E-Paper
Advertisement

గుట్టుచప్పుడు కాకుండా.. ఇంట్లోనే అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కలకలం

గుట్టుచప్పుడు కాకుండా.. ఇంట్లోనే అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కలకలం
Advertisement

LPG Refilling: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం గ్రామం ఘన్‌పూర్‌ ఎక్స్‌రోడ్‌ సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఎల్‌పీజీ గ్యాస్‌ రీఫిల్లింగ్‌ కేంద్రంపై మేడ్చల్‌ ఎస్‌ఓటీ అధికారులు గురువారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా విజయేందర్‌ గుప్తా, సన్నీ గుప్తా, మనీష్‌ గుప్తా, విశాల్‌ గుప్తాలను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమాని రాజేష్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గ్యాస్‌ రీఫిల్లింగ్‌..

దాడిలో పెద్ద సంఖ్యలో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లు, ఏజిస్‌ ప్యూర్‌గ్యాస్‌కు చెందిన 15 కిలోల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్‌ రీఫిల్లింగ్‌కు వినియోగిస్తున్న 4 మోటార్లు, వైర్‌ కనెక్షన్లు, వెయింగ్‌ మెషిన్‌, హీట్‌ మెషిన్‌ కూడా పట్టుబడ్డాయి.అలాగే భారత్‌గ్యాస్‌ హోలోగ్రామ్‌ స్టిక్కర్లు 50, హెచ్‌పీ హోలోగ్రామ్‌ స్టిక్కర్లు 47, ఇండియన్‌ గ్యాస్‌ హోలోగ్రామ్‌ స్టిక్కర్లు 27, ఖాళీ 47 కిలోల సిలిండర్లు 47, ఖాళీ 34 కిలోల సిలిండర్లు 34, ఒక అశోక్‌ లేలాండ్‌ వాహనం, మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Also read: అతి తక్కువ ధరలో.. స్మార్ట్ టీవీ! హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×