E-Paper
Advertisement

రెంటెడ్ బాయ్ ఫ్రెండ్ పై కామాక్షి హాట్ కామెంట్స్!

రెంటెడ్ బాయ్ ఫ్రెండ్ పై కామాక్షి హాట్ కామెంట్స్!
Advertisement

Kissik Talks: ఒకప్పటితో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో ప్రేమ అనే పదానికి విలువ లేకుండాపోతోంది అంటూ కొన్ని జంటలను చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా నచ్చిన వారితో రిలేషన్షిప్ మైంటైన్ చేయడం, డేటింగ్ చేయడం, నచ్చకపోతే బ్రేకప్ చెప్పేసి ఇంకొకరి తోడు వెతుక్కోవడం.. ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే సొసైటీలో ఒక కొత్త ట్రెండు అందుబాటులోకి వచ్చింది అదే ‘రెంటెడ్ బాయ్ ఫ్రెండ్’. డబ్బులు చెల్లిస్తే నచ్చినంత కాలం బాయ్ ఫ్రెండ్ గా తోడుగా నిలుస్తారట.. ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలు ప్రత్యేకించి ఈ రెంటెడ్ బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ విధానంపై ప్రముఖ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) తన అభిప్రాయాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.

రెంటెడ్ బాయ్ ఫ్రెండ్ పై కామాక్షి ఏమన్నారంటే?

‘ప్రియురాలు’ సినిమాతో తొలిసారి వెండితెరకు పరిచయమైన కామాక్షి.. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన కామాక్షి.. వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తొలిసారి లీడ్ రోల్ పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అగధ. ఎంఎస్ రాజు దర్శకత్వంలో సూపర్ నేచురల్ అంశాలతో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కామాక్షి బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే రెంటెడ్ బాయ్ ఫ్రెండ్ పై తన అభిప్రాయాన్ని పంచుకుంది.

కరువులో పడ్డారు – కామాక్షి

Advertisement

హైదరాబాద్లో కావచ్చు.. ఇంకొన్ని ఏరియాలలో ఒక ట్రెండ్ నడుస్తోంది. రెంటెడ్ బాయ్ ఫ్రెండ్.. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అని అడగగా.. “కరువాసిపోయారు అంటారు కదా.. ఈమధ్య కాలంలో టచ్ కి దూరమవుతున్నారు. మనందరికీ కావాల్సింది అదే కదా. అయితే కచ్చితంగా మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. అసలు మనకు కావాల్సింది ఏంటి అని అర్థం చేసుకుంటే.. ఇబ్బంది ఉండదు. అలా మనకు మనం అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఇవన్నీ అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇకపోతే కామాక్షి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రెంటెడ్ బాయ్ ఫ్రెండ్ టచ్ కోసం మాత్రమే కాదు ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం కోసం కూడా అంటూ నెటిజన్స్ పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

also read: నా బెడ్ రూమ్ గురించి పగటి కలలు కనొద్దు.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్!

సమాజంలో మార్పు రావాల్సిందేనా?

Advertisement

కొత్త కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లిచూపులు కాదు కదా పెళ్లి పీటల మీద కూడా కట్టుకునే వారి ముఖం చూసేవారు కాదు. అయితే ఈ మధ్యకాలంలో అంతా మారిపోయింది. నచ్చితేనే పెళ్లి ఓకే చేస్తున్నారు.. అంతెందుకు మరీ ముఖ్యంగా పెళ్లికి ముందే రిలేషన్ మెయింటైన్ చేస్తూ.. ఒకే ఇంట్లో ఉంటూ.. పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ పెళ్లికి ముందే జరిగిపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే పెళ్లి చేసుకుంటారా అంటే నచ్చితే ముందుకు వెళ్తారు.. నచ్చకపోతే అక్కడితో బ్రేకప్.. ఏది ఏమైనా ఇలాంటి తీరు సమాజంలో ఎక్కువైపోయిందని.. ఇందులో మార్పు రావాలి అని అలా వస్తేనే సమాజం బాగుపడుతుంది అంటూ మరి కొంతమంది నెటిజన్స్ తమ అభిప్రాయాలుగా సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు.

Related News

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

Big Stories

Advertisement
×