E-Paper
Advertisement

వేడి నీళ్లలో ముంచినా చెక్కుచెదరదు.. హానర్ నుంచి అసాధారణ ఫీచర్లతో సరికొత్త ఫోన్!

వేడి నీళ్లలో ముంచినా చెక్కుచెదరదు.. హానర్ నుంచి అసాధారణ ఫీచర్లతో సరికొత్త ఫోన్!
Advertisement

Honor X9e Pro: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడంతో ఇబ్బంది పడుతున్న యూజర్లను దృష్టిలో పెట్టుకుని, కంపెనీలు భారీ బ్యాటరీ కెపాసిటీతో కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. ఇదే క్రమంలో చైనా టెక్ దిగ్గజం హానర్ మరో ఆసక్తికరమైన ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 24న మలేషియాలో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేయనుంది.

ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు బయటకు రావడంతో టెక్ ప్రియుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సాధారణ ఫీచర్లతో సరిపెట్టకుండా, భారీ బ్యాటరీతో పాటు ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను ఇందులో అందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటరీ లైఫ్‌కు ప్రాధాన్యత ఇచ్చే యూజర్లను దృష్టిలో పెట్టుకుని హానర్ ఈ ఫోన్‌ను రూపొందించినట్లు సమాచారం. దీంతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎలాంటి ప్రత్యేకతను చూపించబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రగ్డ్ డిజైన్, ఆకట్టుకునే రంగులు:

Advertisement

ఈ Honor X9e Pro లుక్ పరంగానే కాకుండా గట్టితనం విషయంలోనూ చాలా ముందుంది. డాన్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లాక్, రెడ్డిష్ బ్రౌన్, రాయల్ పర్పుల్ అనే 4 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది రానుంది. కేవలం చూడటానికి బాగుండటమే కాకుండా.. కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు. హాట్ వాటర్‌లో ముంచినా చెక్కుచెదరని విధంగా IP68, IP69, IP69K రేటింగ్స్‌తో పాటు అదనపు డ్రాప్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుండటంతో ఇది ఒక రఫ్‌ అండ్ టఫ్ ఫోన్‌గా నిలవనుంది.

Also Read: 18 నెలల వారంటీతో ‘యూగ్రీన్ 67W ట్రావెల్ ఛార్జర్’.. ల్యాప్‌టాప్, ఫోన్, బడ్స్ అన్నీ ఒకేసారి ఫుల్ చార్జ్!

అసలు హైలైట్ బ్యాటరీనే:

Advertisement

ఈ ఫోన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా చెప్పుకోవాల్సింది దాని పవర్‌ఫుల్ బ్యాటరీ గురించే. ఇందులో ఏకంగా 11000mAh కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఇస్తున్నారు. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో అంత పెద్ద బ్యాటరీ కూడా చాలా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అంతేకాకుండా.. ఎమర్జెన్సీ సమయంలో ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా ఇందులో చేర్చడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.

10,000 నిట్స్ బ్రైట్‌నెస్:

బయట ఎండలో ఫోన్ వాడేటప్పుడు స్క్రీన్ కనిపించక ఇబ్బంది పడే రోజులు పోయాయి. ఈ ఫోన్ డిస్‌ప్లే ఏకంగా 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుందని చెబుతున్నారు. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో మెయిన్ లెన్స్ ఏకంగా 108 మెగాపిక్సెల్‌తో వస్తోంది. దీనిద్వారా తీసే ఫోటోలు చాలా స్పష్టంగా, క్వాలిటీగా వస్తాయని అంచనా వేయవచ్చు.

ధర ఎంతంటే?

ప్రస్తుతానికైతే ఈ ఫోన్ మలేషియా మార్కెట్ కోసం వస్తోంది. మన దేశంలోకి ఎప్పుడొస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రాసెసర్, మెమరీ వేరియంట్లు, ఖచ్చితమైన ధర వివరాలు సెప్టెంబర్ 24న జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్లోనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇదంతా చూస్తుంటే.. సామాన్య యూజర్ల నుంచి హెవీ యూజర్ల వరకు అందరి అవసరాలను తీర్చేలా ఈ హానర్ ఫోన్ మార్కెట్‌ను ఒక ఊపు ఊపడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Tags

Related News

భూమికి మరో చంద్రుడు.. రహస్యంగా చక్కర్లు కొడుతూ, ఎట్టకేలకు దొరికేశాడు!

రూ.581కే..పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్!డోంట్ మిస్

రూ.401కే 5W పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్..బేస్ అదిరిపోతుంది

ఓట్స్‌తో హెల్దీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్..5 నిమిషాల్లో రెడీ అవుతుంది

యూట్యూబ్ యాప్‌లో భారీ మార్పులు.. సబ్‌స్క్రిప్షన్స్ ట్యాబ్ మాయం.. కొత్తగా ఏమొచ్చాయంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ బ్లూటూత్ హెడ్‌సెట్..గోబోల్ట్ టెనెట్ లాంచ్!

ఏసీ, టీవీ కొనేటప్పుడు సేల్స్‌మెన్ చెప్పే ఈ మాటలు అస్సలు నమ్మకండి.. లేదంటే భారీగా నష్టపోతారు!

ఏఐ వల్ల తప్పు జరిగితే టెలికాం కంపెనీలదే బాధ్యత.. యూజర్ల భద్రతా దృష్ట్యా TRAI కొత్త ప్రతిపాదనలు!

Big Stories

Advertisement
×