E-Paper
Advertisement

వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో 30న ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రోడ్డులో వెళ్లేవారు జాగ్రత్త సుమా!

వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో 30న ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రోడ్డులో వెళ్లేవారు జాగ్రత్త సుమా!
Advertisement

Hyderabad City: హైదరాబాద్ సిటీలో ఆదివారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హైదరాబాద్ సిటీ నుంచి సైబరాబాద్‌కి వెళ్లే పలు మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. మారథాన్ నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లించారు అధికారులు. ఆయా దారిలో వెళ్లే వాహనదారులకు అలర్ట్. ఒకవేళ చెక్ చేసుకోకుంటే ఇబ్బందులు తప్పవు.

 

ఆగష్టు 30న ఆదివారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Advertisement

ఎంఎండీసీ 14వ మారథాన్ సందర్భంగా ఆగస్టు 30 అనగా ఆదివారం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా సైబరాబాద్‌కు వెళ్లే పలు మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుంది. ఆదివారం ఉదయం 5 గంటల నుండి 11.30 గంటల మధ్య రెండు రకాల మారథాన్ లు నిర్వహించనున్నారు.

ఒకటి ఫుల్ మారథాన్ దాదాపు 42 కి.మీలు కాగా, హాఫ్ మారథాన్ సుమారు 21 కి.మీ ఉండనుంది. 10 కి.మీ కేటగిరీలలో మరొక మారథాన్ ఉండనుంది. ఈ క్రమంలో ఫుల్, హాఫ్ మారథాన్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుండి మొదలుకానున్నాయి. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్ దగ్గర 10 కిలోమీటర్ల మారథాన్ ప్రారంభం కానుంది. మారథాన్ జరిగే మూడు రూట్లు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం దగ్గర కలవున్నాయి.

Advertisement

 

42 కిలోమీటర్ల మారథాన్

పీపుల్స్ ప్లాజా నుండి ప్రారంభంకానుంది. జూబ్లీ హిల్స్, రోడ్ నెం. 45 మీదుగా కేబుల్ బ్రిడ్జ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ, మై హోమ్ భూజ, ఐకియా, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఐఐఐటి జంక్షన్ మీదుగా ప్రయాణించి హైదరాబాద్ విశ్వవిద్యాలయ, గచ్చిబౌలి స్టేడియంలో ముగియనుంది.

 

21.097 కిలోమీటర్ల హాఫ్ మారథాన్

పీపుల్స్ ప్లాజా నుండి జూబ్లీ‌హిల్స్, రోడ్ నెం. 45, కేబుల్ బ్రిడ్జ్, ఐటిసి కోహినూర్, నాలెడ్జ్ సిటీ, మై హోమ్ భూజ, ఐకియా, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరా నగర్, ఐఐఐటి జంక్షన్ మీదుగా గచ్చిబౌలి స్టేడియంలో ముగియనుంది.

 

10 కిలోమీటర్ల పరుగు

హైటెక్స్ వద్ద ప్రారంభమై ఎన్‌ఏసీ ప్రధాన గేటు, చార్మినార్ జంక్షన్, సీఐఐ జంక్షన్, గతి, రెయిన్‌బో హాస్పిటల్, టెక్ మహీంద్రా గేట్, డెల్ జంక్షన్, హెచ్‌ఎస్‌బీసీ ఎగ్జిట్ జంక్షన్, లెమన్ ట్రీ జంక్షన్, ఐకియా అండర్‌పాస్, ఐఓసీఎల్, ట్రాన్స్‌కో, బయోడైవర్సిటీ జంక్షన్, టెలికాం నగర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణించి స్టేడియం వద్ద ముగుస్తుంది.

భారీ వాహనాలకు నిషేధం, క్యాబ్‌లకు ఆంక్షలు ఉండనున్నాయి. మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, కొల్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఖ్యంగా ఈవెంట్ జరిగే మార్గాలలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య ట్రక్కులు, లారీలు, డీసీఎంలు, రెడీ-మిక్స్ కాంక్రీట్ క్యారియర్లు, వాటర్ ట్యాంకర్లతోపాటు భారీ వాహనాలను అనుమతి నిషేధం. ఈ సమయంలో నిషేధిత ప్రాంతాల్లో పికప్‌లు, డ్రాప్-ఆఫ్‌లను నివారించాలని క్యాబ్-ఆటో అగ్రిగేటర్ కంపెనీలను సూచించారు.

ALSO READ: 60 ఏళ్ల వివాదానికి చెక్.. పైగా భూములపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్!

షేక్‌పేట్ ఫ్లైఓవర్ నుండి లింగంపల్లి వైపు ట్రాఫిక్‌ను.. ఖాజాగూడ జంక్షన్, నానక్‌రామ్‌ గూడ, గోపన్‌పల్లి మీదుగా మళ్లించనున్నారు. లింగంపల్లి నుండి మెహదీపట్నం వచ్చే వాహనాలను మసీద్‌బండ, టి-జంక్షన్, బొటానికల్ గార్డెన్, అంజయ్య నగర్, ఔటర్ రింగ్ రోడ్ ఖాజాగూడ జంక్షన్‌కు వెళ్లనున్నాయి. కొండాపూర్, కొత్తగూడ, సైబర్ టవర్స్ వైపు ట్రాఫిక్‌ను అంజయ్యనగర్, రోలింగ్ హిల్స్, దుర్గం చెరువు మీదుగా మళ్లించనున్నారు.

Related News

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ భహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

Big Stories

Advertisement
×