E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్‌ మెయిల్ ఫీచర్..యాక్టివేట్ చేసుకోండిలా

ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్‌ మెయిల్ ఫీచర్..యాక్టివేట్ చేసుకోండిలా
Advertisement

Android visual voicemail: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆండ్రాయిడ్ యూజర్లు ఎప్పుడూ కొత్త టెక్నాలజీని, సరి కొత్త ఫీచర్లను కోరుకుంటూ ఉంటారు. అయితే.. ఐఫోన్లలో కనిపించే కొన్ని ప్రీమియం ఫీచర్లు ఆండ్రాయిడ్‌లో లేవనే చిన్న లోటు చాలా మంది టెక్ లవర్స్‌లో.. ఉంటుంది. అలాంటి వాటిలో విజువల్ వాయిస్‌ మెయిల్ ఫీచర్.. అత్యంత ముఖ్యమైంది. ఎవరికైనా కాల్ చేసినప్పుడు వారు బిజీగా ఉంటే.. లేదా ఫోన్ లిఫ్ట్ చేయక పోతే, అవతలి వారు ఒక చిన్న వాయిస్ నోట్ వదిలి వెళ్తారు. ఐఫోన్‌లో.. ఈ వాయిస్ మెసేజ్ ఆటో మేటిక్‌గా టెక్స్ట్ రూపంలోకి మారి స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. దీన్ని బట్టి కాల్ హిస్టరీ ఓపెన్ చేయకుండానే ఎదుటి వ్యక్తి ఏం చెప్పాలనుకున్నారో ఇట్టే చదివేయవచ్చు. ప్రస్తుత గూగుల్ అప్‌డేట్స్ , ఎస్ఓ ఇండస్ట్రీ ట్రెండ్స్ ప్రకారం.. యూజర్ ఎక్స్‌పీరియన్స్, స్మార్ట్ ఆటో మేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కూడా ఐఫోన్ లాంటి వాయిస్‌మెయిల్ ఫీల్ పొందడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది.

గూగుల్ వాయిస్ :

ఆండ్రాయిడ్ డివైజ్‌లో పక్కా ఐఫోన్ వాయిస్‌ మెయిల్ ఫీచర్ పొందడానికి గూగుల్ వాయిస్ మెయిల్ బెస్ట్ మార్గంగా నిలుస్తోంది. ఇది గూగుల్ వారి అఫీషియల్ అప్లికేషన్. దీన్ని సెట్ చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా మీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ వాయిస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ పర్సనల్ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయి, ఒక కొత్త వర్చువల్ నంబర్‌ను క్రియేట్ చేసుకొని దాన్ని మీ మెయిన్ మొబైల్ నంబర్‌కు లింక్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్‌లోని కాల్ సెట్టింగ్స్‌లోకి.. వెళ్లి ‘కండిషనల్ కాల్ ఫార్వర్డింగ్’ ఆప్షన్‌ను ఆన్ చేయాలి. దీని వల్ల మీకు వచ్చే మిస్డ్ కాల్స్ లేదా లిఫ్ట్ చేయని కాల్స్ అన్నీ.. ఆటోమేటిక్‌గా గూగుల్ వాయిస్‌కి ఫార్వర్డ్ అవుతాయి. అక్కడ వాయిస్‌మెయిల్ రికార్డ్ అవ్వడమే కాకుండా, దానికి సంబంధించిన టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్ట్ కూడా మీ ఫోన్‌కు నోటిఫికేషన్ రూపంలో.. వస్తుంది. ఇది అచ్చం ఐఫోన్ విజువల్ వాయిస్‌ మెయిల్ లాగే అద్భుతంగా పని చేస్తుంది.

