E-Paper
Advertisement

యాపిల్ బిగ్ లీక్.. ఫోల్డబుల్ ఐఫోన్, ఓఎల్ఈడీ మ్యాక్‌బుక్ సహా రాబోతున్న కొత్త డివైజ్‌లివే!

యాపిల్ బిగ్ లీక్.. ఫోల్డబుల్ ఐఫోన్, ఓఎల్ఈడీ మ్యాక్‌బుక్ సహా రాబోతున్న కొత్త డివైజ్‌లివే!
Advertisement

Apple Upcoming Products: టెక్ దిగ్గజం యాపిల్ నుంచి వచ్చే కొత్త డివైజ్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కంపెనీ తాజాగా విడుదల చేసిన సాఫ్ట్‌వేర్ కోడ్‌లో ఊహించని విధంగా భవిష్యత్తులో రాబోయే ప్రొడక్ట్స్‌కు సంబంధించిన కీలక సంకేతాలు కనిపించినట్లు తెలుస్తోంది. ఫోల్డబుల్ ఐఫోన్ నుంచి కెమెరాలతో కూడిన ఎయిర్‌పాడ్స్, ఓఎల్ఈడీ మ్యాక్‌బుక్ వరకు.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 10కి పైగా కొత్త డివైజ్‌ల ప్రస్తావన ఈ లీక్‌లో బయటపడటం ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

ఫోల్డబుల్ ఐఫోన్ వస్తోంది..

ఈ లీక్‌లలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది యాపిల్ మొదటి ‘ఫోల్డబుల్ ఐఫోన్’. చాలా ఏళ్లుగా దీనిపై ప్రయోగాలు చేస్తున్న యాపిల్, త్వరలోనే దీనిని మార్కెట్‌లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో పాటు రాబోయే ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో డిస్‌ప్లే బ్రైట్‌నెస్, మెరుగైన బ్యాటరీ లైఫ్, వేగవంతమైన ప్రాసెసర్‌ను అందించబోతున్నారు.

Advertisement

Also Read: Realme 17 Pro Plus లీక్డ్ ఫీచర్లు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే.. లాంచ్ ఎప్పుడంటే?

కెమెరాలతో కొత్త ఎయిర్‌పాడ్స్..

ఎయిర్‌పాడ్స్ ప్రియుల కోసం యాపిల్ ఓ వినూత్న ప్రయోగానికి తెరలేపింది. తదుపరి తరం ఎయిర్‌పాడ్స్‌లో ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలను అమర్చనున్నట్లు తెలుస్తోంది. ‘విజువల్ ఇంటెలిజెన్స్’ సాంకేతికతతో ఇవి పనిచేస్తాయి. వీటికి తోడు హోమ్‌పాడ్ 3, కొత్త యాపిల్ టీవీ 4కే, స్మార్ట్ హోమ్ హబ్ వంటి సాధనాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

యాపిల్ వాచ్ అప్‌డేట్స్..

Advertisement

యాపిల్ వాచ్ సిరీస్ 12, అల్ట్రా 4 మోడల్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈసారి డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, హెల్త్ ట్రాకింగ్, ఫిట్‌నెస్ ఫీచర్లు, పెర్ఫార్మెన్స్ పెంపొందించడంపైనే కంపెనీ ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం.

ఐప్యాడ్, ఓఎల్ఈడీ మ్యాక్‌బుక్..

భవిష్యత్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో కూడిన ఐప్యాడ్ మిని, శక్తివంతమైన కొత్త చిప్‌లతో పనిచేసే మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. వీటిలో కొన్ని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read: అద్భుతమైన లుక్, మిలిటరీ గ్రేడ్ బిల్డ్‌తో వచ్చేస్తున్న Lava Bold N4 Lite.. లాంచ్ ఎప్పుడంటే?

Tags

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×