E-Paper
Advertisement

12GB ర్యామ్‌తో రాబోతున్న iPhone 18? యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇక వేరే లెవెల్!

12GB ర్యామ్‌తో రాబోతున్న iPhone 18? యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇక వేరే లెవెల్!
Advertisement

Apple iPhone 18: యాపిల్ ప్రియులకు భారీ ఊరటనిచ్చే గుడ్ న్యూస్. కంపెనీ తమ తర్వాతి తరం మోడల్ అయిన iPhone 18లో RAM సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఫోన్‌లోనే ఆన్‌ డివైస్ ఏఐ ఫీచర్లను మరింత వేగంగా, సమర్థవంతంగా రన్ చేయడం కోసమే యాపిల్ ఈ నిర్ణయం తీసుకోబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ర్యామ్ పెంపు అసలు కారణం..

ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం బాగా పెరిగింది. ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇతర యాప్స్ రన్ అవుతున్నప్పటికీ.. కొత్త ఏఐ ఫీచర్లు ఎలాంటి అడ్డంకి లేకుండా పనిచేయాలంటే ఎక్కువ ర్యామ్ అవసరం. అందుకే యాపిల్ తమ ఫోన్ల ప్రాసెసింగ్ పవర్‌ను పెంచడంపై దృష్టి పెట్టింది.

ఏఐ ఫీచర్లకు మరింత బలం..

Advertisement

ర్యామ్ పెరగడం వల్ల ప్రధానంగా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు మరింత బలంగా మారనున్నాయి. ఇందులో భాగంగా Siri పనితీరు మెరుగుపడటంతో పాటు, వాయిస్ రికగ్నిషన్, వాయిస్ టూ టెక్స్ట్ మార్చే సిస్టమ్‌వైడ్ డిక్టేషన్ టూల్స్ చాలా వేగంగా పనిచేస్తాయి. సమాచారాన్ని క్లౌడ్ సర్వర్లకు పంపకుండా నేరుగా ఫోన్లోనే ప్రాసెస్ చేయడానికి ఈదనపు ర్యామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Also Read: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రాబోతున్న Poco F9 ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. లీకైన వివరాలివే!

విశ్లేషకుల భిన్న అభిప్రాయాలు..

Advertisement

iPhone 18 ర్యామ్‌పై ప్రముఖ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జెఫ్ పూ, కేబీ సెక్యూరిటీస్ వంటి సంస్థలు ఈ ఫోన్ 12GB ర్యామ్‌తో వస్తుందని అంచనా వేస్తుండగా.. ప్రముఖ నిపుణుడు మింగ్ చీ కువో మాత్రం ఇది 9GB ర్యామ్‌తో రావచ్చు అని పేర్కొన్నారు. ప్రస్తుత ఐఫోన్ 17లోని 8GB ర్యామ్‌తో పోలిస్తే ఏది ఏమైనా ఇది పెద్ద అప్‌గ్రేడే.

కంపెనీకి భారీ ఖర్చుల సవాలు..

ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్ల అవసరాలు పెరగడంతో మెమరీ చిప్‌ల ధరలు గణనీయంగా పెరిగాయి. 8GB నుండి 12GBకి ర్యామ్‌ను పెంచడం వల్ల యాపిల్‌కు తయారీ ఖర్చు భారమవుతుంది. ధరలను నియంత్రణలో ఉంచుతూనే.. వినియోగదారులకు నాణ్యమైన ఏఐ అనుభవాన్ని అందించడానికి కంపెనీ తయారీదారులతో చర్చలు జరుపుతోంది.

లాంచ్ ఏప్పుడంటే?

యాపిల్ వ్యూహం ప్రకారం.. ఐఫోన్ 18 మోడల్స్ 2027 ఆరంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ర్యామ్ సామర్థ్యానికి సంబంధించి కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పూర్తి వివరాలు తెలియాలంటే మోడల్స్ అధికారికంగా లాంచ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: భారీ డిస్‌ప్లేతో Xiaomi Mix Fold 5.. గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే?

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×