గూగుల్ ఫోన్ యాప్ , లైవ్ వాయిస్‌మెయిల్:

Advertisement

మీరు గూగుల్ పిక్సెల్ లేదా స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే.. నేరుగా డీలర్ లేదా గూగుల్ ఫోన్ యాప్ సెట్టింగ్స్‌లో.. ‘లైవ్ వాయిస్‌మెయిల్’ అనే లేటెస్ట్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీన్ని ఆన్ చేయడం ద్వారా ఎవరైనా వాయిస్‌మెయిల్ వదిలితే రియల్ టైమ్‌లో మీ స్క్రీన్ మీదే టెక్స్ట్ రూపంలో.. డిస్‌ ప్లే అవుతుంది. ఒకవేళ మీ మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ విజువల్ వాయిస్‌ మెయిల్‌ను సపోర్ట్ చేస్తే.. ప్లే స్టోర్ నుంచి వారి అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని కూడా ఈ ఫీచర్‌ను డైరెక్ట్‌గా ఆన్ చేసుకోవచ్చు.

Also Read: తక్కువ ధరలో మైండ్ బ్లోయింగ్ క్వాలిటీ..కొంటే ఇలాంటి టీవీ కొనాలి !

Advertisement

ఈ అద్భుతమైన ఫీచర్లన్నీ వాడుకోవడానికి గూగుల్ లేదా ఆండ్రాయిడ్ సంస్థ.. ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయడం లేదు. గూగుల్ వాయిస్ , ఆండ్రాయిడ్ బిల్ట్-ఇన్ సేవలు పూర్తిగా ఫ్రీ. అయితే.. కాల్ ఫార్వర్డింగ్ , వాయిస్‌ మెయిల్ రిట్రీవల్ సమయంలో.. మీ టెలికాం ఆపరేటర్ ప్లాన్‌ను బట్టి లోకల్ కాల్ చార్జీలు వర్తించే అవకాశం ఉంది. ప్రస్తుత రోజుల్లో.. వస్తున్న అన్ని అన్‌ లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్లలో.. ఇవి ఆల్రెడీ ఫ్రీగానే కవర్ అవుతున్నాయి కాబట్టి మీరు అదనంగా రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

ట్రెండింగ్‌లో ఉన్న ఈ స్మార్ట్ ఫీచర్‌ను ఇప్పుడే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో.. సెట్ చేసుకొని, ఐఫోన్ యూజర్లకు దీటుగా మీ స్మార్ట్‌ ఫోన్ అనుభవాన్ని మరింత ట్రెండీగా మార్చుకోండి!

Related News

ఫిలిప్స్ పార్టీ స్పీకర్ లాంచ్..ఇక నుంచి ఇంట్లోనే డీజే మజా!

అలర్జీలు,దుమ్ముకు చెక్ పెట్టే..హానివెల్ ఎయిర్ ప్యూరిఫైయర్

రాళ్లలో ఇయర్‌బడ్ మిస్.. AI చేసిన మ్యాజిక్ చూస్తే అవాక్కే.. ఇది కదా చాట్‌జీపీటీ పవర్ అంటే!

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పనిచేయకపోతే.. మొదటి 24 గంటల్లో ఏం జరుగుతుంది?

115 ఇంచుల బిగ్ స్క్రీన్..సినిమా థియేటర్‌ను తలపించే ఎల్జీ టీవీ లాంచ్

బుర్రలోని ఆలోచనలను టెక్స్ట్‌గా మార్చే విచిత్ర గ్యాడ్జెట్.. జొమాటో సీఈఓ కొత్త ప్రయోగం ఫలిస్తుందా?

రూ.550కే మౌస్, రూ.29 వేలకే ల్యాప్‌టాప్.. లెనోవో సేల్‌లో పిచ్చెక్కిస్తున్న ఆఫర్లు!

స్పీకర్ నుంచి స్మార్ట్‌వాచ్ వరకు అన్నీ ఆఫర్లో.. రూ.3,000 లోపు బెస్ట్ దీపావళి గిఫ్ట్స్ మీ కోసం!

Big Stories

Advertisement
×