iPhone Air Price Drop: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రొడక్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేము. ఇటీవలె iPhone Air2 గురించిన చర్చలు ఊపందుకుంటున్న తరుణంలో.. ప్రస్తుత iPhone Air మోడల్‌పై విజయ్ సేల్స్ సంస్థ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. దాదాపు రూ.20 వేల కంటే ఎక్కువ తగ్గింపుతో ఈ ఫోన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ప్రీమియం డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్న ఈ ఐఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశంగా చెప్పవచ్చు.
యాపిల్ సంస్థ iPhone Airను భారతదేశంలో రూ.1,19,900 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో దీనిపై ఏకంగా రూ.20,910 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ రూ.98,990కే అందుబాటులోకి వచ్చింది. ఇది మాత్రమే కాకుండా హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, ఎస్‌బిఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే వారికి అదనంగా మరో రూ.4,000 తగ్గింపు దొరుకుతుంది. ఈ లెక్కన చూసుకుంటే ఫోన్ ధర రూ.94,990కే పరిమితమవుతుంది. నెలకు రూ.15,831తో 6 నెలల నో-కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్ కూడా ఉంది.
Also Read: ఆ బ్రాండ్స్ నుంచి కేక పుట్టించే ఫీచర్లతో కొత్త ఫోన్లు.. జులై 15 నుంచి సేల్స్ షురూ!
iPhone Air ఫీచర్ల విషయానికి వస్తే.. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 6.5 అంగుళాల ఓఎల్ఈడి డిస్‌ప్లేను అందించారు. ఇది ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఫోన్ వేగంగా పనిచేయడానికి ఇందులో యాపిల్ ఏ19 చిప్‌సెట్, 12GB RAM ఉన్నాయి. అలాగే ఫొటోల కోసం వెనుక వైపు 48MP ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 18MP ముందు కెమెరా ఇచ్చారు. ఇది 3,100ma బ్యాటరీ, వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
బరువు తక్కువగా ఉండి, అత్యుత్తమ ఫీచర్లు ఉన్న ప్రీమియం ఐఫోన్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే.. ఇంత పెద్ద మొత్తంలో డిస్కౌంట్ రావడం చాలా అరుదు. ఒకవేళ మీరు వేరే మోడల్స్ చూడాలనుకుంటే iPhone 16 Proని పరిశీలించవచ్చు. లేదా మీకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఇష్టమైతే శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ప్లస్, ఎస్25 అల్ట్రా లేదా షియోమి 14 అల్ట్రా వంటి ఫోన్లు కూడా మంచి ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి.
Also Read: లైవ్ పెర్ఫామర్ల కోసం సోనీ సరికొత్త ఇయర్ మానిటర్స్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ధర వివరాలు ఇవే!