E-Paper
Advertisement

అద్భుతమైన లుక్, మిలిటరీ గ్రేడ్ బిల్డ్‌తో వచ్చేస్తున్న Lava Bold N4 Lite.. లాంచ్ ఎప్పుడంటే?

అద్భుతమైన లుక్, మిలిటరీ గ్రేడ్ బిల్డ్‌తో వచ్చేస్తున్న Lava Bold N4 Lite.. లాంచ్ ఎప్పుడంటే?
Advertisement

Lava Bold N4 Lite: బడ్జెట్‌లో ఫోన్ కొనాలనుకునే వారికి ఈసారి లావా పెట్టిన ట్విస్ట్ ఏంటో తెలుసా? పెద్దగా హైప్ లేకుండానే కొత్త ఫోన్‌ను రెడీ చేస్తున్న లావా.. దాని బాడీపై మాత్రం గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అదే Lava Bold N4 Lite. అమెజాన్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్ ఇప్పటికే లైవ్ కావడంతో, లాంచ్ తేదీతో పాటు డిజైన్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఆసక్తికరమైన వివరాలు కూడా బయటకొచ్చాయి. రూ.10,000 లోపు బడ్జెట్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తున్న ఈ కొత్త లావా ఫోన్‌లో ఏముంది? ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? ఇప్పటివరకు బయటకొచ్చిన వివరాలేంటో చూద్దాం.

ఆగస్టు 27న లాంచ్..

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చే ఈనెల 27న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. అమెజాన్ ద్వారా ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా లగ్జరీ లుక్ ఇచ్చే గోల్డ్ కలర్ వేరియంట్‌లో ఈ ఫోన్‌ను లభిస్తుంది. అంతేకాకుండా.. వినియోగదారుల సౌకర్యార్థం ఉచిత డోర్ స్టెప్ సర్వీస్ సదుపాయాన్ని కూడా కంపెనీ అందిస్తోంది.

Advertisement

Also Read: 100% ఛార్జ్ చేయడం ఫోన్‌కు డేంజరా.. టెక్ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ..

ఈ ఫోన్ డిజైన్ పరంగా చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఫోన్ వెనుక భాగం ఫ్లాట్‌గా ఉండి, పైన ఎడమ వైపు చతురస్రాకారంలో కెమెరా మాడ్యూల్‌ను ఇచ్చారు. ఫోన్‌కు సైడ్ ప్యానెల్స్ కూడా ఫ్లాట్‌గా గోల్డెన్ ఫినిషింగ్‌తో మెరిసిపోతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా.. ఇది MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ రేటింగ్‌తో వస్తోంది. అంటే ఫోన్ అనుకోకుండా కింద పడినా తట్టుకునేంత బలంగా ఉంటుంది.

ఇతర కనెక్టివిటీ ఫీచర్లు..

Advertisement

లావా బోల్డ్ N4 లైట్ కింద భాగంలో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్ ఉంటాయి. పాటలు వినడానికి ఇష్టపడే వారి కోసం 3.5mm ఆడియో జాక్‌ను కూడా అందించారు. వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ ఫోన్ కుడి వైపున ప్యాక్ చేశారు. బ్యాక్ ప్యానెల్ కింద భాగంలో బ్రాండ్ నేమ్ లావా అని వర్టికల్‌గా రాసి ఉంటుంది.

ధర ఎంత ఉండొచ్చు?

ఈ కొత్త ఫోన్ గతంలో మార్కెట్లోకి వచ్చి మంచి ఆదరణ పొందిన లావా బోల్డ్ N2 లైట్ మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా రాబోతోంది. ఆ పాత మోడల్ 6.75-అంగుళాల డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 5000mAh బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ కెమెరాతో రూ.7,399కే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త N4 లైట్ మోడల్ కూడా అతి తక్కువ ధరలోనే లభించే అవకాశం ఉంది.

Also Read: బడ్జెట్ ధరలో CMF కొత్త ఇయర్‌బడ్స్.. అదిరిపోయే ఫీచర్లు, ఏకంగా 52 గంటల బ్యాటరీ లైఫ్!

Tags

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×