E-Paper
Advertisement

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!
Advertisement

తమిళనాడు రాజకీయాల్లో రెండు రోజుల వ్యవధిలోనే విచిత్ర సంఘటనలు దర్శనమిచ్చాయి. ఈనెల 10న రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం విజయ్‌తో ప్రత్యేకంగా భేటీ అయి.. రాజకీయ అంశాలపై ఇద్దరు లోతుగా చర్చించుకున్నారు. ఆ మరుసటి రోజే ప్రధాని మోడీ పర్యటన జరిగింది. దీంతో అందరి దృష్టి తమిళనాడు రాజకీయాలపై పడింది.

రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విజయ్‌.. ఆయనతో గంటకుపై సుధీర్ఘ రాజకీయ చర్చల్లో పాల్గొన్న ఆయన.. మోడీ టూర్‌లో మాత్రం ముభావంగా ఉండటం చర్చకు తెర తీసింది. విజయ్‌ మంచి నటుడు. కానీ ఆయన నటించలేదు. మనసులో మోడీ మీద ఉన్న భావనే ఆయన ముఖంపై ప్రస్పుటమైంది. అంతేగానీ తెచ్చిపెట్టుకున్న నవ్వు ముఖం కూడా ఆయన ప్రదర్శించలేదు.

Advertisement

ఏదో ప్రధాని వచ్చాడు కాబట్టి.. ప్రొటోకాల్ ప్రకారం ఆయనను రిసీవ్‌ చేసుకోవడం, ప్రోగ్రాం అయిందనిపించాడు తప్ప..సంపూర్ణ మనసుతో మోడీతో ఆ టూర్‌లో పాల్గొనలేకపోయాడు విజయ్‌. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. విజయ్‌ నటించలేదు కానీ.. మోడీ మాత్రం నటనలో జీవించేశారంటూ సెటైర్లు కూడా గుప్పిస్తున్నారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

అక్టోబర్ 11, ఆదివారం నాడు చెన్నై మెట్రో ఫేజ్-2 (పూనమల్లి – పోరూర్ బైపాస్ మార్గం) ప్రారంభోత్సవంలో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. మెట్రో రైలు సేవలను ప్రారంభించే సమయంలో ప్రధాని మోదీ స్వయంగా సీఎం విజయ్ చేతిని పట్టుకుని, ఇద్దరూ కలిసి ఉమ్మడిగా ప్రారంభోత్సవ బటన్‌ను నొక్కారు. మెట్రో ప్రారంభించిన అనంతరం మోదీ, విజయ్ ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మెట్రోలో ప్రయాణించారు. అయితే ఆ సమయంలో విజయ్‌ హావభావాలు విచిత్రంగా ఉండి అందరి దృష్టినీ ఆకర్షించాయి.

Advertisement

అసలు తన పక్కన కూర్చున్నది ప్రధాని అని మరిచినట్టే.. పక్క చూపులు చూసుకుంటూ కూర్చున్నాడే తప్ప ఏదో ఒకటి మాట్లాడాలె కాబట్టి.. మాట్లాడేద్దాం అని కూడా అనుకోలేదు. అసలు తనకు ఆ మనిషి తెలియనే తెలియదు. ఎవరో అపరిచితుడు.. అన్నట్టుగా ముఖం పెట్టాడు విజయ్‌. ఈ స్థితిని గమనించి మోడీ షాక్‌ తిన్నట్టున్నాడు. వెంటనే తమాయించుకున్నాడు. అక్కడ ఏర్పడిన గంభీర వాతావరణాన్ని తేలిక చేసేందుకు తనే మాట్లాడటం మొదలుపెట్టాడు.

మెట్రో ప్రాజెక్టు వివరాలను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నట్టుగా నటించేశాడు. అంతే కాదు మధ్య మధ్యలో నవ్వులు పూయించేందుకు, వారిని నవ్వించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కానీ విజయ్‌ మాత్రం అది తనకు సంబంధం లేని అంశంగా, మోడీ చెప్పే ఏ విషయానికి కూడా కనీస స్పందన లేకుండా అటూ ఇటూ దిక్కులు చూస్తూ మధ్యలో కూర్చున్నందుకు మధ్య మధ్యలో ఇబ్బందిగా ఫీలయినట్టుగా కదులుతూ ఉండిపోయాడు.

ఈ వీడియోను చాలా మంది వైరల్ చేశారు. ఏం నటన మోడీ సాబ్‌ అంటూ సెటైర్లు విసరుతున్నారు. నటనలో బెస్ట్‌ హీరో సైలెంట్‌గా ఉంటే. మోడీ మాత్రం నటించడంలో జీవించేశాడనే విధంగా కామెంట్లు పెడుతున్నారు. మోడీ టైం అలా ఉంది మరి. ఏం చేస్తాడు పాపం..! అని సానుభూతి కూడా చూపుతున్నారు కొందరు.

Tags

Related News

సిరిసిల్ల సభ చేదు అనుభవం తనకూ కలగకుండా… ముందే అప్రమత్తమైన వైనం… సిద్దిపేట సభతో బల ప్రదర్శన..!

విశాఖలో ఎన్నికల సందడి.. నోటిఫికేషన్‌కు ముందే అధికారుల స్పీడ్!

తెలంగాణలో కాంగ్రెస్ హవా.. బీఆర్ఎస్ మైండ్ గేమ్స్‌కు రివర్స్ కౌంటర్!

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఐదుగురు ఎమ్మెల్యేల తీరు.. వీరితో కష్టమేనా..?

నరసరావుపేట లో రూల్స్ బ్రేక్ చేసిన ఎమ్మెల్యే చదలవాడ.. ఏం చేసారంటే?

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సంచలనం.. మళ్లీ ఎన్టీఆర్ వ్యూహనికి శ్రీకారం?

వరి ఉరి కాదు.. వరమై! పొరుగు రాష్ట్రాల్లో తగ్గిన వరిసాగు విస్తీర్ణం.. తెలంగాణలో 56 లక్షల ఎకరాల్లో సాగు.. ఎగబడి మన వడ్లు కొంటున్న పొరుగు రాష్ట్రం వ్యాపారులు..!

Big Stories

Advertisement
×