E-Paper
Advertisement

ఆ బ్రాండ్స్ నుంచి కేక పుట్టించే ఫీచర్లతో కొత్త ఫోన్లు.. జులై 15 నుంచి సేల్స్ షురూ!

ఆ బ్రాండ్స్ నుంచి కేక పుట్టించే ఫీచర్లతో కొత్త ఫోన్లు.. జులై 15 నుంచి సేల్స్ షురూ!
Advertisement

Upcoming Smartphones 2026: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వచ్చే వారం మరిన్ని కొత్త ఫోన్లతో సందడి చేయనుంది. మోటరోలా, రియల్‌మీ, వివో, టెక్నో వంటి ప్రముఖ బ్రాండ్లు తమ సరికొత్త మోడళ్లను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆకట్టుకునే డిస్‌ప్లేలు, భారీ బ్యాటరీలు, వేగవంతమైన ప్రాసెసర్లు, దృఢమైన డిజైన్లతో ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. వేర్వేరు బడ్జెట్లలో లభించే ఈ ఫోన్ల ప్రత్యేకతలపై ఒక లుక్కేద్దాం.

Realme Narzo 100x 5G

రియల్‌మీ నుంచి వస్తున్న ఈ ఫోన్ ముఖ్యంగా బ్యాటరీ ప్రియులను అలరించనుంది. ఇందులో ఏకంగా 8000mAh భారీ బ్యాటరీని అందిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల పాటు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 144Hz రిఫ్రెష్ రేట్ గల డిస్‌ప్లే దీని సొంతం. ఆర్మోర్‌షెల్ రక్షణతో మిలిటరీ గ్రేడ్ దృఢత్వాన్ని కలిగి ఉన్న ఈ ఫోన్ జులై 15న అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్లలో విడుదల కానుంది.

Advertisement

Also Read: ఇక గ్రామాల్లోనూ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. వైర్లు లేకుండానే 200 Mbps స్పీడ్, 5TB డేటాతో పాటు ఫ్రీ OTT!

Motorola Edge 70 Max

మోటరోలా కూడా జులై 15నే తమ ప్రీమియం ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. దీనిలో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను వాడారు. గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఆర్క్టిక్‌మెష్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్, 7100mAh బ్యాటరీ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎక్కువ సమయం గేమింగ్, వినోదాన్ని కోరుకునే వారికి ఇది చక్కని ఎంపిక.

Vivo T5 Lite 44W 5G

Advertisement

యువతను దృష్టిలో ఉంచుకుని వివో జులై 16న ఈ సరికొత్త ఫోన్‌ను తీసుకువస్తోంది. రోజంతా నిరంతరాయంగా పనిచేసేందుకు వీలుగా దీనిలో 6500mAh బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ65 రేటింగ్, అలాగే మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీతో ఇది వస్తోంది.

Tecno Camon 50 Ultra 5G

గ్లోబల్ మార్కెట్లో మంచి విజయం సాధించిన ఈ ఫోన్ జులై 17న భారత్‌లో అడుగుపెడుతోంది. ఇందులో 1.5K కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆల్టిమేట్ ప్రాసెసర్‌ను అందించారు. అలాగే ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 13MP కెమెరా ఉన్నాయి. ఐపీ68, ఐపీ69 రేటింగ్స్‌తో పాటు 6500mAh బ్యాటరీ, డాల్బీ అట్మోస్ స్పీకర్లు ఈ ఫోన్ ప్రత్యేకతలు.

Also Read: మిలిటరీ గ్రేడ్ మన్నిక, సూపర్ AI ఫీచర్లు.. తక్కువ ధరలోనే వివో నుంచి నయా 5G స్మార్ట్‌ఫోన్!

Related News

Google Pixel 11 Pro Fold ధర లీక్.. పాత మోడల్‌పై ఏకంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్!

యాపిల్ షాకింగ్ నిర్ణయం.. భారీగా పడిపోయిన iPhone Air.. అసలు కారణం ఇదేనా?

మిలిటరీ గ్రేడ్ మన్నిక, సూపర్ AI ఫీచర్లు.. తక్కువ ధరలోనే వివో నుంచి నయా 5G స్మార్ట్‌ఫోన్!

టెక్నో Camon 50 Ultra 5G ఇండియా లాంచ్ డేట్ ఖరారు.. కలర్స్, స్పెసిఫికేషన్ల వివరాలు మీ కోసం!

Instagramలో మన పర్సనల్ ఫొటోలు, వీడియోలను Meta AI వాడకుండా ఎలా ఆపాలంటే?

అమ్మాయిల కోసమే స్పెషల్ వాచ్! నెక్స్ట్ లెవెల్ లుక్‌తో.. Noise Diva 2 లాంచ్!

వావ్ అనిపించే ఫీచర్లు.. ల్యాప్‌టాప్ కొనేవారికి పండగే, అసూస్ నుంచి ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్!

Big Stories

Advertisement
×