E-Paper
Advertisement

వీడియో ఎడిటర్లు, గేమర్లకు ఇక తిరుగులేదు.. ASUS నుండి బెస్ట్ ప్రాసెస్ ల్యాప్‌టాప్స్ వచ్చేశాయ్!

వీడియో ఎడిటర్లు, గేమర్లకు ఇక తిరుగులేదు.. ASUS నుండి బెస్ట్ ప్రాసెస్ ల్యాప్‌టాప్స్ వచ్చేశాయ్!
Advertisement

ASUS TUF Gaming Laptops: గేమింగ్ ప్రియులతో పాటు క్రియేటర్లు, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఆసుస్ తమ బ్రాండ్ TUF గేమింగ్ సిరీస్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం గేమింగ్ మాత్రమే కాకుండా.. రోజూవారీగా చేసే భారీ టాస్క్‌లను కూడా సులువుగా నిర్వహించేలా ఈ కొత్త మోడళ్లను డిజైన్ చేశారు. ఇందులో కొత్త TUF గేమింగ్ 16తో పాటు రిఫ్రెష్డ్ A15, A16, F16 మోడళ్లు ఉన్నాయి.

అద్భుతమైన గ్రాఫిక్స్ పవర్:

ఈ కొత్త సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్ ఆసుస్ TUF గేమింగ్ 16. ఇందులో ఇచ్చిన 16 ఇంచుల పెద్ద డిస్‌ప్లే గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లోని కొన్ని నిర్దిష్ట మోడళ్లలో శక్తివంతమైన ఎన్విడియా జిఫోర్స్ RTX 5060 గ్రాఫిక్స్ కార్డ్‌ను అందించారు. దీంతో హైఎండ్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్‌లు ఆడటంతో పాటు, 4K వీడియో ఎడిటింగ్, 3D డిజైనింగ్ వంటి పనులను కూడా చాలా స్మూత్‌గా పూర్తి చేయవచ్చు.

Advertisement

Also Read: 8000mAh బ్యాటరీ.. 80W ఛార్జింగ్.. Realme P4s 5Gలో ఇవే హైలైట్స్!

బెటర్ కూలింగ్ వ్యవస్థ:

ఆసుస్ TUF సిరీస్ ల్యాప్‌టాప్‌లు అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది వాటి గట్టిదనమే. ఈ కొత్త మోడళ్లలో కూడా అదే రగ్గడ్ డిజైన్‌ను కొనసాగించారు. ముఖ్యంగా TUF గేమింగ్ 16 మోడల్‌కు MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ ధృవీకరణ ఉంది. అంటే.. ఇవి ఎంతటి కఠినమైన పరిస్థితులనైనా తట్టుకోగలవు. ఎక్కువ సమయం గేమింగ్ ఆడినప్పుడు వేడి పుట్టకుండా ఉండేందుకు మెరుగైన కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. తద్వారా ల్యాప్‌టాప్ వేడెక్కకుండా నిరంతరంగా పనిచేస్తుంది.

మేక్ ఇన్ ఇండియా ప్రాధాన్యత:

Advertisement

భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆసుస్, TUF గేమింగ్ A15 మోడల్‌లోని కొన్ని వెర్షన్లను ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాజెక్ట్ కింద స్థానికంగానే తయారు చేయడం విశేషం. వినియోగదారుల బడ్జెట్, అవసరాలకు తగినట్లుగా ఇంటెల్, ఏఎమ్‌డీ రైజెన్ ప్రాసెసర్ ఆప్షన్లను ఈ ల్యాప్‌టాప్‌లలో అందించారు. అలాగే భవిష్యత్తులో మన అవసరాలకు తగ్గట్టుగా ర్యామ్ లేదా స్టోరేజ్ పెంచుకునేందుకు అప్‌గ్రేడ్ సదుపాయం కూడా ఇచ్చారు.

ధరలు, అందుబాటు వివరాలు:

మల్టీ టాస్కింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చే విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, క్రియేటర్లకు ఈ సిరీస్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ కొత్త ఆసుస్ TUF ల్యాప్‌టాప్‌లు కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తాయి. ఆసుస్ ఎక్స్‌క్లూజివ్ రీటైల్ షాపుల్లో కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు.

Also Read: స్టూడెంట్స్, గేమర్స్ కోసం బెస్ట్ టాబ్లెట్స్.. లెనెవో, షియోమీ నుంచి శాంసంగ్ వరకు!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×