E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ ఫోన్‌లో కొత్తగా Android Pulse ఎందుకు వచ్చింది? గూగుల్ ఏం చెబుతోంది?

ఆండ్రాయిడ్ ఫోన్‌లో కొత్తగా Android Pulse ఎందుకు వచ్చింది? గూగుల్ ఏం చెబుతోంది?
Advertisement

Android Pulse: మీరు వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయకుండానే Android Pulse అనే కొత్త సర్వీస్ కనిపించిందా? ఒక్కసారిగా కొత్త యాప్ కనిపించడంతో చాలామందికి అనుమానం రావడం సహజమే. అయితే ఇది మాల్వేర్ లేదా అనుమానాస్పద యాప్ కాదు. గూగుల్ ఇప్పటికే ఆండ్రాయిడ్‌లో ఉపయోగిస్తున్న ఒక సిస్టమ్ సర్వీస్‌ను ఇప్పుడు సెట్టింగ్స్‌లో కనిపించేలా చేసింది.

ఎందుకు కనిపిస్తుంది?

గూగుల్ ప్రకారం పల్స్ కొత్తగా ఇన్‌స్టాల్ చేసిన యాప్ కాదు. ఈ సిస్టమ్ సర్వీస్ మార్చి నుంచే ఆండ్రాయిడ్‌లో ఉండే అవకాశం ఉంది. తాజాగా జరిగిన అప్‌డేట్ తర్వాత ఇది ఫోన్ సెట్టింగ్స్‌లో వినియోగదారులకు కనిపించడం మొదలైంది. అందుకే యూజర్లు దీన్ని ఇప్పుడే కొత్తగా వచ్చిన యాప్‌గా గమనిస్తున్నారు.

Pulse ఎక్కడ కనిపిస్తుంది?

Advertisement

పిక్సెల్ ఫోన్లలో Settings > Google services > All services > Privacy & security > System services విభాగంలో ఆండ్రాయిడ్ పల్స్ కనిపిస్తుంది. సాధారణ యాప్‌లా యాప్ డ్రాయర్‌లో కనిపించదు. గూగుల్ సిస్టమ్ సర్వీసులను విడిగా అప్‌డేట్ చేయగలగడంతో ఇలాంటి మార్పులు ఫోన్‌లో కనిపించవచ్చు.

Also Read: పనికిరాదనుకున్న పాత ఫోన్‌తో కూడా డబ్బు.. అమ్మే ముందు ఈ విషయాలు తెలిసుండాలి!

ఇది ఏం చేస్తుంది?

Advertisement

ఆండ్రాయిడ్ పనితీరును మెరుగ్గా నిర్వహించడంలో Pulse సహాయపడుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటరీ వినియోగం, మెమరీ, CPU వంటి రిసోర్స్‌ల వినియోగాన్ని గమనించడం ద్వారా ఎక్కువ వనరులు ఉపయోగిస్తున్న యాప్‌లను గుర్తించడంలో ఇది ఉపయోగపడవచ్చు.

పల్స్ సేఫ్‌నా?

ప్రస్తుతం Pulse విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్లే స్టోర్ వివరాల ప్రకారం ఇది యాప్ సమాచారం, పనితీరు సంబంధిత డేటాను సేకరించవచ్చు. కానీ థర్డ్‌పార్టీలతో షేర్ చేయదని గూగుల్ పేర్కొంది. అయితే సిస్టమ్ సర్వీసులను డిసేబుల్ చేయడం వల్ల కొన్ని ఆండ్రాయిడ్ ఫీచర్లు సరిగ్గా పనిచేయకపోవచ్చు.

పల్స్‌ని తొలగించాలా?

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ పల్స్‌ను తొలగించడం లేదా డిసేబుల్ చేయడం అవసరం లేదు. ఇది ఆండ్రాయిడ్ నిర్వహణలో భాగంగా పనిచేసే సిస్టమ్ సర్వీస్. ఫోన్‌లో భద్రతపై అనుమానం ఉంటే పల్స్ కంటే గూగుల్ ప్లే ప్రొటక్ట్‌ను చెక్ చేయడం మంచిది. మరింత రక్షణ కావాలనుకునేవారు ఆండ్రాయిడ్‌లోని Advanced Protection ఫీచర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

Also Read: మెటా సంచలన నిర్ణయం.. పిల్లలు Facebook, Instagram వాడాలంటే ఇక ఇవి తప్పనిసరి!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×