Apple iPhone Ultra: యాపిల్ నుంచి రాబోయే ఫోల్డబుల్ ఐఫోన్‌గా ప్రచారం జరుగుతున్న iPhone Ultraకు సంబంధించి కొత్త వివరాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన CAD రెండర్లలో ఈ ఫోన్ నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఎరుపు వేరియంట్ యాపిల్ గతంలో ఉపయోగించిన ప్రొడక్ట్ రెడ్ షేడ్‌ను పోలి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే ఈ రంగులపై ఇప్పటికీ అధికారిక ధృవీకరణ లేదు.
తాజాగా లీకైన రెండర్లను పరిశీలిస్తే.. ఐఫోన్ అల్ట్రా పుస్తకంలా తెరుచుకునే బుక్‌స్టైల్ ఫోల్డబుల్ డిజైన్‌తో వచ్చే అవకాశం కనిపిస్తోంది. వెనుక భాగంలో అడ్డంగా ఉండే పిల్ ఆకారపు కెమెరా మాడ్యూల్‌లో రెండు కెమెరాలు, ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నట్లు తెలుస్తోంది. బయటి డిస్‌ప్లే మధ్య భాగంలో హోల్ పంచ్ కటౌట్ కనిపిస్తోంది. ఇది సెల్ఫీ కెమెరా కోసం ఉపయోగించే అవకాశం ఉంది. పవర్ బటన్ కుడివైపు ఉండగా, ఇతర బటన్లు కూడా ఫోన్ అంచులపై కనిపిస్తున్నాయి.
Also Read: స్టూడెంట్స్, గేమర్స్ కోసం బెస్ట్ టాబ్లెట్స్.. లెనెవో, షియోమీ నుంచి శాంసంగ్ వరకు!
iPhone Ultra నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో వస్తుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఈ సమాచారం ఖరారైనది కాదు. మరోవైపు ప్రముఖ టిప్‌స్టర్ మార్క్ గుర్మన్ ఈ రెండర్లు ఐఫోన్ అల్ట్రాకు సంబంధించినవి కావని, ఈ ఫోన్ ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల్లో రావడం లేదని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం లీకైన రంగుల విషయంలో భిన్నమైన సమాచారం కనిపిస్తోంది.
iPhone Ultraను యాపిల్ సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు ప్రకటించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం ఇది రాత్రి 10:30 గంటలకు ఉంటుంది. ఇదే ఈవెంట్‌లో iPhone 18 Pro, iPhone 18 Pro Maxతో పాటు AirPads 5, Apple Watch సిరీస్ 12 కూడా పరిచయం కావచ్చని తెలుస్తోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం లీకులు, అంచనాలపైనే ఆధారపడి ఉన్నాయి.
ముఖ్యంగా ఫోన్ రంగులు, డిజైన్, స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలపై యాపిల్ అధికారికంగా ప్రకటించే వరకు ఖచ్చితమైన నిర్ణయానికి రావడం కష్టం. యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకొస్తే.. ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. పెద్ద ఫోల్డబుల్ డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్, ఐఓఎస్ అనుభవం వంటి అంశాలు ఈ ఫోన్‌కు భారీ అంచనాలను తీసుకురావచ్చు.
Also Read: FM రేడియోకు ఏమైంది? స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫీచర్ ఎందుకు మాయమైంది?