Android Passkeys: పాస్‌వర్డ్‌లకు బదులుగా పాస్‌కీలు ప్రస్తుతం వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. గుర్తుంచుకోవాల్సిన పిన్‌లు, కోడ్‌లు లేకుండానే ఇవి సురక్షితంగా లాగిన్ అయ్యే అవకాశం కల్పిస్తాయి. అయితే ఇప్పటివరకు ఒక డివైస్ లేదా పాస్‌వర్డ్ మేనేజర్ నుంచి మరోదానికి పాస్‌కీలను మార్చడం అంత సులభంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు గూగుల్ తెచ్చిన ఈ కీలక అప్‌డేట్ వలన పాక్‌కీలను ఇతర డివైజస్‌లోకి చాలా సులభంగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
ఆండ్రాయిడ్‌లో గూగుల్ తాజాగా తీసుకొచ్చిన మార్పుతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఇకపై ఒక పాస్‌వర్డ్ మేనేజర్‌లో ఉన్న పాస్‌వర్డ్‌లతో పాటు పాస్‌కీలను కూడా మరో మేనేజర్‌కు సురక్షితంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అంటే 1Password నుంచి Bitwardenకు మారాలనుకుంటే పాస్‌కీలను మళ్లీ ఒక్కొక్కటిగా సృష్టించాల్సిన అవసరం ఉండదు.
Also Read: Moto Buds 2 Fusion వచ్చేస్తోంది.. 6 మైక్రోఫోన్లు, 53 గంటల బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!
మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న యాప్‌లోకి వెళ్లి Import or Copy Passwords ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ మీ డివైస్‌లో ఉన్న పాస్‌వర్డ్ మేనేజర్లను గుర్తించి, సురక్షితంగా డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవసరమైన ప్రక్రియను చూపిస్తుంది.
ప్రస్తుతం 1Password, Bitwarden, Google Password Manager, Dashlane వంటి ప్రముఖ పాస్‌వర్డ్ మేనేజర్లతో ఈ ఫీచర్ పనిచేస్తోంది. దీంతో వినియోగదారులు తమ అవసరానికి నచ్చిన మేనేజర్‌ను సులభంగా ఎంచుకోవచ్చు.
ఒకే వ్యక్తి ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి పలు డివైస్‌లు ఉపయోగిస్తున్నప్పుడు పాస్‌కీలను అన్ని చోట్ల అందుబాటులో ఉంచడం అవసరం. కొత్త ట్రాన్స్‌ఫర్ ఫీచర్ వల్ల పాస్‌కీలను ఒకే మేనేజర్‌లో భద్రంగా ఉంచుకుని, అవసరమైన డివైస్‌లో సులభంగా ఉపయోగించుకోవచ్చు.
Also Read: ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!