E-Paper
Advertisement

FM రేడియోకు ఏమైంది? స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫీచర్ ఎందుకు మాయమైంది?

FM రేడియోకు ఏమైంది? స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫీచర్ ఎందుకు మాయమైంది?
Advertisement

FM Radio: ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ అంటే కాల్స్, మెసేజ్‌లతో పాటు ఎఫ్‌ఎం రేడియో కూడా గుర్తొచ్చేది. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఇంటర్నెట్, డేటా లేకుండానే పాటలు, వార్తలు వినేవాళ్లం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే చాలా ఫోన్లలో ఎఫ్‌ఎం రేడియో కనిపించడం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొన్ని ఫోన్లలో రేడియో ట్యూనర్ ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించే అవకాశం ఉండదు. మరి అసలు ఈ ఫీచర్‌కు ఏమైంది?

రేడియోకు ఆదరణ..

2013లో ఎమిస్ కమ్యూనికేషన్స్ నేతృత్వంలోని సంస్థలు నెక్స్ట్‌రేడియో యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్లలో ఎఫ్‌ఎం రేడియోను అందించేందుకు ప్రయత్నించాయి. స్ప్రింట్ కూడా తన ఫోన్లలో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే మొబైల్ వినియోగదారుల నుంచి ఎఫ్‌ఎం రేడియోకు తగినంత డిమాండ్ లేదని నెట్‌వర్క్ సంస్థల ప్రతినిధి సీటీఐఏ పేర్కొంది. దీంతో ఈ ప్రయత్నాలకు క్రమంగా ఆదరణ తగ్గింది.

5G ప్రభావం..

Advertisement

4జీ, 5జీ నెట్‌వర్క్‌లు వేగంగా విస్తరించడంతో పాటలు, వార్తలు, పాడ్‌కాస్ట్‌లు నేరుగా స్ట్రీమింగ్ యాప్‌లలో వినడం సులభమైంది. యూట్యూబ్, మ్యూజిక్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఎఫ్‌ఎం రేడియో అవసరం చాలామందికి తగ్గిపోయింది. దీంతో ఫోన్ కంపెనీలు కూడా వేగవంతమైన నెట్‌వర్క్, స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి.

Also Read: ఫిలిప్స్ నుంచి అదిరిపోయే 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

హెడ్‌ఫోన్స్ సమస్య..

Advertisement

స్మార్ట్‌ఫోన్‌లో ఎఫ్‌ఎం రేడియో పనిచేయడానికి సాధారణంగా వైర్డ్ హెడ్‌ఫోన్స్ యాంటెన్నాలా పనిచేయాలి. కానీ ఇప్పుడు చాలా ఫోన్లలో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉండటం లేదు. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వాడకం పెరగడంతో ఎఫ్‌ఎం రేడియోను ఉపయోగించడం మరింత కష్టంగా మారింది.

ట్యూనర్ ఉన్నా..

కొన్ని స్మార్ట్‌ఫోన్లలో ఎఫ్‌ఎం ట్యూనర్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ, సాఫ్ట్‌వేర్ ద్వారా దాన్ని డిసేబుల్ చేసి ఉండొచ్చు. శాంసంగ్ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎఫ్‌ఎం రేడియోను అందిస్తోంది. అంటే ఒకే ఫోన్ మోడల్‌లోనూ దేశాన్ని బట్టి ఈ ఫీచర్ అందుబాటులో ఉండొచ్చు లేదా లేకపోవచ్చు.

ముందూ ఇదే పరిస్థితి..

ఫోన్‌లో స్పేస్, కరెంట్ వాడకం, తయారీ ఖర్చు వంటి అంశాలు కూడా కంపెనీలకు ముఖ్యమే. 5జీ, కెమెరాలు, పెద్ద బ్యాటరీలు, ఏఐ ఫీచర్లకు ప్రాధాన్యం పెరగడంతో ఎఫ్‌ఎం ట్యూనర్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. అయినప్పటికీ ఇంటర్నెట్ లేకుండానే వార్తలు, సంగీతం వినే అవకాశం ఉండటం ఎఫ్‌ఎం ప్రత్యేకత. అందుకే కొన్ని మార్కెట్లలో ఈ ఫీచర్ ఇప్పటికీ కొనసాగుతోంది.

Also Read: 7,050mAh బ్యాటరీతో అదరగొట్టనున్న Vivo T5 5G ఫోన్.. లాంచ్ డేట్ ఇదే!

Tags

Related News

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

రూ.799కే.. అదిరిపోయే గేమింగ్ ఇయర్ బడ్స్, డోంట్ మిస్

తక్కువ ధరలో అదిరిపోయే సౌండ్..మ్యూజిక్ లవర్స్‌కు పండగే!

స్టైలిష్ లుక్ కోరుకునేవారి కోసం బెస్ట్.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు

కన్వర్టబుల్ ఫీచర్‌తో.. కొత్త ఎల్జీ ఫ్రిజ్, ధర కూడా చాలా తక్కువ!

రూ.1,599 ధరకే.. బ్లూటూత్ సౌండ్‌బార్, ఆర్జీబీ లైట్లతో..అద్దిరిపోయే సౌండ్

బాహుబలి పవర్ బ్యాంక్.. ఏకంగా లక్ష mAh బ్యాటరీ.. 20 సార్లు ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు!

Big Stories

Advertisement
×