్కేద్దాం.

శాంసంగ్ 77 అంగుళాల OLED 4K

పెద్ద హాల్, హోమ్ థియేటర్ సెటప్‌ కోరుకునేవారికి ఈ 77 అంగుళాల శాంసంగ్ టీవీ సరిగ్గా సరిపోతుంది. దీని అసలు ధర రూ. 4,97,800 కాగా అమెజాన్ సేల్‌లో ఇది రూ. 3,95,990 ధరకు లభిస్తోంది. దీనిలోని OLED ప్యానెల్ ద్వారా లభించే డీప్ బ్లాక్స్, 4K రిజల్యూషన్ అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తాయని శాంసంగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

సోనీ బ్రావియా 8 65 అంగుళాల OLED

Advertisement

సినిమాలు, స్ట్రీమింగ్, గేమింగ్ ప్రియుల కోసం సోనీ బ్రావియా 8 బెస్ట్ విజువల్స్ అనుభవాన్ని అందిస్తుంది. దీని అసలు ధర రూ. 4,29,900 కాగా సేల్‌లో దీనిని రూ. 2,25,000 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇది సోనీ ఎక్స్ఆర్ పిక్చర్ ప్రాసెసర్, డాల్బీ విజన్ సపోర్ట్, 120Hz ప్యానెల్‌ ను కలిగి ఉంది.

ఎల్జీ OLED evo C5 65 అంగుళాల టీవీ

సినిమాలు, గేమింగ్ రెండింటికీ సరిగ్గా సరిపోయే ఈ ఎల్జీ టీవీ అసలు ధర రూ. 2,87,590. ప్రస్తుతం రూ. 1,73,990 కే అందుబాటులో ఉంది. ఇందులో 4K OLED ప్యానెల్, ఆల్ఫా 9 AI ప్రాసెసర్ జెన్ 8, 144Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అంతేకాకుండా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది.

శాంసంగ్ 65 అంగుళాల OLED 4K టీవీ

Advertisement

పైన పేర్కొన్న శాంసంగ్ 77 అంగుళాల పెద్ద టీవీ కాకుండా కాస్త చిన్న సైజులో ప్రీమియం అనుభవాన్ని కోరుకునేవారికి ఈ 65 అంగుళాల మోడల్ సరిగ్గా సరిపోతుంది. దీని ధర రూ. 1,89,900 కాగా, రూ. 1,39,990కే అందుబాటులోకి వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, శాంసంగ్ NQ4 AI జెన్ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

Also Read: గంభీర్, శ్రేయాస్ అయ్య‌ర్ మ‌ధ్య విభేదాలు…న‌మ‌న్ ధీర్ వ‌ద్దేవద్దంటూ గొడ‌వ‌ !

హైయర్ C90E 55 అంగుళాలు OLED టీవీ

బెడ్‌రూమ్, చిన్నసైజు లివింగ్ రూమ్ కోసం ఈ హైయర్ C90E చక్కటి ఆప్షన్. దీని అసలు ధర రూ. 2,30,990 కాగా.. అమెజాన్‌లో దీనిని రూ. 1,34,990 కే పొందవచ్చు. ఇది డాల్బీ విజన్ IQ, HDR10+ సపోర్ట్‌తో పాటు 50W 2.1 ఛానెల్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

Also Read: 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు? ఎంతసేపు స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిది?

Tags

Related News

ఫోన్‌లో అనవసరమైన యాడ్స్ వస్తున్నాయా?ఈ 5 పద్ధతులతో చెక్ చేయండి!

వాషింగ్ మెషీన్లపై నమ్మలేని తగ్గింపు..కొనడానికి సూపర్ టైం

సౌండ్‌బార్‌లపై అదిరిపోయే ఆఫర్లు..60శాతానికి పైగా డిస్కౌంట్ !

రీస్టార్ట్ చేస్తే ఫోన్ స్పీడ్ పెరుగుతుందా? ఇది తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు!

వాషింగ్ మెషీన్లపై అమెజాన్ సంచలన ఆఫర్లు.. రూ.27 వేలకే బ్రాండెడ్ మోడల్!

కోడాక్ కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ విడుదల..రేట్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

ఫేస్‌బుక్ ఈమెయిల్ అడ్రస్ మార్చడం ఎలా? సింపుల్ స్టెప్స్ ఇవే!

Big Stories

Advertisement
×