Vimal Pan Masala : భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆన్ లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుతో టీమిండియా జెర్సీ స్పాన్సర్ డ్రీమ్ 11 తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇప్పటివరకు టీమిండియా జెర్సీ స్పాన్సర్ గా వ్యవహరించిన కంపెనీలు అన్నీకూడా ఆర్థికంగా దివాళా తీయడం విశేషం. టీమిండియా కి స్పాన్సర్స్ చేస్తే కంపెనీలు మూసుకోవాల్సిందే అనే చర్చ ప్రారంభమైంది. డ్రీమ్ 11 కంటే ముందు టీమిండియా కి బైజూస్, ఒప్పో, స్టార్, సహారా సంస్థలు జెర్సీ స్పాన్సర్ గా వ్యవహరించాయి. సహారా సంస్థ సుదీర్ఘ కాలం జెర్సీ స్పాన్సర్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. తాజాగా టీమిండియా కి మరో కొత్త స్పాన్సర్ దొరికినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : Ajinkya Rahane : కోహ్లీ, రోహిత్, పూజారా, అశ్విన్ రిటైర్మెంట్.. అజింక్య రహానేపై ట్రోలింగ్
టీమిండియాకి విమల్ పాన్ మసాలా స్పాన్సర్
విమల్ పాన్ మసాలా టీమిండియా కి 2028 వరకు స్పాన్సర్ వ్యవహరించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడం విశేషం. మరోవైపు డ్రీమ్ 11తో స్పాన్సర్ షిప్ ఒప్పందం రద్దు చేసుకున్నట్టు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా వెల్లడించారు.”ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ చట్టం అమలులోకి వచ్చాక డ్రీమ్ 11తో ఒప్పందం రద్దు చేసుకున్నాం. ఇకపై భవిష్యత్ లో అలాంటి సంస్థలతో బీసీసీఐ ఎలాంటి ఒప్పందాలు చేసుకోదు” అని స్పష్టం చేశారు. దీంతో ఆసియా కప్ లో టీమిండియా మెయిన్ స్పాన్సర్ లేకుండానే ఆడే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక తరుణంలోనే విమల్ పాన్ మసాలా టీమిండియా కి స్పాన్సర్ గా వ్యవహరించనున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించడం విశేషం.
ఆసియా కప్ కి ముందు టీమిండియా కి ఎదురుదెబ్బ
మరోవైపు ఆసియా కప్ ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు ఆటగాళ్లు ఎలాంటి జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే వారి ప్రస్తుత స్పాన్సర్ ఉన్న డ్రీమ్ 11 కీలక నిర్ణయం తీసుకుంది. అయితే జెర్సీ స్పాన్సర్ షిప్ హక్కుల కోసం బీసీసీఐ త్వరలోనే కొత్త బిడ్ లను ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే విమల్ పాన్ మసాలా ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. సెప్టెంబర్ 09న ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు బీసీసీఐ స్పాన్సర్ ను పొందలేకపోతే టీమిండియా లీడ్ స్పాన్సర్ లేకుండానే టోర్నమెంట్ లో ఆడనుంది. మరోవైపు భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దేశ చట్టాలను బోర్డు అనుసరిస్తుందని చెప్పారు. అనుమతి లేకపోతే మేము ఏం చేయలేము. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతీ విధానాన్ని బీసీసీఐ అనుసరిస్తుందని పేర్కొన్నారు.
🚨 BREAKING NEWS 🚨
Vimal Pan Masala is anticipated to be a potential sponsor for the BCCI contract, with the agreement expected to extend until 2028. pic.twitter.com/LGMuiR8Ngf
— muffatball vikrant (@Vikrant_1589) August 25, 2025